Begin typing your search above and press return to search.

భీమ్లా స‌క్సెస్ మీట్‌లో మాంత్రికుడు నోరువిప్పితే..

By:  Tupaki Desk   |   26 Feb 2022 6:30 AM GMT
భీమ్లా స‌క్సెస్ మీట్‌లో మాంత్రికుడు నోరువిప్పితే..
X
`భీమ్లానాయ‌క్‌` స్టార్టింగ్ నుంచి ప్రీ రిలీజ్ వర‌కు మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ సైలెంట్ గానే వుంటూ వ‌చ్చారు. ప్రీ రిలీజ్ వేడుక‌లోనూ ముందుకు రాకుండా వెన‌కాలే వుండి ఈ ప్రాజెక్ట్ కి తెర వెన‌క అంతా తానే చూసుకున్నాన‌నే సంకేతాల్ని అందించారు. ఎందుకు ఇలా గురూజీ మౌనంగా వుంటున్నారు? .. తెర వెనుక ఏం జ‌రుగుతోంది? అన్న‌ది ఎవ‌రికీ అంతు చిక్క‌లేదు. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ తో త్రివిక్ర‌మ్ కున్న బంధం ప్ర‌త్యేక‌మైన‌ది. `జ‌ల్సా` నుంచి వీరిద్ద‌రి మ‌ధ్య మంచి స్నేహ బంధం కొన‌సాగుతోంది. గ‌త కొంత కాలంగా ప‌వ‌న్ కెరీర్ కు ఆయ‌న దిశా నిర్దేశం చేస్తున్నారు.

ఏ సినిమా చేయాలి.. ఏది చేయ‌కూడ‌దు వంటికి త్రివిక్ర‌మ్ నిర్ణ‌యిస్తూ ప‌వ‌న్ కు స‌జెస్ చేస్తున్నార‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. తాజా బ్లాక్ బ‌స్ట‌ర్ `భీమ్లానాయ‌క్‌` రీమేక్ చేయ‌ని సితార ఎంట‌ర్‌టైన్ మెంట్స్ కి, అలాగే మ‌ల‌యాళ సూప‌ర్ హిట్ ఫిల్మ్ `అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్‌` రీమేక్ లో న‌టించ‌మ‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ కి సూచించి ఆ సినిమా చూపించింది త్రివిక్ర‌మేన‌ట‌. త‌ను చెప్పాడు కాబ‌ట్టే `అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్‌` రీమేక్ లో న‌టించ‌డానికి ప‌వ‌న్ క‌ల్యాణ్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది.

తాజాగా ఈ శుక్ర‌వారం విడుద‌లైన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద భారీ క‌లెక్ష‌న్ ల‌ని రాబ‌డుతూ వ‌సూళ్ల సునామీ సృష్టిస్తోంది. త్రివిక్ర‌మ్ ఊహించిన‌ట్టుగానే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది. ప‌వ‌న్ ఖాతాలో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ని అందించింది. ఈ చిత్రానికి త్రివిక్ర‌మ్ డైలాగ్స్ తో పాటు స్క్రీన్ ప్లేని అందించ‌డ‌మే కాకుండా ఈ ప్రాజెక్ట్ కి అన్నీ తాన‌య్యారు. అయ్యారే, అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు ఫేమ్ సాగ‌ర్ కె. చంద్ర డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి త్రివిక్ర‌మ్ ఘోస్ట్ డైరెక్ట‌ర్ గా కూడా వ్య‌వ‌హ‌రించాడంటూ ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో ఓ న్యూస్ చ‌క్క‌ర్లు కొట్టింది.

ఈ వార్త‌ల‌పై త్రివిక్ర‌మ్ పెద‌వి విప్ప‌లేదు.. క‌నీసం కండించ‌లేదు కూడా. త‌న‌పై ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా వాటిని సైలెంట్ గా గ‌మ‌నిస్తూ వ‌స్తున్నాడే కానీ స్పందించ‌డం లేదు. `భీమ్లా నాయక్‌` ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనూ మైక్ ప‌ట్ట‌లేదు. సైలెంట్ గా వెన‌కే వుండి జ‌రిగేదంతా గ‌మ‌నిస్తూ నిల‌బ‌డిపోయారు. `భీమ్లానాయ‌క్` ప్రాజెక్ట్ వెన‌క తానున్నాన‌ని తెలియ‌జుప్పే విధంగా ప్ర‌వ‌ర్తించాడే కానీ ముందుకొచ్చి మాట్లాడే ప్ర‌య‌త్నం చేయ‌క‌పోవ‌డం ప‌లువురిని ఆలోచ‌న‌లో ప‌డేసింది. బండ్ల గ‌ణేష్ ఫోన్ కాల్ వాయిస్ క‌ల‌క‌లం... త‌న‌ని త్రివిక్ర‌మే .. ప‌వ‌న్ కు దూరం చేస్తున్నాడంటూ బండ్ల గ‌ణేష్ మాట్లాడిన ఓ వాయిస్ కాల్ కి సంబంధించిన ఆడియో `భీమ్లానాయ‌క్‌` ప్రీ రిలీజ్ వేడుక ముందు నెట్టింట హ‌ల్ చ‌ల్ చేసిన విష‌యం తెలిసిందే.

దీని పై త్రివిక్ర‌మ్ ఏమైనా మాట్లాడ‌తాడా? అని అంతా ఊమించారు. కానీ మాట్లాడ‌లేదు స‌రిక‌దా.. స్టేజ్ ముందుకు కూడా రాలేదు. ఈ నేప‌థ్యంలో `భీమ్లానాయ‌క్‌` స‌క్సెస్ మీట్ ఆదివారం జ‌ర‌గ‌బోతోంది. ఈ ఈవెంట్ లో గురూజీ తొలిసారి మౌనం వీడ‌బోతున్నార‌ట‌. అయితే ఆయ‌న ఏం మాట్లాడ‌బోతున్నార‌న్న‌ది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బండ్ల‌పై పంచ్ లు సంధిస్తారా? .. లేక సైలెంట్ గా సెటైర్ల‌తో ఇష్యూని కామ్ చేస్తారా అన్న‌ది తెలియాలంటే ఆదివారం వ‌ర‌కు వేచి చూడాల్సిందే అంటున్నాయి ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు.