Begin typing your search above and press return to search.
భీమ్లా.. ముంబైలో మాయాజాలం సృష్టిస్తాడా?
By: Tupaki Desk | 20 Feb 2022 11:51 PM GMTఈ ముంబైలో ఏదోలా బతికేయడానికి రాలేదు. ఉ.. పోయించడానికి వచ్చానని డైలాగ్ చెబుతాడు బిజినెస్ మేన్ మహేష్. పూరి రాసిన ఆ డైలాగ్ ఎంతగా పేలిందో చెప్పాల్సిన పనే లేదు. అయితే ఇటీవలి కాలంలో ముంబై సహా ఉత్తరాదిన తెలుగు సినిమాల హవా ఆ రేంజులోనే మొదలైంది. బాహుబలి ఫ్రాంఛైజీ- సాహో తర్వాత పుష్ప - ది రైజ్ ఉత్తరాది బాక్సాఫీస్ ని షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విజయం ఇతర సినీనిర్మాతల్లో కొత్త హోప్స్ కి కారణమైంది. కరోనా క్రైసిస్ లోనూ పుష్ప చిత్రం హిందీ బాక్సాఫీస్ వద్ద 100కోట్లు వసూలు చేయడం ఆశ్చర్యపరిచింది. హిందీ సినిమాలకే బన్ని కాంపిటీటర్ గా మారాడు. ఇది నిజంగానే స్ఫూర్తి నింపింది. ఇదే స్ఫూర్తితోనే పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ ని హిందీ వెర్షన్ రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహకాల్లో ఉన్నారు.
సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ పర్యవేక్షకుడు. డైలాగ్స్ ఆయనే అందించారు. అయితే భీమ్లా నాయక్ కి అన్నీ తానే అయ్యి చేశారు త్రివిక్రముడు. ఈ సినిమాకి డైలాగ్స్ మాత్రమే అందించడమే కాదు.. ప్రతి ఒక్క పాట కూర్పు.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. సంగీతం.. ఎడిటింగ్.. ప్రమోషన్స్ .. రిలీజ్ ప్లాన్స్‌తో పాటు సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను దాదాపు ప్రతిదీ నిర్మాతలానే చూసుకుంటున్నాడన్నది ప్రత్యేకంగా గుర్తు చేయాల్సినదేమీ లేదు.
హారిక హాసిని నిర్మాత చినబాబు.. సితార ఎంటర్ టైన్ మెంట్ కి చెందిన వంశీతో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా అతడు దీనిని బాధ్యతగా భావిస్తాడు. తన స్నేహితుడు పవన్ కళ్యాణ్ కోసం త్రివిక్రమ్ ఏదైనా చేస్తారు.
ఇంతకుముందు `భీమ్లా నాయక్` షూటింగ్ చివరి రోజు పవన్ కళ్యాణ్ - డిఓపి రవి కె చంద్రన్ లతో ఉన్న ఫోటోలు వెబ్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా త్రివిక్రమ్ తో భీమ్లాకి పని చేసిన సాంకేతిక నిపుణుడి కొత్త ఫోటో వైరల్ గా మారింది. దేశంలో అత్యంత పాపులర్ సౌండ్ ఇంజనీర్ షాదాబ్ రయీన్ .. థమన్ కి అన్నివిధాలా మ్యూజిక్ క్రియేషన్స్ కు కుడి భుజంగా ఉండేవాడు. అతడితో త్రివిక్రమ్ కలిసి ఉన్న ఫోటోగ్రాఫ్ వైరల్ అవుతోంది. ఫిబ్రవరి 25న సినిమా విడుదలకు సిద్ధమవుతుండగా ప్రస్తుతం భీమ్లానాయక్ మిక్సింగ్ వర్క్ కొనసాగుతున్నట్లు తెలిపారు. త్రివిక్రమ్ పర్యవేక్షణలో 7.1 అలాగే 5.1 డాల్బీ అట్మాస్ మిక్సింగ్ చాలా బాగా వస్తోందిట. పవన్ అభిమానులకు స్పెషల్ సౌండ్ తో ట్రీట్ అదిరిపోతుందని టాక్ వినిపిస్తోంది. మరో నాలుగు రోజుల్లో విడుదలకు సిద్ధమవుతున్న భీమ్లా నాయక్ ఇంటా బయటా దుమారం రేపడం ఖాయంగా కనిపిస్తోంది.
ఏపీలో టికెట్ ధరలు పెరగక పోయినా చక్కని వసూళ్లను తెస్తుందన్న అంచనాలున్నాయి. ఇకపోతే హిందీ వెర్షన్ రిలీజ్ పైనా త్రివిక్రమ్ ఎక్కువ ఫోకస్ చేస్తున్నారని సమాచారం. అతడు హిందీ వెర్షన్ స్లాంగ్ పర్ఫెక్షన్ కోసం ప్రత్నిస్తున్నారని తెలుస్తోంది.
భీమ్లా కోసం గని వెనక్కి..!
బాక్సాఫీస్ వద్ద మరోసారి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మానియా వర్కవుట్ కానుందని అంతా భావిస్తున్నారు. అబ్బాయ్ వరుణ్ తేజ్ నటించిన గని రిలీజ్ వాయిదా వేయడానికి ఒక ప్రత్యేక కారణం భీమ్లా వసూళ్లకు అడ్డు పడకూడదనే. ఇకపోతే బాబాయ్ పవన్ కల్యాణ్ కి ఎలాంటి ఇబ్బందీ లేకుండా సైడివ్వడం కోసం వరుణ్ తేజ్ గని చిత్రాన్ని పోస్ట్ పోన్ చేస్తున్నాడన్న టాక్ ఉంది. వరుణ్ తేజ్ నటించిన బాక్సింగ్ కాన్సెప్ట్ మూవీ గని రిలీజ్ తేదీని మార్చారని గుసగుసలు వినిపిస్తున్నాయి. భీమ్లాకు సైడిస్తూ గని చిత్రాన్ని ఫిబ్రవరి 25 నుంచి మార్చి 4వ తేదీకి మార్చారని టాక్ వచ్చింది. అయితే ఇంతలోనే ఈ తేదీ కూడా మారుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
మార్చి 4 కాకుండా మరో కొత్త తేదీకి రావాలని వరుణ్ భావిస్తున్నాడట. దానికి కారణం భీమ్లా నాయక్ రెండు వారాల ఫుల్ రన్ సాగాలనేది వ్యూహం. PK కోసం దారి ఇవ్వడమే దీనుద్ధేశం. ఒకవేళ భీమ్లా రెండు వారాల పాటు చక్కని వసూళ్లను సాధించాలంటే ఇలా చేయాల్సిందేనని వరుణ్ భావించారట.
ఒకవేళ మార్చి 4న గని వచ్చేస్తే అది బాబాయ్ సినిమాకి రెండో వారంలో పోటీగా మారుతుంది. బాబాయ్ మళ్లీ వకీల్ సాబ్ తరహా రిజల్ట్ ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ గని టీమ్ నుంచి కావాల్సిన సహకారం అందుతోందట.