Begin typing your search above and press return to search.
ఈ పరిస్థితుల్లోనూ భీమ్లా నాయక్ కుమ్మేశాడు
By: Tupaki Desk | 22 Nov 2021 3:06 AM GMTపవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ను సంక్రాంతికే విడుదల చేస్తామంటూ మరోసారి నాగవంశీ గట్టిగా ప్రకటించాడు. ఆర్ ఆర్ ఆర్ మరియు రాధే శ్యామ్ సినిమాలకు భీమ్లా నాయక్ సైట్ ఇచ్చే అవకాశం లేదని మరోసారి నిర్మాత ట్వీట్ తో తేలిపోయింది. మూడు భారీ సినిమాలైనా.. మూడు సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉన్నా కూడా కనీస గ్యాప్ లేకుంటే మాత్రం మూడు సినిమాలకు నష్టం తప్పదు. ఈ విషయమై బయ్యర్లు కాస్త ఆందోళనలో ఉన్నారు. హీరోల అభిమానులు కూడా ఈ విషయంలో కాస్త టెన్షన్గ ఆ ఉన్నట్లుగా తెలుస్తోంది. భీమ్లా నాయక్ సినిమా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయంటూ కొందరు ఇప్పటికి నమ్ముతున్నారు.
ఈ సమయంలో భీమ్లా నాయక్ దక్కించుకున్న ప్రీ రిలీజ్ బిజినెస్ అద్బుతం అంటున్నారు. డబ్బింగ్ సినిమా అయినా కూడా పవన్ కు ఉన్న క్రేజ్ మరియు సినిమాలో రానా నటించడంతో పాటు త్రివిక్రమ్ స్క్రిప్ట్ మరియు డైలాగ్స్ ను అందించడం వల్ల అంచనాలు భారీగా పెరిగాయి. అందుకే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 95 కోట్ల బిజినెస్ చేసినట్లుగా తెలుస్తోంది. విడుదల విషయంలో కాస్త గందరగోళం ఉన్నా కూడా ఈ స్థాయి బిజినెస్ చేసిందటే సాదారన పరిస్థితుల్లో మరెంతగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. భీమ్లా నాయక్ సినిమా పవన్ మాస్ ఇమేజ్ ను ఓ రేంజ్ లో చూపించబోతున్నట్లుగా ఇప్పటికే విడుదల అయిన టీజర్ మరియు ట్రైలర్ లతో తేలిపోయింది.
మలయాళం మూవీ అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ గా ఈ సినిమా రూపొందిన విషయం తెల్సిందే. పవన్ కు జోడీగా ఈ సినిమాలో నిత్యా మీనన్ నటించింది. పవన్ మరియు రానాల మద్య వచ్చే సన్నివేశాలు పతాక స్థాయిలో ఉంటాయంటూ యూనిట్ సభ్యులు నమ్మకంగా చెబుతున్నారు. సినిమా నుండి ఇప్పటికే వచ్చిన పాటలు మంచి సక్సెస్ దక్కించుకున్నాయి. థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అద్బుతంగా ఇచ్చాడంటూ టాక్ వినిపిస్తుంది. సినిమా చిత్రీకరణ ప్రారంభం అయినప్పటి నుండి వచ్చిన వార్తలు సినిమా అంచనాలను పెంచేసింది. కరోనా పరిస్థితులు మరియు చాలా పోటీ ఉన్నా కూడా ఈ రేంజ్ లో సినిమా బిజినెస్ చేయడం రికార్డు గా చెప్పుకోవచ్చు. విడుదల తర్వాత మరెంతగా ఈ సినిమా విడుదల దక్కించుకునేనో చూడాలి.