Begin typing your search above and press return to search.

భూమిక‌కు మంచి రోజులొస్తాయా?

By:  Tupaki Desk   |   7 Sep 2018 5:30 PM GMT
భూమిక‌కు మంచి రోజులొస్తాయా?
X
టాలీవుడ్‌ లో ఎదురేలేని స్టార్‌ డ‌మ్‌ ని ఆస్వాధించింది భూమిక‌. తెలుగు - త‌మిళ్‌ లో త‌న‌కు భారీ ఫాలోయింగ్ ఉంది. సుమంత్ స‌ర‌స‌న యువ‌కుడు సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ ముంబై భామ‌ చాలా త‌క్కువ స‌మ‌యంలో ఎక్కువ‌ పేరు తెచ్చుకుంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌ర‌స‌న ఖుషీ - ఎన్టీఆర్ స‌ర‌స‌న `సింహాద్రి` లాంటి బ్లాక్‌ బ‌స్ట‌ర్ చిత్రాల్లో న‌టించింది. స‌మ‌కాలీన క‌థానాయిక‌ల్లో ఎదురేలేని అగ్ర‌నాయిక‌గా పేరు తెచ్చుకుంది. అయితే యోగాగురూ భ‌ర‌త్ ఠాకూర్‌ ని పెళ్లాడాక లైఫ్‌లో కొన్ని ప్ర‌యోగాలు త‌న‌ని ఇబ్బంది పెట్టాయి. సొంతంగా ఓ ప్రొడ‌క్ష‌న్ హౌస్ ప్రారంభించి - మ్యాగ‌జైన్ స్థాపించి వాటి వ‌ల్ల త‌న‌కు క‌లిసి రాక చాలానే న‌ష్టాల్ని చ‌విచూడాల్సి వ‌చ్చింది. ఆ క్ర‌మంలోనే వైవాహిక జీవితం ప‌రంగానూ కొన్ని రూమ‌ర్లు పుట్టుకొచ్చాయి. నీల‌కంఠ - మిస్స‌మ్మ‌ - అల్ల‌రి ర‌విబాబు- అన‌సూయ బౌన్స్ బ్యాక్ సినిమాలు త‌న‌ని కెరీర్ ప‌రంగా ఆదుకున్నాయి. ఇదంతా గ‌తం అనుకుంటే.. వ‌ర్త‌మానంలో భూమిక ఏంటి? అంటే అందుకు స‌మాధానం చాలా తొంద‌ర్లోనే తెలుసుకునే వీలుంది.

భూమిక ఇటీవ‌లి కాలంలో యువ‌హీరోల సినిమాల్లో స‌హాయ‌క పాత్ర‌ల్లో న‌టించేందుకు ఏమాత్రం భేష‌జం చూపించ‌డం లేదు. ప్ర‌స్తుతం నాగ‌చైత‌న్య క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న `స‌వ్య‌సాచి` చిత్రంలో న‌టించింది. ఈ చిత్రంలో చైతూకి అక్క పాత్ర‌లో భూమిక న‌టించ‌డం విశేషం. మ్యాడీ లాంటి సీనియ‌ర్ న‌టుడు న‌టించిన ఈ చిత్రంలో భూమిక‌ పాత్ర‌కు ప్రాధాన్య‌త ఉంద‌ని అర్థ‌మ‌వుతోంది. మ‌రోవైపు స‌మంత న‌టించిన `యూట‌ర్న్‌`లోనూ భూమిక ఓ కీల‌క పాత్ర పోషించింది. ఈ సినిమా సెప్టెంబ‌ర్ 13న రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఇదో హార‌ర్ థ్రిల్ల‌ర్. ఇందులో భూమిక పాత్ర సంథింగ్ స్పెష‌ల్‌ గా ఉంటుంద‌ని తెలుస్తోంది. మొత్తానికి అక్కినేని కాంపౌండ్‌ లోనే రెండు సినిమాలు చేస్తున్న భూమిక వీటితో తిరిగి బౌన్స్ బ్యాక్ అవుతుంద‌నే అభిమానులు అంచ‌నా వేస్తున్నారు.

గ‌తం ఏంటి? అనేది అప్ర‌స్తుతం. వ‌ర్త‌మానంలో ఎలా ముందుకు సాగాలి? అన్న‌ది ముఖ్యం. ఒక సీనియ‌ర్ నాయిక‌గా త‌న వ‌య‌సుకు, అందానికి తగ్గ పాత్ర‌ల్లో ఎప్పుడూ అవ‌కాశాలుంటాయి. న‌దియా - ర‌మ్య‌కృష్ణ - శుభ‌ - రోహిణి వంటి తార‌లు ఇలానే బౌన్స్ బ్యాక్ అయ్యారు. ఆ త‌ర‌హాలోనే భూమిక తిరిగి కెరీర్ ప‌రంగా బిజీ అయిపోతుందేమో చూడాలి.