Begin typing your search above and press return to search.
యూఎస్ లో భీమ్లా ప్రీ బుకింగ్స్ ఎలా ఉన్నాయంటే..?
By: Tupaki Desk | 17 Feb 2022 10:00 PM ISTపవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి కలయికలో తెరకెక్కిన తాజా చిత్రం ''భీమ్లా నాయక్''. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే - డైలాగ్స్ అందిస్తున్నారు.
ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మూవీ రిలీజ్ డేట్ ని మేకర్స్ ఫిక్స్ చేసారు. ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగుతో పాటుగా హిందీలోకి ఈ సినిమాని డబ్బింగ్ చేసి రిలీజ్ చేయనున్నారు.
యూఎస్ఏలో ఇప్పటికే 'భీమ్లా నాయక్' సినిమా టికెట్ బుకింగ్స్ ప్రారంభించారు. బుకింగ్స్ ఓపెన్ చేసిన రెండు ప్రదేశాలలో గురువారం ఉదయానికి 1067 టిక్కెట్స్ అమ్ముడుపోగా.. ప్రీమియర్‌ల ద్వారా 21,350 డాలర్లు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రీ బుకింగ్ బజ్ ని బట్టి ఓవర్ సీస్ లో పవన్ సినిమా భారీ ఓపెనింగ్స్ రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇటీవల కాలంలో 'అఖండ' 'పుష్ప: ది రైజ్' వంటి సినిమాలు ఓవర్ సీస్ లో మంచి వసూళ్లు రాబట్టిన నేపథ్యంలో.. 'బీమ్లా నాయక్' చిత్రం వాటి నంబర్స్ ను క్రాస్ చేస్తుందని అభిమానులు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతి లభించడంతో పాటుగా.. నైట్ కర్ఫ్యూ ఎత్తేయడంతో పవన్ కళ్యాణ్ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో భారీ ఓపెనింగ్స్ వస్తాయని అంచనా వేస్తున్నారు.
మలయాళంలో సూపర్ హిట్ అయిన 'అయ్యప్పనుమ్ కోషియమ్' చిత్రానికి తెలుగు రీమేక్ గా ''భీమ్లానాయక్'' సినిమా తెరకెక్కింది.
ఇద్దరు సమజ్జీవులైన పోలీసాఫీసర్ - రిటైర్డ్ హవాల్దార్ మధ్య అహం ఆత్మాభిమానం వల్ల వారి జీవితాల్లో ఏర్పడిన పరిస్థితులను ఈ చిత్రంలో చూపించబోతున్నారు. రీమేక్ అయినప్పటికీ పవన్ ఇమేజ్ ను మన సెన్సిబిలిటీలను దృష్టిలో పెట్టుకొని తెలుగులో అనేక మార్పులు చేర్పులు చేశారని తెలుస్తోంది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్లు పాటలు - స్పెషల్ పోస్టర్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో పవన్ కళ్యాణ్ విశ్వరూపం చూస్తారని మేకర్స్ చెబుతున్నారు.
పవన్ కు జోడీగా నిత్యా మీనన్.. రానా సరసన సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా నటించారు. సముద్ర ఖని - రావు రమేష్ - మురళీశర్మ - రఘుబాబు - నర్రా శ్రీను - కాదంబరి కిరణ్ - చిట్టి - పమ్మి సాయి తదితరులు ఇతర పాత్రలు పోషించారు.
పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూర్చారు. రవి కె చంద్రన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు.
ఇప్పటికే 'భీమ్లా నాయక్' సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ అగ్రెసివ్ గా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఈ నెల 21న యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయనున్నారని సమాచారం. అలానే ట్రైలర్ ను కూడా లాంఛ్ చేసే అవకాశం ఉంది. 'వకీల్ సాబ్' తర్వాత పవన్ నుంచి రాబోతున్న ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.