Begin typing your search above and press return to search.
భీష్మ బిజినెస్ రేంజ్ ఎంతో తెలుసా?
By: Tupaki Desk | 20 Feb 2020 9:47 AM GMTనితిన్ - వెంకీ కుడుముల కాంబినేషన్ మూవీ భీష్మ ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతున్న సంగతి తెలిసిందే. నేటి సాయంత్రం నుంచే ప్రీమియర్ల హడావుడి కొనసాగనుంది. నితిన్ ఎనర్జీ.. రష్మిక గ్లామర్ తో ఇప్పటికే పోస్టర్లు.. టీజర్ ట్రైలర్ ఆకట్టుకున్నాయి. సాగర్ మహతి మ్యూజిక్ కి ప్రశంసలు దక్కాయి. అయితే ఈ సినిమాకి ముందే ఏర్పడిన హైప్ దృష్ట్యా ప్రీరిలీజ్ బిజినెస్ రేంజు ఎంత? అన్నది పరిశీలిస్తే..
ఈ సినిమా ప్రపంచవ్యాప్త థియేట్రికల్ హక్కుల విలువ 23.50 కోట్లు అని తెలిసింది. భీష్మ ఏరియా వైజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ పరిశీలిస్తే.. నైజాం 6.30 కోట్లు.. సీడెడ్ 3.06 కోట్లు.. యుఎ 1.85 కోట్లు... గుంటూరు 1.55 కోట్లు...ఈస్ట్ 1.55 కోట్లు... కృష్ణ 1.40 కోట్లు... వెస్ట్ 1.20 కోట్లు... నెల్లూరు 0.64 కోట్లు... ఎపి / టిఎస్ 17.50 కోట్లు...అని లెక్క తేలింది. రెస్టాఫ్ ఇండియా 2 కోట్లు... ఓవర్సీస్: 2.40కోట్లు... ప్రపంచవ్యాప్త 23.50 కోట్లు బిజినెస్ సాగించింది.
అంటే దాదాపు 25 కోట్ల షేర్ వసూళ్ల లక్ష్యంగా భీష్మ బరిలో దిగుతోందన్నమాట. నితిన్ కెరీర్ లో బెస్ట్ బిజినెస్ ఇది. అయితే ఆ రేంజు వసూళ్లు తేవాలంటే మాత్రం బంపర్ హిట్ టాక్ తెచ్చుకోవాల్సిందే. అఆ తర్వాత మళ్లీ ఆ రేంజు హిట్టు పడలేదు నితిన్ కి. ఈసారి ఓవర్సీస్ కూడా అతడికి సాయం కావాల్సి ఉంటుంది. అలాగే ఈసారి శివరాత్రి సెలవుదినం విడుదల కాబట్టి అది ఓపెనింగ్ కలెక్షన్లకు కలిసొస్తుందేమో చూడాలి. సంక్రాంతి తర్వాత వరుసగా సినిమాలు విడుదలైనా బాక్సాఫీస్ వద్ద ఏదీ సక్సెస్ కాలేదు. ఆ లోటును తీరుస్తూ భీష్మ మంచి టాక్ తెచ్చుకుంటుందేమో చూడాలి.