Begin typing your search above and press return to search.

ఫోటోటాక్ : భీమ్లా సెలబ్రేషన్ లో వీరమల్లు సందడి

By:  Tupaki Desk   |   28 Feb 2022 5:14 AM GMT
ఫోటోటాక్ : భీమ్లా సెలబ్రేషన్ లో వీరమల్లు సందడి
X
పవన్ కళ్యాణ్ సినిమా సక్సెస్ అయినా ప్లాప్‌ అయినా కూడా ఒకే రియాక్షన్‌ తో ఉంటాడు. సినిమా సూపర్ హిట్‌ అనగానే ఆహా ఓహో అంటూ సక్సెస్ మీట్‌ లు.. థాంక్స్ మీట్ లో పాల్గొనడు. అలాగే ఫెయిల్‌ అయితే మొహం దాచేయడు. చాలా బ్యాలన్స్ గా ఉండే పవన్‌ కళ్యాణ్ ఈసారి కూడా భీమ్లా నాయక్ సక్సెస్ మీట్‌ కు హాజరు అవ్వలేదు. కాని చిత్ర యూనిట్‌ సభ్యులకు మరియు సన్నిహితులకు ఇచ్చిన పార్టీలో మాత్రం పాల్గొన్నాడు.

త్రివిక్రమ్‌ మరియు చిత్ర నిర్మాతలు ఇచ్చిన భీమ్లా సక్సెస్‌ పార్టీ లో పవన్‌ కళ్యాణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. పవన్‌ వచ్చేందుకు ఓకే చెప్పడం వల్లే ఈ పార్టీ నిర్వహించారని తెలుస్తోంది. పవన్ కళ్యాన్‌ ఎప్పుడు లేనిది భీమ్లా నాయక్‌ సక్సెస్‌ ను సెలబ్రేట్ చేసుకునేందుకు ఒప్పుకున్నాడు అంటూ మీడియా సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. ఆ విషయం పక్కన పెడితే భీమ్లా నాయక్‌ సక్సెస్ పార్టీ లో పవన్‌ కళ్యాణ్‌ తో తదుపరి సినిమాలు చేస్తున్న దర్శకులు సందడి చేశారు.

పార్టీ నైట్‌ లో పవన్‌ కళ్యాన్‌ తో కలిసి హరి హర వీరమల్లు చిత్ర దర్శకుడు క్రిష్ మరియు భవదీయుడు భగత్‌సింగ్‌ సినిమా దర్శకుడు హరీష్ శంకర్ లు సందడి చేశారు. దర్శకుడు క్రిష్ ఈ ఫోటోలను ఇన్‌ స్టా లో షేర్‌ చేశాడు. పవన్ చాలా కూల్‌ అండ్‌ స్టైలిష్ లుక్‌ లో కనిపించాడు. ఎప్పటిలాగే పవన్ కళ్యాణ్ లుక్‌ కు మంచి పేరు వచ్చింది.

దర్శకుడు క్రిష్ షేర్‌ చేసిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. భీమ్లా నాయక్ జోరుతోనే వెంటనే హరి హర వీరమల్లు సినిమాను ముగించేయండి క్రిష్ గారు అంటూ అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే హరి హర వీరమల్లు సినిమా షూటింగ్‌ సగం వరకు పూర్తి అయినట్లుగా దర్శకుడు క్రిష్ గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. త్వరలోనే షూటింగ్‌ పునః ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.

హరి హర వీరమల్లు సినిమా తర్వాత వెంటనే హరీష్‌ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్‌ సింగ్‌ సినిమాను చేసేందుకు పవన్‌ ఓకే చెప్పాడు. ఈ రెండు సినిమాలు కూడా ఇదే ఏడాది షూటింగ్‌ పూర్తి చేసేలా ప్లాన్‌ చేశారు. రాజకీయాలతో బిజీగా ఉంటున్న కారణంగా ఎక్కువ రోజులు సినిమాకు పవన్ కేటాయించలేక పోతున్నాడు. దాంతో పవన్‌ కళ్యాన్ తో తక్కువ సమయంలోనే సినిమాలను ముగించేందుకు ఈ ఇద్దరు దర్శకులు ప్రయత్నాలు చేస్తున్నారు.