Begin typing your search above and press return to search.
భీమ్లా ట్రైలర్ ట్రెండింగ్ లో లేదేంటి..?
By: Tupaki Desk | 22 Feb 2022 3:30 PM GMT'వకీల్ సాబ్' తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న ''భీమ్లా నాయక్'' సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మహా శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 25న ప్రపంచ వ్యక్తంగా భారీ స్థాయిలో ఈ మూవీ రిలీజ్ కానుంది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఫస్ట్ లుక్ మొదలుకొని టీజర్లు - పాటలు - స్పెషల్ పోస్టర్స్ అన్నీ విశేష ప్రేక్షకాదరణతో ట్రెండ్ అయ్యాయి. అయితే లేటెస్టుగా వచ్చిన థియేట్రికల్ ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో లేకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
'భీమ్లా నాయక్' ట్రైలర్ ను నిన్న సోమవారం రాత్రి చెప్పిన సమయం కంటే ఒక గంట ఆలస్యంగా విడుదల చేసారు. అయినప్పటికీ రిలీజైన కొన్ని నిమిషాల్లోనే వ్యూస్ - లైక్స్ పరంగా అతి తక్కువ సమయంలో ఫాస్టెస్ట్ ట్రైలర్ గా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసినట్లు మేకర్స్ ప్రకటించారు.
ఇప్పటి వరకు 11 మిలియన్ల వ్యూస్ రాబట్టిన ఈ 2.37 నిమిషాల వీడియో.. 1 మిలియన్ లైక్స్ తో దూసుకుపోతోంది. అయితే ఈ ట్రైలర్ వచ్చి దాదాపు ఒకరోజు కావొస్తున్నా.. ఆశ్చర్యకరంగా ఏ వేదికపైనా ట్రెండింగ్ లో కనిపించడం లేదు.
సాధారణంగా స్టార్ హీరోల సినిమాలకు సంబంధించిన ట్రైలర్ విడుదలైతే అభిమానులు చేసే హడావిడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఇతర హీరోల రికార్డ్ ను బ్రేక్ చేసి కొత్త రికార్డులు నెలకొల్పాలని ముందుగానే ప్లాన్ చేసుకుంటారు. ట్రైలర్ ను సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ లలో ట్యాగ్ లతో షేర్ చేయడం ద్వారా ట్రెండింగ్ లో నిలుపుతారు. కానీ 'భీమ్లా నాయక్' ట్రైలర్ విషయంలో అది జరగలేదు.
నిజానికి 'భీమ్లా నాయక్' ట్రైలర్ ను టాప్ లో పెట్టాలని పవన్ కళ్యాణ్ అభిమానులు గట్టిగానే ప్లాన్ చేసుకున్నారు. అందుకే అన్ని మిలియన్ల వ్యూస్ - లైక్స్ సాధ్యమయ్యాయి. అంత చేసినా యూట్యూబ్ లో ఎందుకు ట్రెండింగ్ లోకి రాలేదనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇకపోతే మెజారిటీ పీకే ఫ్యాన్స్ ను ఈ ట్రైలర్ నిరాశపరిచిందని కామెంట్స్ వస్తున్నాయి.
ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు మించి 'భీమ్లా నాయక్' ట్రైలర్ ఉంటుందని పవన్ ఫ్యాన్స్ ఎక్సపెక్ట్ చేసారు. అయితే ఆశించిన స్థాయిలో లేదని.. అంచనాలను అందుకోలేకపోయిందని అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకునేలా లేదనీ.. త్రివిక్రమ్ శ్రీనివాస్ రేంజ్ లో డైలాగ్స్ వినిపించలేదని ట్రోల్ చేస్తున్నారు. సినిమాలో అన్ని అంశాలు ఉండేలా ట్రైలర్ కట్ చేసినా.. ఏదో తగ్గిందనే అసంతృప్తి కలుగుతోందని అంటున్నారు.
సినిమాలో బీజీఎమ్ - సౌండ్ మిక్సింగ్ ఇలానే ఉంటే కష్టమని 'భీమ్లా నాయక్' మేకర్స్ ను ట్యాగ్ చేసి పోస్టులు పెడుతున్నారు. సినిమా మాత్రం నిరుత్సాహ పరచకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే మ్యూజిక్ థమన్ మాత్రం ట్రైలర్ లోనే అన్నీ ఎక్సపెక్ట్ చేయకూడదని.. ఫారెస్ట్ ఫైర్ కి లోకల్ ఫైర్ కు తేడా ఉందని చెబుతున్నారు. మరి భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
కాగా, 'అయ్యప్పనుమ్ కోశియుమ్' రీమేక్ గా ''భీమ్లా నాయక్'' సినిమా తెరకెక్కింది. ఇందులో పవన్ కళ్యాణ్ తో పాటుగా రానా దగ్గుబాటి కీలక పాత్ర పోషించారు. నిత్యా మీనన్ - సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. సాగర్.కె చంద్ర దర్శకత్వం వహించగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు - స్ర్కీన్ ప్లే అందించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాని నిర్మించారు.