Begin typing your search above and press return to search.
ఆర్టీసీ బస్సులో ‘భీష్మ’ సినిమా.. స్పందించిన కేటీఆర్
By: Tupaki Desk | 28 Feb 2020 7:25 AM GMTటాలీవుడ్ హీరో నితిన్ నటించిన చిత్రం ‘భీష్మ’. ఇటీవల విడుదలైన ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. ప్రేక్షకాదరణ పొందిన ఈ మూవీ పైరసీకి గురైంది. తాజాగా హైదరాబాద్ నుంచి జిల్లాలకు వెళ్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులోని టీవీలో ‘భీష్మ’ సినిమాను వేశారు.
కొత్త సినిమా ఆర్టీసీ బస్సులో రావడంతో అవాక్కైన ఓ ప్రయాణికుడు దీన్ని తన మొబైల్ లో వీడియో తీసి ట్విట్టర్ లో చిత్ర బృందానికి పంపాడు. దీనిపై షాక్ అయిన హీరో నితిన్ ఈ విషయాన్ని ‘ఫిల్మ్ చాంబర్’లోని యాంటీ పైరస్ విభాగానికి ఫిర్యాదు చేశాడు. వీరు గురువారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ సినిమా ఈనెల 21న విడుదలైంది. నాలుగో రోజే ఆర్టీసీ బస్సులో ప్రదర్శించారు. ఇతర మాధ్యమాలు, సోషల్ మీడియాలోనూ విస్తరించకుండా చర్యలు చేపట్టాలని చిత్రం యూనిట్ పోలీసులను కోరింది.
కాగా తాజాగా ‘భీష్మ’ చిత్రాన్ని ఆర్టీసీ బస్సు లో ప్రదర్శించారని ఆ చిత్ర దర్శకుడు ట్విట్టర్ లో కేటీఆర్ కు ఫిర్యాదు చేశాడు. దీనిపై స్పందించిన కేటీఆర్.. ‘మంత్రి పువ్వాడకు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళుతానని.. ఆర్టీసీ బస్సుల్లో పైరసీ చిత్రాలను ప్రదర్శించకుండా చర్యలు తీసుకోవాలని రవాణా అధికారులు, మంత్రికి సూచించారు.