Begin typing your search above and press return to search.
భీమ్లా నాయక్ ఆగినా ఆలస్యం లేకుండా వెంటనే!
By: Tupaki Desk | 7 Nov 2021 10:30 AM GMTపవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా సంక్రాంతికి ఫిక్స్ అంటూ డేట్ ను కూడా ప్రకటించారు. కేవలం భీమ్లా నాయక్ మాత్రమే కాకుండా మహేష్ బాబు.. కీర్తి సురేష్ ల సర్కారు వారి పాట మరియు ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా కూడా సంక్రాంతికే విడుదల కాబోతున్నట్లుగా ప్రకటించారు. ఈ మూడు సినిమాల మద్య పోటీ గట్టిగా ఉంటుందని భావిస్తున్న సమయంలో అనూహ్యంగా టాలీవుడ్ జక్కన్న ఆర్ ఆర్ ఆర్ సినిమాతో సంక్రాంతి బరిలో దిగబోతున్నట్లుగా ప్రకటించాడు. అయితే ఈ సినిమాలకు ఇబ్బంది లేకుండా సంక్రాంతికి వారం ముందుగానే తమ సినిమాను విడుదల చేస్తామని జక్కన్న ప్రకటించాడు. ఆర్ ఆర్ ఆర్ సినిమాకు వారం ముందు వచ్చినా.. వారం తర్వాత వచ్చినా కూడా నష్టమే. కనీసం రెండు వారాల వరకు ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేయగల సత్తా ఆర్ ఆర్ ఆర్ కు ఉంటుంది. అందుకే ఎందుకు వచ్చిన ఇబ్బంది అనుకున్న సర్కారు వారి పాట సినిమా సంక్రాంతి బరి నుండి తప్పుకుని సమ్మర్ కు చెక్కేసింది.
రాధే శ్యామ్ సినిమాను కూడా సంక్రాంతి బరి నుండి తప్పిస్తేనే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రభాస్ మరియు జక్కన్నల మద్య ఉన్న రిలేషన్ నేపథ్యంలో ఖచ్చితంగా సినిమాను వాయిదా వేస్తారనే అభిప్రాయం అందరు వ్యక్తం చేస్తున్నారు. ఇక భీమ్లా నాయక్ మాత్రం సంక్రాంతికే వస్తాడని అంతా అనుకుంటున్న ఈ సమయంలో వాయిదా విషయమై ప్రచారం మొదలు అయ్యింది. ఆర్ ఆర్ ఆర్ కు వస్తున్న బజ్ నేపథ్యంలో విడుదల అయిన రెండు వారాలు దాటినా కూడా వసూళ్ల ప్రభంజనం ఉండే అవకాశం ఉంది. ఆ సమయంలో భీమ్లా నాయక్ వస్తే ఆ సినిమా ఈ సినిమా రెండు సినిమాలకు నష్టం. అందుకే భీమ్లా నాయక్ ను కూడా వాయిదా వేస్తారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
భీమ్లా నాయక్ సినిమా విడుదల వాయిదా వేసినా కూడా మరీ ఆలస్యం చేయడానికి మేకర్స్ ఇష్టపడటం లేదు. ఎందుకంటే పవన్ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ విడుదలకు సిద్దంగా ఉన్నాయి. సమ్మర్ లో పవన్ హరి హర వీరమల్లు సినిమా విడుదల అవ్వాల్సి ఉంది. కనుక సంక్రాంతి సీజన్ మిస్ అయినా కూడా కాస్త ఆలస్యంగా అంటే రిపబ్లిక్ డే సందర్బంగా విడుదల చేసేలా ప్లాన్ చేస్తారనే వార్తలు వస్తున్నాయి. రిపబ్లిక్ డే కాకుండా ఫిబ్రవరిలో విడుదల చేయాలంటే చిరంజీవి ఆచార్య ఉంది. కనుక భీమ్లా నాయక్ ముందు సంక్రాంతి లేదా రిపబ్లిక్ డే మాత్రమే ఉంది. సంక్రాంతికి సినిమా విడుదల చేసి నష్టపోవడం కంటే రిపబ్లిక్ డే కు విడుదల చేయడం అన్ని విధాలుగా ఉత్తమ నిర్ణయం అనే అభిప్రాయంను ఇండస్ట్రీ వర్గాల వారు కూడా వ్యక్తం చేస్తున్నారు.