Begin typing your search above and press return to search.
మూవీ రివ్యూ : భీమ్లా నాయక్
By: Tupaki Desk | 25 Feb 2022 6:29 PM GMTచిత్రం : ‘భీమ్లా నాయక్’
నటీనటులు: పవన్ కళ్యాణ్-రానా దగ్గుబాటి-నిత్యా మీనన్-సంయుక్త మీనన్-మురళీ శర్మ-సముద్రఖని-రావు రమేష్-రఘుబాబు-తనికెళ్ల భరణి-నర్రా శీను తదితరులు
సంగీతం: తమన్
ఛాయాగ్రహణం: రవిచంద్రన్
కథ: సాచి
స్క్రీన్ ప్లే-మాటలు: త్రివిక్రమ్ శ్రీనివాస్
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
దర్శకత్వం: సాగర్ కె.చంద్ర
పవన్ కళ్యాణ్-రానా దగ్గుబాటిల కలయికలో తెరకెక్కిన ‘భీమ్లా నాయక్’పై ఉన్న అంచనాల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మలయాళ బ్లాక్ బస్టర్ ‘అయ్యప్పనుం కోషీయుం’ ఆధారంగా యువ దర్శకుడు సాగర్.కె.చంద్ర రూపొందించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా అంచనాలను ఏమేర అందుకుందో చూద్దాం పదండి.
కథ:
భీమ్లా నాయక్ (పవన్ కళ్యాణ్) ఒక నిజాయితీ గల ఎస్ఐ. ఆత్మాభిమానంతో బతికే అతను.. పేదవాళ్లకు.. కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలుస్తూ చుట్టుపక్కల ప్రాంతంలో చాలా మంచి పేరు సంపాదించుకుంటాడు. అలాంటి వ్యక్తికి.. అనుకోకుండా డానియల్ శేఖర్ అలియాస్ డానీ (రానా దగ్గుబాటి) అనే మాజీ ఎంపీ కొడుకు తగులుతాడు. ఒక పార్టీ కోసమని నిబంధనలకు విరుద్ధంగా మద్యం తీసుకెళ్తుండటంతో అతణ్ని భీమ్లా నాయక్ టీం ఆపుతుంది. దురుసుగా ప్రవర్తించిన డానీపై భీమ్లా నాయక్ చేయి చేసుకుంటాడు. తర్వాత అతడిపై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టి ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేస్తాడు. అప్పుడే అతను మాజీ ఎంపీ కొడుకని తెలుస్తుంది. భీమ్లా కొంచెం తగ్గి రాజీ ధోరణిలోకి వచ్చినా.. తనను కొట్టాడన్న కోపంతో భీమ్లాపై పగ తీర్చుకోవడానికి డానీ వ్యూహం పన్నుతాడు. మరి అతనేం చేశాడు.. దీని వల్ల భీమ్లా ఎలా ఇబ్బంది పడ్డాడు.. తర్వాత ఎలా ప్రతిస్పందించాడు.. చివరికి వీరి మధ్య పోరు ఎక్కడిదాకా వెళ్లింది.. అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ:
దబంగ్ టు గబ్బర్ సింగ్.. పింక్ టు వకీల్ సాబ్.. హిందీలో హిట్టయిన సినిమాలను రీమేక్ కోసం ఎంచుకుని.. పవన్ కళ్యాణ్ ఇమేజ్ కు తగ్గట్లుగా వాటిని మార్చి.. క్లాస్ గా సాగిపోయే ఆ కథలకు మాస్ టచ్ ఇచ్చి.. మన ప్రేక్షకులను అలరించేలా తీర్చిదిద్దారు హరీష్ శంకర్.. వేణు శ్రీరామ్. సరిగా ఆడకపోయినా సరే. మరో హిందీ హిట్‘లవ్ ఆజ్ కల్’ను కూడా పవన్ కోసం ‘తీన్ మార్’గా ఉన్నంతలో బాగానే తీర్చిదిద్దింది ఆ చిత్ర బృందం. ఈ మూడు చిత్రాల్లోనూ త్రివిక్రమ్ భాగస్వామ్యం ఉండటం విశేషం. ఇప్పుడు ఆయన మలయాళ బ్లాక్ బస్టర్ ‘అయ్యప్పనుం కోషీయుం’ చూసి ముచ్చటపడి యువ దర్శకుడు సాగర్ చంద్రతో కలిసి తన మిత్రుడి ఇమేజ్ కు సరిగ్గా సరిపోయేలా.. తనదైన టచ్ ఇస్తూ తెలుగీకరించారు. మలయాళంలో క్లాస్ గా.. క్లాసిక్ లాగా కనిపించే ‘అయ్యప్పనుం కోషీయుం’ తెలుగులోకి వచ్చేసరికి మాస్ గా.. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ లాగా తయారైంది. మలయాళ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు ‘అయ్యప్పనుం..’ ఉంటే.. ‘భీమ్లా నాయక్’ పూర్తిగా మన ప్రేక్షకుల టేస్టుకు తగ్గట్లు.. పవన్ కళ్యాణ్ అభిమానులకు నచ్చేలా రూపుదిద్దుకుంది. ‘వకీల్ సాబ్’ను చూసి ‘పింక్’ను పాడు చేశారని ఫీలయ్యే వాళ్లకు.. ‘ఏకే’తో పోల్చి ‘భీమ్లా నాయక్’ కూడా అలాగే అయిందనిపించొచ్చు. కానీ పోలికలు పక్కన పెట్టి చూస్తే ‘భీమ్లా నాయక్’ కథా బలం ఉన్న మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ అనడంలో సందేహం లేదు.
‘పుష్ప’ సినిమాలో హీరో లాగే.. ‘భీమ్లా నాయక్’లో ప్రధాన పాత్రధారులిద్దరూ కూడా ‘తగ్గేదే లే’ అంటూ ముందుకు దూసుకెళ్లేపోయే టైపే. కాకపోతే డానీకి ఇగో కాస్త ఎక్కువ. భీమ్లా ఒంటి మీద ఖాకీ చొక్కా ఉండటం కాస్త అదుపులో ఉంటాడు కానీ.. అతను కూడా తగ్గే రకమేమీ కాదు. మరి ఇద్దరు ఇగోయిస్టులు తగ్గాల్సిన చోట తగ్గకుండా.. ఒకరి మీదికి ఒకరు దూసుకెళ్లిపోతే ఎలా ఉంటుందన్నదే ఈ కథాంశం. అహం అనేది మనిషికి ఎంత ప్రమాదకరమో.. అవసరమైన చోట రాజీ పడకపోతే పరిస్థితులు ఎలా అదుపు తప్పిపోతాయో.. తీవ్ర పరిణామాలు తలెత్తుతాయో పరోక్షంగా చెప్పే ప్రయత్నం జరిగింది ఈ కథతో. కథగా చెప్పుకోవడానికి చాలా చిన్న పాయింటే కానీ.. దీని కథనంలోనే ఉంది ప్రత్యేకత అంతా. పాత్రల పరిచయాలు.. ఎస్టాబ్లిష్మెంట్లు.. ఎలివేషన్లు.. అంటూ కాలయాపన చేయకుండా తొలి సన్నివేశం దగ్గరే కథలోకి దించేసి.. కథనాన్ని చిన్న చిన్న మలుపులతోనే ఆసక్తికరంగా నడిపిస్తూ.. తర్వాత ఏం జరుగుతుందా అనే ఉత్కంఠ రేకెత్తిస్తూ ముందుకు సాగుతుందీ చిత్రం. ఈ కథంతా తిరిగేది చాలా చిన్న సమస్య చుట్టూ. ఆ సమస్యను ఎక్కడ కావాలంటే అక్కడ పరిష్కరించేయొచ్చు. అక్కడితో కథ కూడా ముగిసిపోతుంది. కానీ ‘ఇగో’లతో ఆ సమస్యను పెంచి పెద్దది చేసుకుని చివరికి ప్రాణాల మీదికి తెచ్చుకునే వరకు వెళ్తుంది పరిస్థితి. ఈ క్రమం ఆద్యంతం ఆసక్తికరంగా అనిపిస్తుంది.
ఎంటర్టైన్మెంట్ కోణంలో చూస్తే ‘అయ్యప్పనుం కోషీయుం’తో పోలిస్తే ‘భీమ్లా నాయక్’ ఇంకా మెరుగైందనే చెప్పాలి. ప్రధానంగా అక్కడికి ఇక్కడికి తేడా.. నరేషన్ స్టయిలే. ఒరిజినల్ అంతా కూడా సైలెంటుగా.. సటిల్ గా సాగుతుంది. ప్రధాన పాత్రధారుల్లో ఎవరూ ఎక్కువగా మాట్లాడరు. అరుపులుండవు. డైలాగులు తక్కువ. ఇక పంచులకైతే స్కోపే లేదు. బ్యాగ్రౌడ్ స్కోర్ కూడా కామ్ గా సాగిపోతుంది. కానీ ‘భీమ్లా నాయక్’ ఇందుకు పూర్తి భిన్నం. అన్నింట్లోనూ ఒక ‘లౌడ్ నెస్’ కనిపిస్తుంది. మన ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు ప్రతి సన్నివేశంలోనూ హడావుడి కనిపిస్తుంది. ప్రధాన పాత్రధారులు చేయాల్సిన హంగామా అంతా చేస్తారు. అరుపులు.. కేకలు.. పంచ్ డైలాగులు.. ఎలివేషన్ సీన్లు.. ఫైట్లు.. పాటలు.. వీటన్నింటికీ మించి ప్రతి సన్నివేశంలోనూ ప్రేక్షకుల్ని ఉత్తేజితుల్ని చేసే బ్యాగ్రౌండ్ స్కోర్.. ఇలా మన వాళ్లకు కావాల్సిన ‘మసాలా’ అంతా ఉంది ‘భీమ్లా నాయక్’లో. అదే సమయంలో మాతృకలోని మూల కథను ఎంతమాత్రం చెడగొట్టలేదు. ఒరిజినల్లో రిపిటీటివ్ గా.. కొంచెం బోరింగ్ అనిపించే సన్నివేశాలను తీసేసి.. కొన్ని కొత్త ఆకర్షణలు జోడించి ‘భీమ్లా నాయక్’ను ఫక్తు ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దిన తీరు మెప్పిస్తుంది.
హైలైట్లుగా చెప్పుకోవడానికి ‘భీమ్లా నాయక్’లో చాలా అంశాలే ఉన్నాయి. పవన్ కళ్యాణ్-రానాల ప్రతి ఫేసాఫ్ సీనూ డైనమైట్ లాగా పేలింది. ఇద్దరూ ఎవరూ తగ్గకుండా పవర్ ఫుల్ పెర్ఫామెన్స్ తో ప్రతి సన్నివేశాన్నీ పైకి లేపారు. పవన్ ను అయినా ఇలాంటి పాత్రల్లో ఇంతకుముందు చూశాం కాబట్టి కొత్తగా అనిపించదు కానీ.. రానాను ఇలాంటి పాత్రలో చూడటం చాలా కొత్తగా అనిపిస్తుంది. సినిమాకు ఒక కొత్తదనాన్ని తీసుకొచ్చిన ఘనత అతడికే చెందుతుంది. పవన్ ఇమేజ్ ను సరిగ్గా వాడుకుంటూ మాతృకలో లేని ఎలివేషన్.. మాస్ సన్నివేశాలతో త్రివిక్రమ్-సాగర్ చంద్ర అభిమానులను ఉర్రూతలూగించారు. ముఖ్యంగా తన భార్య జోలికి వచ్చారని డానీ.. అతడి మనుషుల మీదికి వెళ్లి పెట్రేగిపోయే ఎపిసోడ్ అయితే పవన్ అభిమానులను.. మాస్ ప్రేక్షకులను కుదురుగా కూర్చోనివ్వదు. ‘అయ్యప్పనుం కోషీయుం’తో పోలిస్తే.. ‘భీమ్లా నాయక్’లో చేసిన బెస్ట్ ఛేంజ్ ఇదే. పవన్ పాత్రక చిన్న ఫ్లాష్ బ్యాక్.. అలాగే సినిమా ముగింపులో ఇచ్చిన కొత్త ట్విస్ట్ ‘భీమ్లా నాయక్’ను మాతృకతో పోలిస్తే భిన్నంగా నిలబెడతాయి. ఆ ట్విస్టు చాలా కన్విన్సింగ్ గా కూడా ఉండి సినిమాకు చక్కటి ముగింపు కూడా ఇచ్చింది. అలాగే అప్పటిదాకా ఎక్కడా తగ్గకుండా సమస్యను పెద్దది చేసిన హీరోలిద్దరూ.. చివర్లో తగ్గి ‘రాజీ’కి వచ్చే వైనంలో త్రివిక్రమ్ హాస్య చతురత కనిపిస్తుంది. బ్రహ్మానందంతో క్యామియో చేయించి సినిమాను సరదాగా ముగించడంతో ప్రేక్షకులు ఒక పాజిటివ్ ఫీల్ తో బయటికి వస్తారు.
నటీనటులు:
పవన్ కళ్యాణ్ ను భీమ్లా నాయక్ గా చూడటం అభిమానులకు పండగే. పోలీస్ పాత్రలంటే చెలరేగిపోయే పవన్ భీమ్లాగా అదరగొట్టాడు. ఈ పాత్రలో పవన్ చూపించిన ఇంటెన్సిటీ అభినందనీయం. పవన్ నిజ జీవిత వ్యక్తిత్వం కొంతమేర ఆ పాత్రలో ప్రతిఫలిస్తుంది. ఖాకీ చొక్కా తీసేశాక తనలోని మరో కోణాన్ని పవన్ చూపించే సన్నివేశాలు అభిమానులకు కనువిందే. ప్రథమార్ధంలో కొంచెం బ్యాక్ సీట్ తీసుకున్నట్లు అనిపించినా.. రెండో అర్ధంలో మాత్రం పవన్ చెలరేగిపోయాడు. లాడ్జిలో యాక్షన్ ఎపిసోడ్లో పవన్ పెర్ఫామెన్స్ సినిమాకే హైలైట్. ఇక రానా గురించి చెప్పేదేముంది? అతడి కెరీర్లో డానీ పాత్ర ఒక మైలురాయిగా చెప్పొచ్చు. రానా స్క్రీన్ మీద కనిపిస్తుంటే ఇంకెవరినీ చూడబుద్ధేయనంతా చెలరేగిపోయాడు. కొన్ని చోట్ల పవన్ ను కూడా అతను డామినేట్ చేశాడు. పృథ్వీ రాజ్ లాంటి మంచి పెర్ఫామర్ ను మించి ఈ పాత్రలో హైలైట్ కావడమంటే మాటలు కాదు. అతడి స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు కొత్త కళను తీసుకొచ్చింది. నిత్యా మీనన్ తక్కువ నిడివిలోనే తన ప్రత్యేకతను చాటుకుంది. సంయుక్త మీనన్ కూడా బాగా చేసింది. మాతృకతో పోలిస్తే ఈ పాత్ర నిడివి.. ప్రాధాన్యాన్ని పెంచారు. మురళీ శర్మ... సముద్రఖని.. తమ పాత్రలను చక్కగా పోషించారు. రావు రమేష్ ఉన్నంతలో బాగానే వినోదాన్ని పంచాడు. తనికెళ్ల భరణి.. సంజయ్ స్వరూప్ ఓకే.
సాంకేతిక వర్గం:
‘భీమ్లా నాయక్’కు సాంకేతిక నిపుణుల సహకారం బాగా అందింది. తమన్ సంగీతం.. ఛాయాగ్రాహకుడు రవిచంద్రన్ ఛాయాగ్రహణం ‘భీమ్లా నాయక్’కు ఒక ప్రత్యేకత చేకూర్చాయి. సినిమాలో హీరో.. గిరిజన ప్రాంత నేపథ్యానికి తగ్గట్లుగా నేపథ్య సంగీతం.. విజువల్స్ కుదిరాయి. ఈ రెండు విషయాల్లోనూ ఒక ‘నాటుతనం’ తీసుకురావడంతో సినిమాకు ఒక కొత్త కలర్ వచ్చింది. యాక్షన్ ఘట్టాలు.. ఎలివేషన్ సీన్లలో తమన్ చెలరేగిపోయాడు. అతడి పాటలు కూడా ఆకట్టుకుంటాయి. ‘భీమ్లా నాయక్’ టైటిల్ సాంగ్ చిత్రీకరణ కొంచెం ఎబ్బెట్టుగా అనిపిస్తుంది కానీ.. లాలా భీమ్లా పాట మాత్ర ఆకట్టుకుంటుంది. దీని టైమింగ్ కూడా బాగుంది. నిర్మాణ విలువల విషయంలో నాగవంశీ ఏమాత్రం రాజీ పడలేదు. మాతృకతో పోలిస్తే ‘భీమ్లా నాయక్’ చాలా రిచ్ గా కనిపిస్తుంది. ఇక రచయిత త్రివిక్రమ్ కృషి ప్రశంసనీయం. మాతృకకు ఆయన చేసిన మార్పులన్నీ బాగా పని చేశాయి. ముఖ్యంగా ముగింపులో వచ్చే కొత్త ‘ట్విస్టు’ ఆకట్టుకుంటుంది. తన మాటలతో ప్రతి సన్నివేశాన్నీ ఆసక్తికరంగా మార్చారాయన. త్రివిక్రమ్ రాత వరకు తన పనిని సమర్థంగా చేస్తే.. దాన్ని తెరపై ప్రెజెంట్ చేయడంలో దర్శకుడు సాగర్ చంద్ర పనితీరు ప్రశంసనీయం. అయ్యారే.. అప్పట్లో ఒకడుండేవాడు సినిమాలు చూసిన వారికి.. ఇందులోనూ అతడి ముద్రను అర్థం చేసుకుంటారు.
చివరగా: భీమ్లా నాయక్.. పవర్ ఫుల్లు
రేటింగ్-3/5
Disclaimer : This Review is Just An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre