Begin typing your search above and press return to search.
కౌంటర్ టాక్: బిచ్చగాడే రిచ్
By: Tupaki Desk | 30 May 2016 11:29 AM GMTసమ్మర్ అంటేనే సందడి.. ముఖ్యంగా సినిమాలకు దీనికి మించిన సీజన్ లేదు. అందుకే ఈ టైంలో తమ మూవీ రిలీజ్ కోసం ప్లాన్ చేసుకుంటారు దర్శక నిర్మాతలు. రోహిణీ కార్తె ఎండలు మండుతున్నా.. థియేటర్లలో జనాలు బాగా కనిపించడం ఈ సీజన్ స్పెషాలిటీ. అయితే టిక్కెట్ కౌంటర్ల దగ్గర గత వారం ''బిచ్చగాడు'' ఫుల్ రిచ్ అయిపోయాడు తెలుసా. మన తెలుగు సినిమాలను దాటేసి.. రెండు తమిళ సినిమాలు దంచేస్తునా్నయి.
బిచ్చగాడు: ఈ వారం ట్రేడ్ ప్రకారం తమిళ్ డబ్బింగ్ మూవీ బిచ్చగాడుకే ఫస్ట్ ప్లేస్ ఇచ్చేయాలి. బయ్యర్లకు ఇప్పటికే రెట్టింపునకు పైగా లాభాలిచ్చిన బిచ్చగాడు.. ఇంకా హౌజ్ ఫుల్స్ అవుతూ కనకవర్షం కురిపించేస్తున్నాడు. ఈ ఏడాది డబ్బింగ్ సినిమాలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఈ సినిమా.
రాయుడు: విశాల్ నటించిన రాయుడు ఈ వారమే రిలీజ్ అయింది. మరో సినిమా పోటీ లేకపోవడంతో బ్రహ్మాండమైన ఓపెనింగ్స్ వచ్చాయి. అయితే ఆ రేంజ్ ని నిలబెట్టుకోలేకపోయాడనే చెప్పాలి. అయినా సరే.. ఈ వారం టాప్ 2 రాయుడునే. కథ, కథనం రొటీన్ గా ఉండడం, నేటివిటీ మిస్ కావడం ఈ సినిమాకి మైనస్ పాయింట్స్.
సుప్రీమ్: బాక్సాఫీస్ దగ్గర సుప్రీమ్ సెన్సేషన్స్ కంటిన్యూ అవుతున్నాయి. మహేష్ మూవీ బ్రహ్మోత్సవం డిజప్పాయింట్ చేయడంతో.. ఎంటర్టెయిన్మెంట్ ఉన్న మూవీ సుప్రీమ్ కే ఆడియన్స్ ట్యూన్ అవుతున్నారు. రిలీజ్ అయ్యి మూడు వారాలు గడిచినా.. ఇంకా కలెక్షన్స్ రాబడుతోంది సాయిధరంతేజ్ మూవీ. వీకెండ్స్ లో అయితే హౌజ్ ఫుల్స్ పడ్డం విశేషమే.
బ్రహ్మోత్సవం: మరో భారీ చిత్రం రిలీజ్ లేకపోవడంతో.. బాక్సాఫీస్ లో పోటీ పడే అవకాశం బ్రహ్మోత్సవంకు చిక్కింది. అయితే.. ఆశించిన స్థాయిలో మాత్రం వసూళ్లు లేవు. మరో మూవీ రిలీజ్ లేకపోవడంతోనే.. తప్పనిసరి పరిస్థితుల్లో కంటిన్యూ చేయాల్సి వచ్చిందని తెలుస్తోంది. ప్రస్తుతం చాలా చోట్ల ఈ చిత్రాన్ని డెఫిసిట్ లో నడుపుతున్నారు.
సరైనోడు: ఈ ఏడాదికి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలవడంతో పాటు.. టాలీవుడ్ ఆల్ టైం టాప్ 5లో చోటు దక్కించుకున్న సరైనోడు.. కలెక్షన్స్ విషయంలో ఇంకా సంచలనాలు కంటిన్యూ చేస్తున్నాడు. ఆరో వారంలో కూడా అదరగొట్టే కలెక్షన్స్ వసూలు చేస్తుండడంతో.. సమ్మర్ సీజన్ ని ఫుల్ గా వాడుకున్న మూవీగా సరైనోడు నిలిచిపోతున్నాడు.