Begin typing your search above and press return to search.

భీమ్లాకు పోటీగా `వ‌లీమై`ని వ‌దిలాడు?

By:  Tupaki Desk   |   20 Feb 2022 12:04 PM IST
భీమ్లాకు పోటీగా `వ‌లీమై`ని వ‌దిలాడు?
X
తెలుగోడికి తెలుగు వాడే పోటీనా? ఇది చాలా రెగ్యుల‌ర్ ప్ర‌శ్న‌. ఓవర్సీస్ లో అయినా తెలుగు గ‌డ్డ మీద‌నే అయినా.. తెలుగు వాడికి తెలుగు వాడే పోటీ. మ‌న‌వాళ్లు మ‌న‌వాళ్ల‌తోనే పోటీప‌డ‌తారు. ఇక సినిమా బిజినెస్ కి ఇదేమీ కొత్త కాదు. ఓవ‌ర్సీస్ లో భీమ్లా నాయ‌క్ కి అసాధార‌ణ క్రేజ్ నెల‌కొంది.

తాజా స‌మాచారం మేర‌కు.. రిలీజ్ ముందే అమెరికాలో ఇప్ప‌టికే 200కె డాల‌ర్ల‌ను మించి టికెట్లు అమ్మ‌డుయ్యాయి. ఓవ‌ర్సీస్ మొత్తం క‌లుపుకుంటే 350 కె డాల‌ర్ల వ‌సూల్ సాధ్య‌మ‌వుతోంద‌ని రిపోర్ట్.

ఇక‌పోతే తెలుగు రాష్ట్రాల్లోనూ భీమ్లా నాయ‌క్ హ‌వా బాగానే ఉంటుంద‌ని అంచ‌నా. కానీ ఏపీలో టికెట్ రేట్ల‌తోనే స‌మ‌స్య‌. నైజాంలో రిక‌వ‌రీ సులువుగా అవుతుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో భీమ్లా నాయ‌క్ తో పోటీప‌డుతూ అజిత్ `వ‌లీమై` రిలీజ‌వుతోంది. భీమ్లా కంటే ఒక‌రోజు ముందే అంటే ఫిబ్ర‌వ‌రి 24న అజిత్ వ‌లీమై విడుద‌ల‌వుతోంది.

ఈ మూవీ కోసం ఏకంగా 750 స్క్రీన్లు అందుబాటులో ఉన్నాయి. దీనికి కార‌ణం ఒక తెలుగు అగ్ర‌ డిస్ట్రిబ్యూట‌ర్. ఇక‌పోతే ప‌వ‌న్ సినిమా త‌మిళనాడులో రిలీజైతే అన్ని థియేట‌ర్ల‌ను ఇస్తారా? అంటే డౌటే.

ప‌వ‌న్ మానియా ముందు ఏదీ నిల‌వ‌దు!

ప‌వ‌న్ క‌ల్యాణ్ - రానా ప్ర‌ధాన‌పాత్ర‌ల్లో న‌టించిన భీమ్లా నాయ‌క్ ఫిబ్ర‌వ‌రి 25న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌వుతోంది. ఇప్ప‌టికే మూవీ ప్ర‌మోష‌న్స్ ని పీక్స్ కి తీసుకెళుతున్న సంగ‌తి తెలిసిందే. పోటీలో ఎందరు ఉన్నా ప‌వన్ మానియా ముందు ఎవ‌రూ నిల‌వ‌ర‌న్న‌ది స‌త్యం.

ఇప్ప‌టికే ఈ మూవీకి సెన్సార్ పూర్త‌యింది. సెన్సార్ బృందం యుఏ స‌ర్టిఫికెట్ అందించి కంటెంట్ పై ప్ర‌శంస‌లు కురిపించింది. భీమ్లా ఇప్ప‌టికే ఇంటా బ‌య‌టా బిజినెస్ అద‌ర‌గొట్టిన సంగ‌తి తెలిసిందే. భీమ్లా నాయక్ USA ప్రీ-రిలీజ్ బిజినెస్ లో సరికొత్త రికార్డు సృష్టించింది. అలాగే క‌లెక్ష‌న్ల ప‌రంగా రికార్డులు ఖాయంగా క‌నిపిస్తోంది.

పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్ డమ్ తో పాటు.. రానా దగ్గుబాటి ఎన‌ర్జీ భీమ్లా నాయక్ క్రేజ్ ను పెంచింది. ప‌వ‌ర్ స్టార్ క్రేజ్ మ‌రోసారి వ‌ర్క‌వుట్ అయ్యేందుకు అవ‌కాశం కూడా ఉంది. గ‌ని స‌హా ఇత‌ర క్రేజీ సినిమాలేవీ రిలీజ్ కి లేవు కాబ‌ట్టి భీమ్లా నాయ‌క్ కి అది ప్ల‌స్ అవుతుందేమో చూడాలి. ఇక అనువాద చిత్రం వ‌లీమైకి క్రేజ్ దృష్ట్యా కొన్ని హ‌ద్దులు ఉంటాయి.. అది కూడా భీమ్లాకి ప్ల‌స్ కానుంది.