Begin typing your search above and press return to search.

బిచ్చగాడు బ్యూటి అన్నంత పనీ చేసింది

By:  Tupaki Desk   |   8 Feb 2017 10:45 AM GMT
బిచ్చగాడు బ్యూటి అన్నంత పనీ చేసింది
X
ఇప్పుడు మరోసారి బిచ్చాగాడు హీరోయిన సాట్నా టైటస్ వార్తల్లోకి వచ్చేసింది. అమ్మడు సదరు బిచ్చగాడు సినిమాలో ఎలా నటించింది.. ఇరగదీసిందా లేదా.. అనే విషయం పక్కనెట్టేస్తే.. ఆ సినిమా సక్సెస్ రేంజుతో ఈమె రేంజు కూడా మారిపోయింది. కాని అదంతా మూణ్ణాళ్ళ ముచ్చటే అయిపోయింది. ఎందుకంటే అమ్మడు ఆ సినిమా సక్సెస్ స్ర్టీక్ ను కంటిన్యూ చేయడం లేదని తేల్చిచెప్పేసింది. ఇప్పుడు అన్నంత పనీ చేసింది.

అప్పట్లో ఈ సినిమాను తమిళనాట పంపిణీ చేసిన కార్తీక్ అనేక డిస్ర్టిబ్యూటర్ తో అమ్మడు సాట్నా ప్రేమలో పడింది. అయితే ఈ ప్రేమాయణం అమ్మడి ఇంట్లో నచ్చకపోవడంతో.. ఈమె సీక్రెట్ గా అతన్ని పెళ్ళి చేసుకుని రహస్య కాపురమే పెట్టేసింది. కట్ చేస్తే ఒక మీటింగ్ పెట్టి.. మేం రిజిష్టర్ మ్యారేజ్ చేసుకున్నాం.. దయ చేసి మమ్మల్ని వేధించకండి.. నాకు సినిమాల్లో చేయడం ఇష్టం లేదు.. అంటూ స్టేట్మెంట్ కూడా ఇచ్చేసింది ఈ బిచ్చగాడు హీరోయిన్. తరువాత మరోసారి ఘనంగా పెళ్ళి చేసుకుంటాను అని చెప్పింది. ఇప్పుడు అన్నంతపనీ చేసింది.

కట్ చేస్తే కొన్ని నెలలు గడవగానే ఇప్పుడు అమ్మడు ఇంట్లో అందరినీ ఒప్పించేసి.. చక్కగా ఒక ఎరేంజ్డ్ మ్యారేజ్ స్టయిల్లో గ్రాండ్ వెడ్డింగే చేసుకుందిలే. అదిగో ఆ ఫోటోలు చూస్తున్నారుగా.. సాట్నా చాలా ఆనందంగా కార్తీక్ ను తన కుటుంబ సభ్యుల మధ్యన ఎలా పెళ్లి చేసుకుందో.. వావ్ అనాల్సిందే. దాదాపు తెలుగు సినిమాల్లో జరిగినట్లు ఒక హ్యాపీ క్లయ్ మ్యాక్స్ తో ఈ తమిళ హీరోయిన్ లవ్ స్టోరి ముగిసింది. లైఫ్ స్టోరీ మొదలైంది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/