Begin typing your search above and press return to search.
వంద పడ్డం గ్యారంటీ అంటగా..
By: Tupaki Desk | 13 July 2016 8:37 AM GMTకొంత కాలం క్రితం తమిళ్ డబ్బింగ్ సినిమాలు టాలీవుడ్ లో హల్ చల్ చేశాయి. ఆ తర్వాత ఈ ట్రెండ్ తగ్గిపోయింది. డబ్బింగ్ సినిమాలను జనాలు పెద్దగా పట్టించుకోవడం మానేశారు. మళ్లీ ఇప్పుడా కల్చర్ మొదలైనట్లు అనిపిస్తోంది. కోలీవుడ్ మూవీ పిచ్చైక్కారన్ తెలుగులో సృష్టిస్తున్న సంచలనాలు చూస్తే పిచ్చెక్కిపోవడం ఖాయం.
రిలీజ్ అయ్యి రెండు నెలలు గడిచినా తెలుగు రాష్ట్రాల్లో బిచ్చగాడికి మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. ఈ రన్ 60 రోజులతో ఆగేది కాదని.. ఇది గ్యారంటీగా 100 రోజుల బొమ్మ అంటున్నారు డిస్ట్రిబ్యూటర్లు. కేవలం తెలుగు వెర్షన్ వరకే రూ.18 కోట్ల వసూళ్లు దాటిపోగా.. ఫుల్ రన్ లో ఈ లెక్క కనీసం 20 కోట్లుగా ఉండొచ్చనే అంచనాలున్నాయి. రైట్స్ ప్లస్ ప్రమోషన్ కి కలిపి మొదట ఈ మూవీకి అనుకున్న బడ్జెట్ కోటి లేపే. కానీ 20 రెట్ల వసూళ్లతో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది బిచ్చగాడు.
60 రోజులు దాటిపోయాక కూడా ఆక్యుపెన్సీ రేషియో బాగుండడంతో.. బిచ్చగాడు సెంచరీ కొట్టేస్తాడనే అంచనాలకు బలం వచ్చింది. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే.. అసలీ సినిమాకి మొదట మల్టీప్లెక్సుల్లో ఒక్క స్క్రీన్ కూడా ఇవ్వలేదు. రిలీజ్ అయిన 4 వారాల తర్వాత.. మల్టీ ప్లెక్సుల్లో స్క్రీన్స్ అలాట్ చేయగా.. ఇప్పుడు హైద్రాబాద్ లో తమిళ్ వెర్షన్ పిచ్చైక్కారన్ ని కూడా కొన్ని స్క్రీన్లలో ప్రదర్శిస్తున్నారు. మొత్తానికి బిచ్చగాడు పిచ్చెక్కించేస్తున్నాడంతే.