Begin typing your search above and press return to search.
నువ్వే కావాలి తర్వాత బిచ్చగాడే..
By: Tupaki Desk | 20 Aug 2016 1:30 PM GMTఇప్పుడు కలెక్షన్ల లెక్కల్ని ఘనంగా చెప్పుకున్నట్లే.. అప్పట్లో వంద రోజుల సెంటర్ల గురించి గొప్పలు చెప్పుకునేవాళ్లు. ఐతే ఈ చర్చ స్టార్ హీరోల సినిమాలకే ఉండేది. అలాంటి టైంలో ‘నువ్వే కావాలి’ అనే చిన్న సినిమా ఒకటి వచ్చింది. విడుదలైనపుడు పెద్దగా అంచనాల్లేవు. కానీ తర్వాత ఆ సినిమా ప్రభంజనమే సృష్టించింది. ముందు పెద్ద సెంటర్లలో మాత్రమే రిలీజై.. ఆ తర్వాత చిన్న చిన్న టౌన్లకు కూడా వెళ్లింది. లేటుగా రిలీజ్ అయి కూడా వంద రోజులాడేసింది. ఉషా కిరణ్ మూవీస్ వాళ్లకు వంద రోజుల సెంటర్ల మీద.. రికార్డుల మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు కాబట్టి లైట్ తీసుకున్నారు కానీ.. వంద రోజుల సెంటర్లన్నీ కలిపితే అప్పటికే అది ఇండస్ట్రీ రికార్డే అయ్యేది. దాదాపు రెండొందల సెంటర్లలో ఆ సినిమా వంద రోజులాడినట్లు అంచనా.
‘నువ్వే కావాలి’ రోజుల్లో సినిమాలకు లాంగ్ రన్ ఉండేది. కానీ గత ఐదారేళ్లుగా బ్లాక్ బస్టర్ సినిమాలు కూడా మూడు నాలుగు వారాలకే పరిమితమవుతున్న పరిస్థితి. ఇలాంటి టైంలో తెలుగు సినిమాలు కూడా సాధించని ఘనత ‘బిచ్చగాడు’ దక్కించుకుంది. ‘నువ్వే కావాలి’ తరహాలోనే ఇది కూడా లేటుగా చాలా సెంటర్లలో రిలీజై.. ఒక థియేటర్ నుంచి ఇంకో థియేటర్ కు మారుతూ.. వంద రోజుల వరకు దూసుకొచ్చింది. సరైన లెక్కలు లేవు కానీ.. కనీసం ఈ సినిమా 50 సెంటర్లలో అయినా వంద రోజులు ఆడి ఉంటుందని అంటున్నారు. 70 రోజుల టైంలో ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 200 సెంటర్లలో ఆడుతూ ట్రేడ్ పండిట్లను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ రోజుల్లో ఇది మామూలు విషయం కాదు.