Begin typing your search above and press return to search.
సంక్రాంతి వార్ ఫిక్స్.. భీమ్లాకు థియేటర్ల ప్లాన్!
By: Tupaki Desk | 14 Nov 2021 3:54 AM GMT2022 సంక్రాంతి బరిలో నువ్వా నేనా? అంటూ భారీ చిత్రాలు పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా- పాన్ వరల్డ్ చిత్రం ఆర్.ఆర్.ఆర్ కి ధీటుగా బరిలో దిగేందుకు రాధేశ్యామ్ - భీమ్లా నాయక్ సైతం రెడీ అవుతున్నాయి. అయితే సంక్రాంతి బరిలో అందరి కంటే ముందుగా రిలీజ్ తేదీని ఖాయం చేసుకున్న భీమ్లా నాయక్.. ఆర్.ఆర్.ఆర్ టీమ్ రెక్వస్టుతో వెనక్కి తగ్గేందుకు ఆస్కారం ఉందని కథనాలొచ్చాయి.
కానీ దానికి హీరో పవన్ కల్యాణ్ కానీ.. నిర్మాత నాగవంశీ కానీ సిద్ధంగా లేరు. ఇప్పటికే పలుమార్లు భీమ్లా నాయక్ రిలీజ్ తేదీని అధికారికంగా ప్రకటించారు. పోస్టర్లు వీడియోల్లో రిలీజ్ తేదీని స్పష్ఠంగా వెల్లడిస్తున్నారు. ఇక తగ్గేదే లే! అంటూ సంక్రాంతి బరిలో వచ్చేందుకు నిర్మాతల నుంచి పంపిణీ వర్గాలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందని తెలిసింది. ఇకపై థియేటర్లను రెడీ చేసుకోవాల్సి ఉంటుందని గుసగుసలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే నిర్మాత నాగవంశీ నుంచి అధికారికంగా పంపిణీ వర్గాలకు ఈ సమాచారం అందింది.
అయితే సంక్రాంతి బరిలో విడుదలకు వస్తున్న ఆర్.ఆర్.ఆర్ సహా రాధేశ్యామ్ తో పోటీపడుతూ భీమ్లా నాయక్ టీమ్ థియేటర్లను దక్కించుకోవాల్సి ఉంటుంది. ప్రైమ్ ఏరియాల్లో బెస్ట్ థియేటర్లను ఛేజిక్కించుకునేందుకు పంపిణీ వర్గాల్లో హడావుడి ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక పవన్ కి అత్యంత కీలకమైన విశాఖ-ఉత్తరాంధ్ర ఏరియాలో దిల్ రాజు రిలీజ్ చేస్తారా? లేక వేరే ఎవరికైనా హక్కుల్ని కట్టబెట్టారా? అన్నదానిపై స్పష్ఠత రావాల్సి ఉంది. నైజాం- సీడెడ్ సహా అన్ని చోట్లా బయ్యర్లు సంసిద్ధమేనని తెలిసింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మానియా మరోసారి బాక్సాఫీస్ వద్ద కొనసాగుతుందని భీమ్లా నాయక్ టీమ్ భావిస్తోంది. సెకండ్ వేవ్ ఉధృతి ఉన్నప్పుడే వచ్చిన వకీల్ సాబ్ బాక్సాఫీస్ వద్ద అద్భుత వసూళ్లను సాధించింది. ఇప్పుడు పరిస్థితులు అదుపులో ఉన్న సమయంలో వస్తున్న భీమ్లా ఎలాంటి రికార్డులకు తెర తీస్తాడో చూడాలన్న ఆసక్తి అభిమానుల్లో పరిశ్రమ వర్గాల్లో ఉంది.