Begin typing your search above and press return to search.

#PSPKRana కు 'భీమ్లా నాయక్' అనే టైటిల్ నే ఖరారు చేశారా?

By:  Tupaki Desk   |   14 Aug 2021 6:30 AM GMT
#PSPKRana కు భీమ్లా నాయక్ అనే టైటిల్ నే ఖరారు చేశారా?
X
మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన 'అయ్యప్పనుమ్ కొశీయుమ్' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి హీరోలుగా ఈ మల్టీస్టారర్ తెరకెక్కుతోంది. అక్కడ బిజూ మీనన్ పోషించిన పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ నటిస్తుండగా.. దర్శకుడు పృథ్వీ రాజ్ సుకుమారన్ నటించిన రిటైర్డ్ హవల్దార్ పాత్రలో రానా కనిపించనున్నారు. ఈ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ గ్లిమ్స్ ను ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

అయితే ఈ చిత్రానికి ''భీమ్లా నాయక్'' అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఇందులో భీమ్లా నాయక్ అనే పోలీస్ గా పవన్ నటిస్తున్నారని ఇప్పటికే అనౌన్స్ చేసిన మేకర్స్.. ఇప్పుడు అదే పేరుని టైటిల్ గా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. రేపు దీనిపై అధికారిక ప్రకటన రానుంది. ఏ సమయానికి టైటిల్ అండ్ ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేస్తారనే అప్డేట్ ను చిత్ర బృందం ఈరోజు వెల్లడించనుంది. పవన్ సినిమా గ్లిమ్స్ తో స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఫ్యాన్స్ పూన‌కంతో ఊగిపోనున్నారు.

ఇకపోతే ఇప్పటి వరకు #PSPKRana అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి రానా ను సైడ్ చేసినట్లు 'భీమ్లా నాయక్' అనే టైటిల్ పెట్టడంతోనే అర్థం అవుతోంది. నిజానికి చిత్ర యూనిట్ కరోనా సెకండ్ వేవ్ తర్వాత షూటింగ్ మొదలు పెట్టినప్పటి నుంచీ ఈ చిత్రాన్ని ఓ మల్టీస్టారర్ గా కాకుండా, పవన్ మూవీ గానే ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. మేకింగ్ వీడియో దగ్గర నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్ మరియు పోస్టర్స్ వరకూ అన్నిట్లో పవన్ మాత్రమే కనిపిస్తున్నారు.

సంక్రాంతి కానుకగా 2022 జనవరి 13న 'భీమ్లా నాయక్' చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఆ సమయంలో మహేష్ బాబు - ప్రభాస్ సినిమాలు కూడా వస్తున్నాయి. వాటికి ధీటుగా నిలబడలన్నా.. బిజినెస్ పరంగా వర్కౌట్ అవ్వాలన్నా ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ సినిమాగానే ప్రమోట్ చేయాలని మేకర్స్ భావించారట. అందుకే ఈ మధ్య ప్రమోషనల్ కంటెంట్ లో రానా ను సైడ్ చేశారనే టాక్ నడుస్తోంది.

నిజానికి మలయాళంలో ఇద్దరు హీరోల పాత్రల పేర్లు వచ్చే విధంగా 'అయ్యప్పనుమ్ కొశీయుమ్' అనే టైటిల్ ను పెట్టారు. తెలుగులో కూడా అదే ఫాలో అవుతారని అందరూ అనుకున్నారు. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే - డైలాగ్స్ రాస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా స్టోరీలో పెద్దగా మార్పులు చేయలేదని తెలుస్తోంది. కేవలం పవన్ కోసం ఫ్లాష్ బ్యాక్ ని మాత్రమే యాడ్ చేశారు. కాకపోతే సినిమా పవన్ కళ్యాణ్ పేరుతో బయటకు వస్తేనే దాని రేంజ్ వేరేగా ఉంటుందని 'భీమ్లా నాయక్' అనే టైటిల్ ని ఫిక్స్ చేసారట. రేపు అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత దీనిపై మరింత క్లారిటీ వస్తుంది.

కాగా, 'ఏకే' రీమేక్ కు సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. రవి కె.చంద్రన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు స్వీకరించారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.