Begin typing your search above and press return to search.

అమెజాన్ కి సహాయం చేస్తోన్న 'భీమ్లా నాయక్'!

By:  Tupaki Desk   |   24 Feb 2022 8:33 AM GMT
అమెజాన్ కి సహాయం చేస్తోన్న భీమ్లా నాయక్!
X
పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి కలిసి నటించిన 'భీమ్లా నాయక్' సినిమా విడుదలకు అంతా సిద్ధమైంది. సడన్ గా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినా, చెప్పిన సమయానికి వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేయగలిగారు. ఈ సినిమా రేపు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ తీసుకురావడం.. కరోనా థర్డ్ వేవ్ తర్వాత థియేటర్‌లలోకి రాబోతున్న పెద్ద సినిమా కావడంతో అందరూ ఎగ్జైటింగ్ గా ఉన్నారు. అయితే 'భీమ్లా నాయక్' చుట్టూ ఉన్న హైప్ అంతా నేరుగా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీకి సహాయం చేస్తోందని తెలుస్తోంది.

'భీమ్లా నాయక్' మూవీ పోస్ట్ థియేట్రికల్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ+ హాట్‌ స్టార్ మరియు ఆహా వీడియో ఓటీటీలు భారీ ధరకు దక్కించుకున్నట్లు సమాచారం. కానీ ఓటీటీ స్ట్రీమింగ్ భాగస్వామి కాని అమెజాన్ ప్రైమ్ కు పవన్ సినిమా హెల్ప్ అవుతుండటం ఏంటా అని ఆలోచిస్తున్నారా?

వివరాల్లోకి వెళ్తే.. మలయాళంలో ఘనవిజయం సాధించిన 'అయ్యప్పనుమ్ కోషియమ్' చిత్రానికి అధికారిక తెలుగు రీమేక్ గా 'భీమ్లా నాయక్' తెరకెక్కిందనే విషయం తెలిసిందే. ఒరిజినల్ వర్షన్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతోంది. భీమ్లా కోసం ఎదురుచూస్తున్న వారందరూ ఇప్పుడు మాతృకను చూడటం ప్రారంభించారు.

పవన్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒరిజినల్ స్క్రిప్ట్ లో భారీ మార్పులు చేశారు. ఫ్లాట్ ని మాత్రమే తీసుకొని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కథ రెడీ చేసినట్లు తెలుస్తోంది. దీంతో రెండు చిత్రాలకు వ్యత్యాసం ఏంటో చూడాలనే క్యూరియాసిటీ అందరిలో ఉంది.

ప్రమోషనల్ కంటెంట్ ని బట్టి భీమ్లాను పవన్ కళ్యాణ్ సోలో సినిమాగా చేశారేమో అనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. అయినప్పటికీ మాతృకలో కథ - పాత్ర స్వభావాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలనే ఆసక్తి ఫ్యాన్స్ లో ఉంది. అందుకే ఓటీటీలో 'ఏకే' చిత్రాన్ని చూస్తున్నారు.

మరోవైపు రెండు సినిమాలను కంపేరిజన్స్ చేయడానికి.. క్లాసిక్ మూవీని రీమేక్ చేసి చెడగొట్టారని ట్రోల్ చేయడానికి రెడీగా ఉన్న బ్యాచ్ కూడా ఒరిజినల్ వర్షన్ ను చూడటానికి ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో 'అయ్యప్పనుమ్ కోషియమ్' వ్యూవర్ షిప్ మరింత పెరుగుతుండటం అమెజాన్ ప్రైమ్ కు సహాయ పడుతోంది.

నిజానికి పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి లతో ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారని తెలిసినపుడే చాలామంది మలయాళ సినిమాని చూసేసారు. ఇప్పుడు రిలీజ్ సమయం దగ్గర పడుతుండటంతో మిగతా వాళ్ళు కూడా మాతృకను ఓటీటీలో వీక్షిస్తున్నారని తెలుస్తోంది.

ఏదేమైనా 'భీమ్లా నాయక్' సినిమా విడుదలకు ముందే అమెజాన్ కు మంచి హిట్స్ తెచ్చిపెడుతోంది. మరి కోట్లు ఖర్చు చేసి స్ట్రీమింగ్ రైట్స్ కొనుకున్న డిస్నీ+ హాట్‌ స్టార్ మరియు ఆహా వీడియో ఓటీటీలకు రిలీజ్ తర్వాత ఈ సినిమా ఎలాంటి క్రేజ్ తెచ్చిపెడుతుందో చూడాలి.

కాగా, 'అయ్యప్పనుమ్ కోషియమ్' చిత్రాన్ని పవర్ ఫుల్ పోలీసు అధికారి - రాజకీయ నేపథ్యం ఉన్న మాజీ సైనికాధికారి మధ్య అహం, ఆత్మాభిమానం నేపథ్యంలో జరిగిన వైరాన్ని చూపించారు. సచి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ - బిజూ మీనన్ ప్రధాన పాత్రల్లో నటించారు.

'భీమ్లా నాయక్' సినిమా అనేది అహంకారానికి, ఆత్మగౌరవానికి మధ్య ఒక మడమ తిప్పని యుద్ధమని పవన్ కళ్యాణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పేర్కొన్నారు. సాగర్ కె చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు.