Begin typing your search above and press return to search.
సాహో పాటల వెనుక రహస్యం ఇదా
By: Tupaki Desk | 12 Aug 2019 7:36 AM GMTటాలీవుడ్ లోనే కాదు ఇండియాలోనే మోస్ట్ కాస్ట్లీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న సాహో విడుదల తేది దగ్గర పడే కొద్ది అభిమానుల్లో ఉత్సాహం పెరుగుతోంది. ఇప్పటికే ప్రీ బుకింగ్ కొన్ని యాప్స్ మొదలుపెట్టేయగా మరికొద్ది రోజుల్లోనే అన్ని ఆన్ లైన్ ప్లాట్ ఫార్మ్స్ మీద అడ్వాన్స్ టికెట్ల అమ్మకం మొదలుకానుంది. ట్రైలర్ చూశాక మతిపోవడం ఒక్కటే తక్కువ అనే రేంజ్ లో యాక్షన్ కట్స్ ఉండటంతో అటు ముంబై నుంచి ఇటు హైదరాబాద్ దాకా దీని గురించే చర్చ నడుస్తోంది.
అంతా ఓకే కాని పాటల విషయంలోనే డార్లింగ్ ఫ్యాన్స్ ఏమంత ఎగ్జైటింగ్ గా లేరు. కారణం ట్యూన్స్ బాగానే ఉన్నప్పటికీ ఏదో డబ్బింగ్ సినిమా పాటల్లా ఉన్నాయనే ఫీలింగ్ తో అదొక్క అసంతృప్తిని సోషల్ మీడియా వేదికగా వెలిబుచ్చారు. అయితే హింది వెర్షన్ నిర్మాత టి సిరీస్ అధినేత భూషణ్ కుమార్ దీనికి క్లారిటీ ఇచ్చేశారు. ముందు వీటిని నార్త్ ఆడియన్స్ టేస్ట్ ని దృష్టిలో పెట్టుకునే కంపోజ్ చేశామని తర్వాత తెలుగు కోసం రీ కంపోజ్ చేయడం జరిగిందని అందుకే అలా అనిపించి ఉండవచ్చని తేల్చేశారు.
అయినప్పటికీ దర్శకుడు సుజిత్ ఇచ్చిన ఇన్ పుట్స్ ని ఆధారంగా చేసుకుని అందరికి నచ్చేలా యునివర్సల్ అప్పీల్ ఉన్న సాంగ్స్ చేయించామని చెప్పాడు. ఇప్పటికి రెండు పాటలు వచ్చాయి. ఇంకా ఎన్ని బాలన్స్ ఉన్నాయో క్లారిటీ లేదు. ఫుల్ ఆల్బం వచ్చాక తెలుస్తుంది. సో తెలుగు ఫ్లేవర్ తగ్గిందనుకునే వాళ్ళకు సమాధానం అయితే దొరికింది. ఆగస్ట్ 30న విడుదల కానున్న సాహోకు ఇప్పటిదాకా ఏ సౌత్ ఇండియన్ సినిమాకు దక్కని భారీ రిలీజ్ అందనుంది