Begin typing your search above and press return to search.

`భీమ్లానాయ‌క్‌`రాప్ సాంగ్ వింటే ఫ్యాన్స్‌కి పూన‌కాలే

By:  Tupaki Desk   |   7 March 2022 10:03 PM IST
`భీమ్లానాయ‌క్‌`రాప్ సాంగ్ వింటే ఫ్యాన్స్‌కి పూన‌కాలే
X
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ నటించిన‌ తాజా సెన్సేష‌న్ `భీమ్లానాయ‌క్‌` ఇటీవ‌ల థియేట‌ర్ల‌లో విడుద‌లై హ‌ల్ చ‌ల్ చేస్తోంది. మ‌ల‌యాళ సూప‌ర్ హిట్ ఫిల్మ్ `అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్` ఆధారంగా తెర‌కెక్కించారు.

అయితే ప‌వ‌ర్ స్టార్ ఇమేజ్ కి అనుగుణంగా మార్పులు చేర్పులు చేసి మాసీవ్ క్యారెక్ట్ ని డిజైన్ చేయ‌డంతో ఈ మూవీ ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతున్న థియేట‌ర్ల వ‌ద్ద అభిమానులు హంగామా చేస్తూ ప‌వ‌న్ కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. మూడున్న‌రేళ్ల విరామం త‌రువాత బాలీవుడ్ సూప‌ర్ హిట్ ఫిల్మ్ `పింక్‌` ఆధారంగా తెర‌కెక్కిన `వ‌కీల్ సాబ్‌` చిత్రంతో ప‌వ‌న్ మ‌ళ్లీ ట్రాక్ లోకి వచ్చిన విష‌యం తెలిసిందే.

మ‌రో సారి రీమేక్ చిత్రం `భీమ్లానాయ‌క్‌`లో థియేట‌ర్ల‌లో సంద‌డి చేస్తుండ‌టంతో ఫ్యాన్స్ పండ‌గ చేసుకుంటున్నారు. అమ‌లాపురం నుంచి అమెరికా వ‌ర‌కు థియేట‌ర్ల వ‌ద్ద సంద‌డి చేస్తుండ‌టంతో ఈ మూవీ వ‌సూళ్ల ప‌రంగా రికార్డులు సృష్టిస్తోంది.

సినిమా రిలీజ్ కు ముందు `భీమ్లానాయ‌క్‌` టైటిల్ సాంగ్ ని ఆ త‌రువాత డీజే వెర్ష‌న్ ని విడుద‌ల చేసి ఫ్యాన్స్ లో జోష్ ని రెట్టింపు చేసిన త‌మ‌న్ తాజాగా ప‌వ‌న్ అభిమానుల కోసం `భీమ్లానాయ‌క్‌` ర్యాప్ సాంగ్ ని విడుద‌ల చేశాడు.

`భీమ్లానాయ‌క్‌` నుంచి కొత్త పాట‌ని తాజాగా విడుద‌ల చేశారు. `భీమ్లానాయ‌క్ బ్యాక్ ఆన్ డ్యూటీ` పేరుతో రూపొందిన ఈ ర్యాప్ సాంగ్ ఫ్యాన్స్ కి పూన‌కాలు తెప్పించేస్తోంది. ర్యాప్ సాంగ్ మోడ్ లో విడుద‌లైన ఈ వీడియో ఫ్యాన్స్ ని ఉర్రూత‌లూగిస్తోంది.

`వ‌చ్చాడు భీమ్లా.. గ్రానైడ్ బాంబులా.. ` అంటూ సాగే ఈ గీతాన్ని వైష్ణ‌వి కొవ్వూరి, ప్ర‌త్యూష ప‌ల్ల‌పోతు, ర‌చిత రాయప్రోలు - ప‌ర్ణిక - రీటా త్యాగ‌రాజ‌న్ - ల‌క్ష్మీ మేఘ‌న ఆల‌పించ‌డ‌మే కాకుండా ఈ పాట‌కు చ‌క్క‌గా అభిన‌యించారు కూడా. `భీమ్లానాయ‌క్‌` ఆన్ లొకేష‌న్ వీడియోల‌కు సింగ‌ర్స్ పెర్ఫార్మెన్స్ ని జోడించి ఈ వీడియోని వదిలారు.

ర్యాప్ సింగ‌ర్ రోల్ రైడా ర‌చించిన ఈ ర్యాప్ వెర్ష‌న్ కు త‌మ‌న్ సంగీతం అందించ‌మే కాకుండా సింగ‌ర్స్ తో క‌లిసి పాట‌కు స్టెప్పులేస్తూ ప‌వ‌న్ ఫ్యాన్స్ ని హుషారెత్తించే ప్ర‌య‌త్నం చేశారు. సినిమాలోని కీల‌క ఘ‌ట్టాల‌ని ఈ పాట‌కు జోడించారు. దీంతో ర్యాప్ వెర్ష‌ణ్ వీడియో ఫ్యాన్స్ కి పూన‌కాలు తెప్పించేలా వుంది. ఈ పాట‌లో గ‌మ్మ‌త్తైన విష‌యం ఏంటంటే `మ‌న‌ల్మెవ‌ర్రా ఆపేదిక్క‌డ‌.. అంటూ ప‌వ‌న్ అన్న మాట‌ల్ని జోడించ‌డంతో `భీమ్లానాయ‌క్‌` ర్యాప్ సాంగ్ కి మ‌రింత జోష్ యాడ‌యింది.

సోమ‌వారం త‌మ‌న్ స‌ర్ ప్రైజ్ అంటూ విడుద‌ల చేసిన ఈ పాట నెట్టింట సంద‌డి చేస్తోంది. ప‌వ‌న్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ - రానా ద‌గ్గుబాటి తొలిసారి క‌లిసి న‌టించడంతో ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డిన విష‌యం తెలిసిందే. బాక్సాఫీస్ వ‌ద్ద భారీ స్థాయిలో వ‌సూళ్ల‌ని రాబ‌డుతూ సంచ‌ల‌నం సృష్టిస్తున్న ఈ మూవీ ఇటీవ‌ల కొంత డ‌ల్ అయిన‌ట్టుగా క‌నిపించినా తాజాగా మ‌ళ్లీ పుంజుకుని 100 కోట్ల మార్కుని తాక‌డం గ‌మ‌నార్హం.