Begin typing your search above and press return to search.

బ్లాక్ డ్రెస్​లో భూమిక.. థై షో కెవ్వూ కేక..

By:  Tupaki Desk   |   13 Feb 2023 11:00 PM GMT
బ్లాక్ డ్రెస్​లో భూమిక.. థై షో కెవ్వూ కేక..
X
సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఫామ్​లో ఉన్నా లేకపోయినా.. పెళ్ళైనా కాకపోయినా గ్లామర్ షోలో ఏ మాత్రం వెనకడుగు వేయరు. చాలామంది హీరోయిన్స్​.. పెళ్లి చేసుకొని సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ, సోషల్ మీడియాలో అందాల ప్రదర్శన చేస్తుంటారు. లేదంటే సెకండ్ ఇన్నింగ్స్ ప్రయత్నాల కోసం గ్లామర్​ ట్రీట్​ను ఇస్తుంటారు. ప్రస్తుతం అదే బాటలో వెళ్తోంది నటి భూమిక చావ్లా. కొంత కాలంగా ఈమె ఫొటోషూట్స్​ చూస్తుంటే.. భూమికనేనా ఇలా చేసేది అని నెటిజన్లు భావిస్తున్నారు.

ప్రస్తుతం వరుసపెట్టి సినిమాలు చేయకపోయినా ఈ భామ.. సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్​గా ఉంటోంది. అదీగాక నలభైయేళ్లు దాటాకా కూడా.. ఫ్యాన్స్ అందరూ కళ్లప్పగించి ఉండిపోయే రేంజిలో అందాల ప్రదర్శన చేస్తోంది. హాట్​ ఫోటోషూట్స్​తో మతులు పోగొడుతోంది. అయితే తాజాగా మళ్లీ ఓ హాట్ ఫోటో పోస్ట్ చేసింది. బ్లాక్ కలర్ డ్రెస్​ వేసుకుని నెట్టింట సెగలు రేపేంది. థై షో, లైట్​గా క్లీవేజ్​ షో చేస్తూ కుర్రాళ్లకు చెమటలు పట్టించింది. ఓ సుదీర్ఘ నోట్ కూడా రాసుకొచ్చింది.

ఆ ఫొటో 2016లోని ఫొటోషూట్​ అని చెప్పింది. మనషికి తన కోరికలు తెలీవంటూ, అపరిచిత వ్యక్తులకు మనిషి దగ్గరవుతాడని ఇలా ఓ సందేశాన్ని రాసుకొచ్చింది. అయితే ఈ సందేశం 2014లోదని అదిప్పుడు తనకు దొరికిందని, దాన్నే మళ్లీ పోస్ట్ చేసినట్లు చెప్పుకొచ్చింది.

అయితే ప్రస్తుతం కళ్ళు చెదిరేలా ఉన్న భూమిక పిక్​ వైరల్​గా మారింది. ఈ ముద్దుగుమ్మ గ్లామర్​కు కుర్ర కారు మరోసారి ఫిదా అవుతున్నారు. లేటు వయసులో ఘాటు అందాల షో అదిరిందంటూ హాట్ ఎమోజీతో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

కాగా, ఈ ఢిల్లీ బ్యూటీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించిన ఖుషీ సినిమాతో యూత్ మనసు దోచుకున్న ఈ భామ.. ఆ తర్వాత మిస్సమ్మ సినిమాతో నంది పురస్కారం అందుకుని ఫ్యామిలీ ఆడియెన్స్​కు మరింత దగ్గరైంది. 2000లో యువకుడు మూవీతో సినీ కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ.. తెలుగులో దాదాపు అందరూ స్టార్ హీరోల సరసన సినిమాలు చేసింది.

మెగాస్టార్ చిరు, బాలయ్య, వెంకటేష్, నాగ్, మహేశ్​, పవన్, ఎన్టీఆర్ ఇలా అందరితో భారీ హిట్స్ అందుకుంది. ఇక సౌత్ లోని అన్ని భాషలతో పాటు హిందీ, భోజ్ పురిలో కూడా సినిమాలు చేసింది. అనంతరం 2007లో స్నేహితుడు భరత్ ఠాకూర్​ని పెళ్లాడి సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్​గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టింది.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.