Begin typing your search above and press return to search.
సంక్రాంతి రేస్ నుంచి భీమ్లా అవుట్
By: Tupaki Desk | 21 Dec 2021 7:32 AM GMTపవర్‌స్టార్ పవన్ కల్యాణ్ అభమానులకు మంగళవారం మేకర్స్ బ్యాడ న్యూస్ చెప్పారు. సంక్రాంతి రేసు నుంచి ఈ సినిమా తప్పుకుందని స్పష్టం చేశారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి తొలిసారి కలిసి నటిస్తున్న చిత్రం `భీమ్లా నాయక్`. మలయాళంలో పృథ్వీరాజ్ కుమార్ , సిద్ధిక్ కలిసి నటించిన యాక్షన్ డ్రామా `అయ్యప్పనుమ్ కోషియుమ్`. అక్కడ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈమూవీని తెలుగులో `భీమ్లా నాయక్` పేరుతో రీమేక్ చేసిన విషయం తెలిసిందే.
ఈ చిత్రాన్ని సంక్రాంతికి జనవరి 12న రిలీజ్ చేస్తున్నాం. ఎట్టిపరిస్థితుల్లోనూ వెనకడుగువేసేది లేదంటూ గత కొన్ని రోజులుగా చెబుతూ వచ్చిన మేకర్స్ ఎట్టకేలకు `భీమ్లా నాయక్`ని సంక్రాంతి రేస్ నుంచి తప్పించారు. ఈ విషయాన్ని మేం ముందే చెప్పేశాం. డేట్ కూడా ఫిబ్రవరి 25కు మారుతుందన్నది కూడా క్లారిటీ గా చెప్పాం. అంతే కాకుండా `భీమ్లా రిలీజ్ వాయిదా కోసం ప్రొడ్యూసర్స్ ప్రత్యేకంగా మంగళవారం మీడియా ముందుకు రానున్నారన్నది కూడా చెప్పాం. ఈ రోజు అదే జరిగింది.
మేము చెప్పినట్టుగానే మంగళవారం ఉదయం దిల్ రాజు ఆఫీస్ లో ప్రొడ్యూసర్స్ గిల్డ్ సభ్యులు కె.ఎల్. దామోదర ప్రసాద్, స్రవంతి రవికిషోర్, డీవీవీ దానయ్య, యువీ క్రియేషన్స్ వంశీ, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ వై. రాజీవ్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమై `భీమ్లా నాయక్` రిలీజ్ ని వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించారు. తమ విజ్ఞప్తికి పవన్ కల్యాణ్, నిర్మాత సానుకూలంగా స్పందించారని, పెద్ద సినిమాలు బరిలో వున్నప్పుడు ఇలాంటి ఇబ్బందులు వస్తుంటాయని ఈ సందర్భంగా దిల్ రాజు మీడియాకు వివరించారు.
అంతే కాకుండా సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న `భీమ్లా నాయక్` ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకొస్తుందని ఈ సందర్భంగా దిల్ రాజు ప్రకటించడంతో పవన్ అభిమానులు ఉసూరు మంటూ నిట్టూస్తున్నారు. దీనిపై అభిమానుల నుంచి ఇంత వరకు ఎలాంటి స్పందన రాలేదు. సోషల్ మీడియా వేదికగా పవన్ ఫ్యాన్స్ `భీమ్లా నాయక్` రిలీజ్ వాయిదాపై ఏ స్థాయిలో స్పందిస్తారో.. ఎంత రచ్చ చేస్తారో వేచి చూడాల్సిందే.