Begin typing your search above and press return to search.
`భీమ్లా నాయక్` ఊపు మాములుగా లేదుగా
By: Tupaki Desk | 23 Feb 2022 2:36 PM GMTపవన్ కల్యాణ్ సినిమా వచ్చిందంటే థియేటర్లలో వుండే సందడి వేరుగా వుంటుంది. ఫ్యాన్స్ హంగామా మమూలుగా వుండదు. చెప్పాలంటే ఓ జాతర వాతావరణం కనిపిస్తుంటుంది. `వకీల్ సాబ్` సినిమా టైమ్ లో అభిమానుల తొక్కిసలాట కారణంగా థియేటర్ల డొర్లు పగిలిపోయిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారి సంచలనం సృష్టించాయి.
ఈ రేంజ్ లో మాస్ హిస్టీరియా వున్న నటుడిగా పవన్ వార్తల్లో నిలిచారు. ఈ మూవీ తరువాత పవన్ నుంచి వస్తున్న చిత్రం `భీమ్లా నాయక్`. చాలా రోజుల తరువాత అంటే `గబ్బర్ సింగ్` తరువాత పవర్ ఫుల్ మాసీవ్ పాత్రలో పవన్ నటించిన సినిమా కావడంతో ఫ్యాన్స్ హంగామా ఓ రేంజ్ లో చేస్తున్నారు.
ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా సంచలనం సృష్టిస్తున్న ఈ మూవీ ఈ శుక్రవారం భారీ స్థాయిలో రిలీజ్ అవుతోంది. రిలీజ్ రెండు రోజులే వుండటంతో బాక్సాఫీస్ వద్ద భీమ్లా ప్రకంపనలు మొదలయ్యాయి.
`వకీల్ సాబ్` టైమ్‌తో ఫ్యాన్స్ చేసిన హంగామాకు మించి భీమ్లా రచ్చ మొదలైంది. ట్రైలర్ రిలీజ్ తరువాత ఫ్యాన్స్ హంగామా పతాక స్థాయికి చేరింది. నెట్టింట భీమ్లా ని ఓ రేంజ్ లో వైరల్ చేస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్ విషయంలో బుక్ మై షో కారణంగా వివాదం నెలకొనడంతో రంగంలోకి దిగిన చాంబర్ ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేసింది.
ఈ వివాదం కారణంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో `భీమ్లా నాయక్` అడ్వాన్స్ బుకింగ్ లు గత మూడు రోజులుగా నిలిచిపోయి మంగళవారం మొదలయ్యాయి. ఒక్కసారిగా ఈ సైట్ పై పవన్ అభిమానులు విరుచుకుపడ్డారు. టకెట్ బుకింగ్ లు స్టార్టయిన క్షణాల్లోనే ఫుల్ అయిపోయాయి.
ప్రతీ షోకు సంబంధించిన టికెట్ లు మొత్తం క్షణాల్లోనే అమ్ముడు పోవడం విశేషం. టికెట్ బుకింగ్స్ మొదలైందని తెలిసేలోపే సోలన్నీ సోల్డ్ ఔట్ అంటూ బోర్డ్ లు ప్రత్యక్షం కావడం సంచలనంగా మారింది. పవన్ సినిమాకున్న డిమాండ్ ని దృష్టిలో పెట్టుకుని కొన్ని టికెట్ లని బ్లాక్ చేశారని చెబుతున్నారు.
టికెట్ బుకింగ్ ఆలస్యంగా ప్రారంభం కావడంతో పవన్ ఫ్యాన్స్ బారీ స్థాయిలో టికెట్ లని సొంతం చేసుకున్నారట. దీంతో `భీమ్లా నాయక్` తొలి రోజు షోలన్నీ హౌస్ ఫుల్స్ అయిపోయాయి. ఇప్పడు తీసుకుందామన్నా ఒక్క టికెట్ కూడా లభించని పరిస్థితి.
ఇక ఫ్యాన్స్ కి మరో గుడ్ న్యూస్ ఏంటంటే తెలంగాణలో పెద్ద చిత్రాలకు ఐదవ షోకు ప్రభుత్వం ఎప్పుడో అనుమతులు ఇచ్చేసింది. ఈ షోకు సంబంధించిన టికెట్స్ ముందే గంపగుత్తగా సోల్డ్ అయిపోయి ఫ్యాన్స్ ఈ షో కోసం ఎప్పుడు 25 వచ్చేస్తుందా? అని ఎదురుచూస్తున్నారు.
తొలి రోజు ఎర్లీ మార్నింగ్ షో తెలంగాణ లోని ప్రధాన థియేటర్లలో శుక్రవారం ఉదయం 7 నుంచి 8 గంటల మధ్యలో పడబోతోంది. ఈ షోకు ఇప్పటికే చాలా వరకు టికెట్ లు అమ్ముడు పోగా మిగతా టికెట్ ల బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయా? అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవన్ కల్యాణ్ టైటిల్ పాత్రలో నటించిన ఈ చిత్రంలో రానా, నిత్యామీనన్, సంయుక్త మీనన్, మురళీశర్మ, రావు రమేష్ కీలక పాత్రల్లో నటించారు.