Begin typing your search above and press return to search.

వకీల్‌ సాబ్‌ లో సగం రాబట్టలేక పోయిన భీమ్లా నాయక్‌

By:  Tupaki Desk   |   20 May 2022 8:44 AM IST
వకీల్‌ సాబ్‌ లో సగం రాబట్టలేక పోయిన భీమ్లా నాయక్‌
X
పవన్ కళ్యాణ్ బ్యాక్ టు బ్యాక్ వకీల్‌సాబ్ మరియు భీమ్లా నాయక్ సినిమాలతో భారీ విజయాలను సొంతం చేసుకున్నాడు. రెండు సినిమాలు కూడా మంచి టాక్‌ ను సొంతం చేసుకున్నాయి. కరోనా సెకండ్‌ వేవ్‌ కారనంగా వకీల్‌ సాబ్‌ సినిమా కాస్త వసూళ్ల విషయంలో తగ్గినా కూడా మంచి టాక్ దక్కించుకోవడంతో పాటు ఓటీటీ మరియు శాటిలైట్ టెలికాస్ట్‌ ద్వారా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నట్లుగానే నెంబర్స్ ను నమోదు చేసిందట.

వకీల్‌ సాబ్‌ కు ఏమాత్రం తగ్గకుండా భీమ్లా నాయక్ సినిమా పవన్ అభిమానులకు ఫుల్‌ మాస్ మసాలా విందు భోజనం ను ఇచ్చిన విషయం తెల్సిందే. ఈ రెండు సినిమాలు కూడా వసూళ్ల విషయంలో మరియు టాక్ విషయంలో పవన్ కెరీర్ లోనే ది బెస్ట్ అనిపించుకున్నాయి. అంతటి విజయాన్ని సొంతం చేసుకున్న ఈ రెండు సినిమాల శాటిలైట్‌ రేటింగ్‌ పోల్చి చూస్తే ఆశ్చర్యం వేయక మానదు.

వకీల్‌ సాబ్‌ సినిమా మొదటి సారి శాటిలైట్ టెలికాస్ట్‌ అయిన సమయంలో దాదాపుగా 19.2 టీఆర్పీ వచ్చింది. ఆ తర్వాత టెలికాస్ట్‌ సమయంలో కూడా భారీగానే రేటింగ్‌ ను వకీల్‌ సాబ్‌ నమోదు చేసింది. కాని ఇటీవల విడుదల అయిన భీమ్లా నాయక్ మాత్రం శాటిలైట్ టెలికాస్ట్‌ విషయంలో నిర్మాతలను మరియు పవన్‌ అభిమానులను షాక్ కు గురి చేసేలా రేటింగ్ నమోదు చేసింది.

ఇటీవల భీమ్లా నాయక్ సినిమా స్టార్‌ మా లో టెలికాస్ట్‌ అయ్యింది. పెద్దగా పోటీ లేని సమయంలోనే.. మంచి ప్రైమ్‌ టైమ్‌ లోనే భీమ్లా నాయక్‌ ను టెలికాస్ట్‌ చేయడం జరిగింది. అయినా కూడా రేటింగ్‌ కనీసం పది కూడా దక్కలేదు. 9.23 గా నమోదు అయినట్లుగా సమాచారం అందుతోంది. వకీల్‌ సాబ్‌ లో దాదాపు సగం రేటింగ్‌ మాత్రమే భీమ్లా నమోదు చేయడం ఆశ్చర్యంగా ఉందంటున్నారు.

పవన్ కళ్యాణ్ మరియు రానాలు కలిసి నటించిన ఈ సినిమాలో నిత్యా మీనన్ కీలక పాత్రలో కనిపించింది. ఈ సినిమా రచన వ్యవహారంను త్రివిక్రమ్‌ చూసుకున్నాడు. సాగర్‌ చంద్ర దర్శకత్వంలో రూపొందిన భీమ్లా నాయక్ కు థమన్ సంగీతం అందించాడు. థియేట్రికల్‌ రిలీజ్ లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.. అలాగే ఓటీటీ లో కూడా మంచి స్పందన దక్కించుకుంది. ఎక్కువ మంది అప్పటికే చూడటం వల్ల శాటిలైట్ టెలికాస్ట్‌ ను జనాలు పట్టించుకోలేదేమో అనేది కొందరి అభిప్రాయం.