Begin typing your search above and press return to search.
భీమ్లా నాయక్ తరహాలో 'పక్కా కమర్షియల్
By: Tupaki Desk | 25 Jun 2022 2:30 PM GMTఇటీవల కాలంలో సినిమాలకు మేజర్ ఆదాయ మార్గంగా ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ మారిన విషయం తెల్సిందే. ఒకప్పుడు పెద్ద హీరోల సినిమాలకు కూడా కోటి కి కాస్త అటు ఇటుగా ఉండేది. కాని ఇప్పుడు ఏకంగా పదుల కోట్ల నుండి వందల కోట్ల వరకు ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ రేట్లు పలుకుతున్నాయి.
ఎక్కువ శాతం సినిమా లను ఒకే ఒక్క ఓటీటీ సంస్థకు ఇవ్వడం జరుగుతుంది. కాని కొన్ని సినిమాలు మాత్రం రెండు ఓటీటీ లు కలిపి తీసుకుంటున్నాయి.
బాలీవుడ్ లో కొన్ని సినిమాల ఓటీటీ రైట్స్ ను రెండు ఓటీటీ లు కలిసి కొనుగోలు చేయడం గతంలో జరిగేది. ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా అదే పద్ధతి కొనసాగుతోంది. ఆ మద్య విడుదల అయిన పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మరియు ఆహా ఓటీటీ లు స్ట్రీమింగ్ చేసిన విషయం తెల్సిందే.
రెండు ఓటీటీ లు కలిసి ఒకే సినిమాను స్ట్రీమింగ్ చేయడం అనేది ఇక నుండి కంటిన్యూస్ గా జరగబోతున్నట్లుగా తెలుస్తోంది. గోపీచంద్ హీరోగా రాశి ఖన్నా హీరోయిన్ గా మారుతి దర్శకత్వంలో రూపొందిన పక్కా కమర్షియల్ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. ఈ వారంలోనే థియేట్రికల్ రిలీజ కు రెడీగా ఉన్న పక్కా కమర్షియల్ ఓటీటీ స్ట్రీమింగ్ కు సంబంధించిన అప్‌డేట్ వచ్చింది.
పక్కా కమర్షియల్ సినిమాను నెట్ ఫ్లిక్స్ తో పాటు ఆహా ఓటీటీ సంస్థ కూడా కొనుగోలు చేసింది. బన్నీ వాసు సినిమా కనుక ఆహా లో స్ట్రీమింగ్ అవ్వడం కామన్ విషయం. అయితే నెట్ ఫ్లిక్స్ వారు కూడా కొంత మొత్తం ఇచ్చేందుకు ముందుకు రావడంతో అందులో కూడా స్ట్రీమింగ్ కు అనుమతి ఇస్తూ నిర్మాత బన్నీ వాసు నిర్ణయం తీసుకున్నాడు అంటూ సమాచారం అందుతోంది.
ఇక నుండి పెద్ద సినిమాల నుండి చిన్న సినిమాల వరకు ఎక్కువ శాతం సినిమాలను ఓటీటీ రెండు కలిపి స్ట్రీమింగ్ చేయడం ద్వారా ఎక్కువ శాతం ప్రేక్షకులకు చేరువ అవ్వడంతో పాటు నిర్మాతకు అదనపు ఆదాయం అన్నట్లుగా ఉంటుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.