Begin typing your search above and press return to search.

బిచ్చగాడు.. ఒక గ్రేట్ సక్సెస్ స్టోరీ

By:  Tupaki Desk   |   26 May 2016 5:48 PM GMT
బిచ్చగాడు.. ఒక గ్రేట్ సక్సెస్ స్టోరీ
X
బిచ్చగాడు.. ఇలాంటి టైటిల్ చూసి ఎవరైనా సినిమాకు వస్తారా..? అందుకే జనాలు మొదట్లో ఈ సినిమాను అస్సలు పట్టించుకోలేదు. పైగా పేపర్లలో కానీ.. సోషల్ మీడియాలో కానీ ఈ సినిమా పోస్టర్లు కనిపిస్తే.. ‘ఇదేం టైటల్’ అంటూ సెటైర్లు వేశారు. అలాంటిది ఈ రోజు ఆ సినిమా ఎక్కడ ఆడుతోందో వెతికి వెతికి మరీ థియేటర్లకు వెళ్తున్నారు తెలుగు ప్రేక్షకులు. పెద్దగా పబ్లిసిటీ చేయకున్నా సరే.. కేవలం మౌత్ టాక్ తోనే ఈ సినిమా అనూహ్యంగా సక్సెస్ అయ్యింది.

రెగ్యులర్ సినిమా బఫ్స్ కి.. సుప్రీమ్.. 24.. సినిమాలు అయిపోయాక చూడ్డానికి సరైన తెలుగు సినిమా లేదు. ఇవి వచ్చిన తర్వాతి వారం ‘బిచ్చగాడు’తో పాటు ‘పెన్సిల్’ కూడా రిలీజయ్యాయి. ఐతే మొదట ‘బిచ్చగాడు’ను ఎవ్వరూ పట్టించుకోలేదు. ఐతే కొన్ని రోజులు గడిచాక సినిమా చాలా బావుందన్న మౌత్ టాక్ స్ప్రెడ్ అయి.. నెమ్మదిగా జనాలు థియేటర్లకు రావడం మొదలుపెట్టారు. ఇక ‘బ్రహ్మోత్సవం’కు డిజాస్టర్ టాక్ వచ్చిన టైంలో ‘బిచ్చగాడు’కు ఆదరణ మరింత పెరిగింది. మహేష్ సినిమాను తీసేసి మరీ కొన్ని చోట్ల ‘బిచ్చగాడు’కు థియేటర్లు ఇవ్వడం విశేషం.

రెండో వారాంతం నుంచి ‘బిచ్చగాడు’ థియేటర్లు కళకళలాడాయి. ఇప్పుడు కూడా సినిమా బాగానే నడుస్తోంది. విజయ్ ఆంటోనీ లాంటి ఏ ఇమేజ్ లేని హీరో సినిమా ఇలా ఆడటం ఆశ్చర్యకరమైన విషయమే. గతంలో తెలుగులో ‘శీను’ సినిమా తీసిన సీనియర్ డైరెక్టర్ శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తమిళంలో ఆంటోనీనే నిర్మించాడు. తెలుగులో తన సినిమా రిలీజవ్వడమే ఎక్కువ అన్నట్లు చాలా తక్కువ మొత్తానికి ఈ సినిమాను అమ్మాడట విజయ్ ఆంటోనీ. కానీ ఈ సినిమా అనూహ్యమైన కలెక్షన్లు సాధించింది. ఫుల్ రన్లో ‘బిచ్చగాడు’ రూ.2 కోట్లకు పైగా షేర్ వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. నిజంగా ఇదొక గ్రేట్ సక్సెస్ స్టోరీ అని చెప్పాలి.