Begin typing your search above and press return to search.
'భీమ్లా నాయక్' తో రానా - సాగర్ లకు సంబంధం లేదా..?
By: Tupaki Desk | 16 Aug 2021 5:49 AM GMTపవన్ కళ్యాణ్ సినిమాకు సంబంధించిన అప్డేట్ వస్తే సోషల్ మీడియాలో ఉండే హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నిన్నటి నుంచి పవన్ అభిమానులు చేస్తున్న సందడి చూస్తూనే ఉన్నాం. పవర్ స్టార్ నటిస్తున్న తాజా చిత్రానికి ''భీమ్లా నాయక్'' అనే టైటిల్ ఖరారు చేసిన మేకర్స్.. ఫస్ట్ గ్లిమ్స్ ని రిలీజ్ చేశారు. 'లాలా.. భీమ్లా.. అడవి పులి.. గొడవపడే.. ఒడిసిపట్టు.. దంచికొట్టు' అంటూ వచ్చిన ఈ వీడియో పీకే ఫ్యాన్స్ కి పూనకలు తెప్పిస్తోంది.
గళ్ళ లుంగీ పైకి కట్టుకొని 'హే డానీ.. బయటికి రారా నా.. కొ*కా..' అంటూ పవన్ కల్యాణ్ చెప్పిన పవర్ డైలాగ్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. పవన్ ని చాలా ఏళ్ళ తర్వాత ఇలా చూస్తున్నందుకు వారు ఖుషీ అవుతున్నారు. ఈ క్రమంలో ''భీమ్లా నాయక్'' గ్లిమ్స్ సోషల్ మీడియాలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ యూట్యూబ్ లో టాప్ పొజిషన్ లో ట్రెండ్ అవుతోంది. ఇదంతా బాగానే ఉంది. కానీ అదే సమయంలో ఈ చిత్రంలో మరో హీరో రానా దగ్గుబాటి ని మేకర్స్ సైడ్ చేసారని ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతున్నారు.
మలయాళంలో సూపర్ హిట్ అయిన 'అయ్యప్పనుమ్ కొశీయుమ్' తెలుగు రీమేక్ లో పవన్ కళ్యాణ్ - రానా కలిసి నటిస్తున్నారనే సంగతి అందరికీ తెలిసిందే. మాతృకలో బిజు మీనన్ చేసిన పోలీస్ పాత్రలో పవన్.. పృథ్వీరాజ్ నటించిన రిటైర్డ్ హవల్దార్ పాత్రలో రానా కనిపించనున్నారు. మలయాళంలో ఇద్దరు హీరోల పాత్రల పేర్లు అయ్యప్ప - కొశీ వచ్చేలా టైటిల్ పెట్టారు. ఎందుకంటే ఇందులో ఇద్దరివీ ఈక్వెల్ ప్రాధాన్యత ఉన్న రోల్స్. నువ్వా నేనా అన్నట్లు పోటీపోటీగా ఉంటాయి.
కానీ ఇప్పుడు తెలుగు రీమేక్ విషయానికి వచ్చే సరికి మల్టీస్టారర్ గా కాకుండా.. ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోలో మూవీగా మార్చేస్తున్నారని కామెంట్స్ వస్తున్నాయి. ఇందులో పవన్ పోషిస్తున్న 'భీమ్లా నాయక్' పాత్ర పేరునే టైటిల్ గా పెట్టడాన్ని బట్టే ఈ విషయం మీద అందరూ ఓ ఐడియాకి వచ్చారు. రీమేక్ కాకపోయి ఉంటే పవన్ సినిమాలో రానా కూడా ఒక కీలక పాత్ర చేస్తున్నాడని అందరూ అనుకునేవారు. 'బాహుబలి' సినిమా తరహాలోనే ఇందులో రానా పాత్ర ఉంటుందని సర్దుకుపోయేవారు.
కానీ ఇది ప్రస్తుతం అమెజాన్ ఓటీటీలో అందుబాటులో ఉన్న సినిమా. ఇందులో ఇద్దరి పాత్రలు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. తెలుగులో పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్నారని మేకర్స్ ప్రకటించారు కూడా. అందుకే 'భీమ్లా నాయక్' అనే టైటిల్ పెట్టడం పై రానా అభిమానులు సీరియస్ అవుతున్నారు. అయితే దీనిపై నిర్మాత నాగవంశీ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అప్పుడే ఫైనల్ డెసిజన్ కి రావొద్దని.. ప్రతిదీ టైమ్ ప్రకారం వస్తుందని.. అప్పటి వరకు వెయిట్ చేయమని చెబుతున్నారు. దీనిని బట్టి త్వరలోనే రానా కు సంబంధించిన స్పెషల్ గ్లిమ్స్ రిలీజ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏదేమైనా ఈ విషయంపై సోషల్ మీడియాలో చర్చలు ఆగడం లేదు.
ఇకపోతే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న మరో టాపిక్.. 'భీమ్లా నాయక్' డైరెక్టర్ ఎవరు? అని. 'అప్పట్లో ఒకడుండేవాడు' సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న సాగర్ కె. చంద్ర ఈ చిత్రానికి దర్శకుడిగా తీసుకున్నారు. స్క్రీన్ ప్లే - డైలాగ్స్ బాధ్యత మాత్రం హీరో నిర్మాతలకు సన్నిహితుడైన త్రివిక్రమ్ శ్రీనివాస్ లకు అప్పగించారు. అయితే తెర మీద పేరు సాగర్ దే అయినా.. వెనకుండి అన్నీ చూసుకుంటుంది త్రివిక్రమ్ అని మొదటి నుంచీ ప్రచారం జరుగుతోంది.
ఇటీవల విడుదలైన మేకింగ్ వీడియో దగ్గర నుంచి వర్కింగ్ స్టిల్స్ వరకూ.. ప్రతీ దాంట్లోనూ త్రివిక్రమ్ ని హైలైట్ చేసి చూపించారు. అధికారికంగా ప్రకటించకపోయినా.. త్రివిక్రమ్ ఈ చిత్రానికి దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేస్తున్నారని అందరూ ఓ క్లారిటీకి వచ్చేసారు. యంగ్ డైరెక్టర్ కు అనుభవం ఉన్న దర్శకుడి సపోర్ట్ ఉంటే ఔట్ పుట్ ఇంకా బాగా వచ్చే అవకాశం ఉంది.. కాబట్టి అందులో తప్పు పట్టాల్సింది ఏమీ లేదు. కానీ అసలు సాగర్ చంద్ర కు 'భీమ్లా నాయక్' కు సంబంధమే లేదన్నట్లు మ్యూజిక్ డైరెక్టర్ లాంటి వారు వ్యవహరించడమే సినీ అభిమానులకు ఇబ్బందిగా అనిపిస్తోంది.
'భీమ్లా నాయక్' కు మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్న థమన్ ఈ సినిమా గురించి ట్వీట్ చేస్తూ.. రియల్ డైరెక్టర్ సాగర్ ని వదిలేసి త్రివిక్రమ్ ని మాత్రమే ట్యాగ్ చేయడం దారుణం అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. త్రివిక్రమ్ పర్యవేక్షణలోనే ఈ సినిమా తెరకెక్కుతుందన్నది ఓపెన్ సీక్రెట్ అయినప్పటికీ.. డైరెక్టర్ గా సాగర్ కె చంద్ర ని తీసుకోని.. ఇలా కూరలో కరవేపాకులా పక్కన పెట్టేయడం ఏంటని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. మరి రాబోయే ప్రమోషనల్ కంటెంట్ విషయంలో అయినా దర్శకుడికి క్రెడిట్ ఇస్తారేమో చూడాలి.