Begin typing your search above and press return to search.
భీమ్లా నాయక్ ఓటీటీలో వచ్చేదెప్పుడు?
By: Tupaki Desk | 20 Feb 2022 11:40 AM ISTఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రోజు వచ్చేస్తోంది. ఈ వారంలోనే పవన్ నటించిన భీమ్లానాయక్ మూవీ థియేటర్లలో విడుదల కానుంది.
మలయాళంలో సంచలన విజయం సాధించిన చిత్రాన్నితెలుగులో రీమేక్ చేయటం.. దీనికి సంబంధించి ఇప్పటివరకు విడుదలైన ప్రచార చిత్రాలు.. పాటలు విపరీతమైన ఆదరణను నోచుకోవటంతో పాటు.. ఈ సినిమా విడుదల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.
భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా.. ఎట్టకేలకు ఈ శుక్రవారం విడుదల కానుండటంతో పాటు ఈ సినిమా బిజినెస్ కు సంబంధించి ఆసక్తికర అంశాలు వినిపిస్తున్నాయి.
నాన్ థియేట్రికల్ హక్కులే ఏకంగా రూ.70 కోట్ల వరకు అమ్ముడుపోయాయన్న వార్తల వేళ.. ఓటీటీ విడుదల మీదా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. విపరీతమైన పోటీ నడుమ.. ఈ చిత్ర తెలుగు శాటిలైట్ హక్కులను స్టార్ మా చేజిక్కించుకుంటే.. ఓటీటీ హక్కుల్ని మాత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తో పాటు ఆహాలోనూ విడుదల కానుంది.
ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫాం పెద్దదిగా మారటమే కాదు.. దాని విడుదల మీదా ఆసక్తి వ్యక్తమవుతోంది. దీంతో.. ఓటీటీల్లో భీమ్లా నాయక్ ఎప్పుడు రచ్చ చేస్తాడన్న దాని మీదా ఆసక్తి వ్యక్తమవుతోంది.
ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం సినిమా విడుదలైన 30 రోజులకు కానీ.. 50 రోజులకు కానీ రిలీజ్ చేస్తారని చెబుతున్నారు. సినిమాకు ఉండే డిమాండ్ ఆధారంగా తుది నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు.
అయితే.. భీమ్లానాయక్ తర్వాత నుంచి వరుస పెట్టి పెండింగ్ లో ఉన్న ఎన్నో సినిమాలు వరుస పెట్టి విడుదల అవుతున్న నేపథ్యంలో.. 30 రోజుల్లోనే ఓటీటీలో విడుదల చేసే అవకాశమే ఎక్కువగా ఉందని చెబుతున్నారు. భారీ మొత్తాన్ని వెచ్చించిన నేపథ్యంలో వీలైనంత త్వరగానే ఓటీటీలోనూ విడుదల చేసే అవకాశం ఉందంటున్నారు.