Begin typing your search above and press return to search.
'భీమ్లా నాయక్' ప్రీరిలీజ్ ఈవెంట్ కొత్త డేట్ ఇదే!
By: Tupaki Desk | 22 Feb 2022 7:32 AM GMTపవర్ స్టార్ పవన్ కల్యాణ్ - రానా దగ్గుబాటి తొలి సారి కలిసి నటించిన చిత్రం `భీమ్లా నాయక్`. ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. `అప్పట్లో ఒకడుండేవాడు` ఫేమ్ సాగర్ కె. చంద్ర ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందించిన ఈ మూవీని సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై యంగ్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. మలయాళ హిట్ ఫిల్మ్ `అయ్యప్పనుమ్ కోషియుమ్` ఆధారంగా ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసిన విషయం తెలిసిందే.
గత కొన్ని నెలలుగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ రిలీజ్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి మేకర్స్ తాజాగా గుడ్ న్యూస్ వినిపించారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 25న ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ ప్రకటించడంతో పవన్ ఫ్యాన్స్ తో పాటు రానా అభిమానులు కూడా సెలబ్రేషన్స్ మోడ్ లోకి వెళ్లిపోయారు. వీరి సంబరాలకు మరింత జోష్ ని యాడ్ చేస్తూ మేకర్స్ ట్రైలర్ ని సోమవారం రాత్రి విడుదల చేశారు.
ట్రైలర్ పై అభిమానుల్లో పలు అనుమానాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా రానా ఫ్యాన్స్ ఇందులో తమ హీరోకు ప్రాధాన్యత వుంటుందా? అని అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే వారి అనుమానాలకు తెరదించుతూ ట్రైలర్ లో రానాకు పవన్ తో సమానంగా ప్రాధాన్యత నివ్వడంతో అంతా హ్యాపీగా ఫీలవుతూ సినిమాకు మరింత ప్రచారాన్ని మొదలుపెట్టారు. పవన్, రానా ఫ్యాన్స్ ట్రైలర్ తో ఖుషీ కావడంతో ట్రైలర్ రిలీజైన గంటల్లోనే మిలియన్స్ వ్యూస్ ని రాబట్టి యూట్యూబ్ లో ట్రెండింగ్ మారింది.
ఇదిలా వుంటే ఈ మూవీ రిలీజ్ కు మరో మూడు రోజులే వుండటంతో మేకర్స్ ప్రచార పర్వాన్ని మరింత స్పీడప్ చేసేశారు. ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ని ఈ నెల 23న యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో సాయంత్రం అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నారు. ముందు ఈ నెల 21న అదే ప్రాంగణంలో భారీ స్థాయిలో నిర్వహించాలని ప్లాన్ చేశారు. అయితే అదే రోజు ఏపీ కి చెందిన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో హఠాత్తుగా మృతి చెందిన విషయం తెలిసిందే. ఇలాంటి విషాద సమయంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించడానికి మనస్కరించడం లేదని చిత్ర బృందం ప్రీ రిలీజ్ ఈవెంట్ ని వాయిదా వేశారు.
తాజాగా ఈ నెల 23న బుధవారం సాయంత్రం 6:30 నిమిషాలకు ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహిస్తున్నట్టుగా చిత్ర బృందం సోషల్ మీడియా ట్విట్టర్ వేదిగా మంగళవారం ప్రకటించింది. ఈ సందర్భంగా ఓ ఆసక్తికరమైన పోస్టర్ ని విడుదల చేసింది. ఫైట్ తరువాత గళ్ల లుంగీ లో కింద కూర్చుని పవన్ టీ తాగుతున్న స్టిల్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఎట్రాక్ట్ చేస్తోంది. మాసీవ్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈ వెంట్ కి గులాబీ నేత, మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ప్రత్యేక అతిథిగా సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాసయాదవ్ హాజరు కాబోతున్నారు.