Begin typing your search above and press return to search.
టోటల్ మెగా ఫ్యామిలీ హీరోల కోసం షో!
By: Tupaki Desk | 19 Feb 2022 4:31 AM GMTమెగా ఫ్యామిలీలో లెవన్ ప్లేయర్స్ గురించి నిరంతరం టాలీవుడ్ లో చర్చ సాగుతుంటుంది. టీమిండియా ప్లేయర్స్ లా టాలీవుడ్ ని ఆదుకోవడంలో మెగా ప్లేయర్స్ ఎప్పుడూ ముందుంటున్నారు. ఇంట్లో ఎందరు హీరోలు ఉన్నారు? అనేదాని కంటే అందులో ఎంతమంది సక్సెసయ్యారు? అన్నది లెక్కగడితే సక్సెస్ రేటు కూడా ఎక్కువ ఉన్నది ఈ కుటుంబంలోనే అనడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు.
ఇప్పుడు మెగా ఫ్యామిలీ హీరో నుంచి సినిమా వస్తోంది అంటే ఎలా ఉంటుందో ఊహించండి. మెగా హీరోలు వారి కుటుంబీకుల కోసం ఒక స్క్రీన్ ని బుక్ చేయాలి. ఇప్పుడు భీమ్లా నాయక్ నిర్మాతలు అదే చేశారంటూ టాక్ వినిపిస్తోంది. భీమ్లా నాయక్ గా పవర్ స్టార్ హవా ఏంటో చూసేందుకు మెగాభిమానులతో పాటు మెగా ఫ్యామిలీ కూడా అంతే ఆసక్తిగా ఉంది. ఈ మూవీ టీజర్లు సహా ప్రతిదీ వైరల్ గా దూసుకెళ్లడంతో మూవీపై ఎంతో క్యూరియాసిటీ నెలకొంది.
తాజాగా యుఏ సర్టిఫికేషన్ తో మూవీ రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఇంతలోనే మెగాస్టార్ చిరంజీవి సహా మెగా కుటుంబం కోసం నిర్మాత నాగవంశీ ఓ ప్రివ్యూ షోని ప్లాన్ చేశారని తెలిసింది. మెగాస్టార్ చిరంజీవితో కలిసి చిత్ర కథానాయకులు పవన్ - రానా ఈ మూవీని వీక్షిస్తారని భావిస్తున్నారు. ఇక ఇదే థియేటర్ లో అందరు మెగా హీరోల్ని చూసేందుకు వీలుందనేది టాక్. అయితే ప్రివ్యూ తేదీ ఎప్పుడు ఎప్పుడు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. భీమ్లాను చూసాక మెగాస్టార్ స్పందన ఎలా ఉంటుందో చూడాలి.
త్రివిక్రమ్ పర్యవేక్షణలో సాగర్ కే చంద్ర తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుందని భావిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు - హిందీలో ఫిబ్రవరి 25న రిలీజ్ చేస్తున్నారు.
సితార బ్యానర్ లో ఎగ్జయిట్ మెంట్
ఇక రిలీజ్ కి వారం రోజులే సమయం ఉంది. భీమ్లా తమ బ్యానర్ కి మరో చిరస్మరణీయమైన విజయాన్ని అందిస్తాడని సితార బ్యానర్ భావిస్తోంది.
ఇప్పటికే ఇంటా బయటా బిజినెస్ అదరగొట్టిన సంగతి తెలిసిందే. భీమ్లా నాయక్ USA ప్రీ-రిలీజ్ బిజినెస్ లో సరికొత్త రికార్డు సృష్టించింది. అలాగే కలెక్షన్ల పరంగా రికార్డులు ఖాయంగా కనిపిస్తోంది. ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం అమెరికా ప్రీమియర్ ల ప్రీ-బుకింగ్ లు USD 100 కె మార్క్ ను దాటాయి.
షెడ్యూల్ చేసిన ప్రీమియర్ లకు వారం ముందు కూడా ఇంత. COVID-19 తర్వాత USలో ఏ భారతీయ సినిమాకైనా (హిందీ చిత్రాలతో సహా) ఇదే అత్యధిక కలెక్షన్ రేంజ్ అన తెలిసింది. మునుముందు భీమ్లా నాయక్ మరింతగా వసూళ్ల రికార్డులను సృష్టించడానికి సరి కొత్త రికార్డులను అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్ డమ్ తో పాటు.. రానా దగ్గుబాటి ఎనర్జీ భీమ్లా నాయక్ క్రేజ్ ను పెంచింది.
ఏపీలో టికెట్ రేట్లు పెరిగితే అది కలిసొచ్చేది. కానీ అదేమీ లేకుండానే సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఇతర క్రేజీ సినిమాలేవీ రిలీజ్ కి లేవు కాబట్టి భీమ్లా నాయక్ కి అది ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. ఇక భీమ్లా నాయక్ పాపులర్ మలయాళ హిట్ చిత్రం అయ్యప్పనుమ్ కోషియుమ్ కి రీమేక్.
ఇది ఇప్పటికే చాలా మంది USA ప్రేక్షకులకు సుపరిచితమైన టైటిల్. సాగర్ కె చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. త్రివిక్రమ్ పర్యవేక్షించారు. ఆయనే మాటలు అందించారు. సంక్రాంతి సీజన్‌లో విడుదల చేయాలని భావించినా.. ఆర్ ఆర్ ఆర్ నిర్మాతల అభ్యర్థన మేరకు వాయిదా పడింది. ఇప్పుడు పెద్ద సినిమాల విడుదలల రీషెడ్యూల్ తర్వాత ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. అమెరికాలో ఇది ఫిబ్రవరి 24న ప్రీమియర్లతో ప్రదర్శితం కానుంది. ప్రైమ్ మీడియా దీనిని USలో విడుదల చేస్తోంది. భీమ్లా నాయక్ కోవిడ్-19 తర్వాత ఇప్పటివరకు భారతీయ చలనచిత్రంలో అతిపెద్ద విడుదల కానుంది.