Begin typing your search above and press return to search.

కొత్త బాహుబలి వస్తున్నాడు

By:  Tupaki Desk   |   13 Feb 2018 5:47 AM GMT
కొత్త బాహుబలి వస్తున్నాడు
X
ఈ పోస్టర్ చూస్తే ఎవరికైనా ఈ అనుమానం కలగడం సహజం. భోజ్ పూరిలో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన 'వీర్ యోధా మహాబలి' ఫస్ట్ లుక్ పోస్టర్స్ తాజాగా విడుదలయ్యాయి. అచ్చం ప్రభాస్ స్టైల్ లో అదే బిల్డప్ తో ఇంచుమించు అదే కాస్ట్యూమ్ తో ఉన్న హీరో దినేష్ లాల్ యాదవ్ నిరహువాని చూస్తే అదే అనిపిస్తుంది మరి. కాని ఇది దానికి రీమేక్ అని చెప్పడానికి లేదు. కారణం దాని నిర్మాతలు బాహుబలి హక్కులు కొన్న దాఖలాలు లేవు. పైగా బాహుబలి హింది వెర్షన్ అక్కడ కూడా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. సో బాహుబలి రీమేక్ అనలేం కాని స్ఫూర్తి చెందారు అని మాత్రమ ఖచ్చితంగా చెప్పొచ్చు. చాలా లిమిటెడ్ బడ్జెట్ లో సినిమాలు తీసే భోజ్ పూరిలో ఇంత భారీ సినిమా తీయడం ఇదే మొదటి సారి అనే టాక్ ఉంది.

ఇక్కడ మరో విశేషం కూడా ఉంది. ఇది కేవలం భోజ్ పూరి లో మాత్రమే రావడం లేదు. హిందీతో సహా బెంగాలీ, తమిళ్, తెలుగు బాషలలో కూడా డబ్బింగ్ కాబోతోంది. అంటే మనం కూడా చూసేయోచ్చు. కాని బాహుబలి చూసిన కళ్ళతో ఇది ఎంత గ్రాండ్ గా తీసినా మన కళ్ళకు ఆనడం కష్టమే. విజయ్ లాంటి స్టార్ హీరో పులి తీస్తేనే మనకు నచ్చలేదు. అంత దాకా ఎందుకు బాహుబలి స్టాండర్డ్ ని మీట్ కావడం అంత సులభం కాదని బాలీవుడ్ నిర్మాతలు కూడా ఒప్పుకున్నారు. అలాంటిది భోజ్ పూరి నుంచి బాహుబలిని తలదన్నే సినిమా వస్తుంది అంటే నమ్మశక్యం కాదు. కాని ప్రయత్నమైతే చేస్తున్నారు.

బాహుబలి ప్రభావం ఎంత బలంగా ఉందో దీని ద్వారా మరోసారి రుజువయ్యింది. త్వరలో విడుదలకు ఏర్పాటు చేస్తున్న వీర్ యోధా మహాబలి పేరులో కూడా బాహుబలి ఛాయలు ఉండటం విశేషం. తెలుగు సినిమా గర్వపడే మగధీర, బాహుబలి, అరుంధతి, అమ్మోరు లాంటి ల్యాండ్ మార్క్ మూవీస్ అన్ని ఇక్కడి నుంచే రావడం విశేషమైతే వాటిని తలదన్నే సినిమా ఇతర బాషల్లో ఇంకా రాకపోవడం విశేషం.