Begin typing your search above and press return to search.
మూవీ రివ్యూ: బిచ్చగాడు
By: Tupaki Desk | 13 May 2016 11:11 AM GMTచిత్రం : ‘బిచ్చగాడు’
నటీనటులు: విజయ్ ఆంటోనీ - సత్నా - దీపా రామానుజం - భగవతి - ముత్తురామన్ తదితరులు
సంగీతం: విజయ్ ఆంటోనీ
ఛాయాగ్రహణం: ప్రసన్నకుమార్
నిర్మాతలు: చదలవాడ పద్మావతి - ఫాతిమా విజయ్ ఆంటోనీ
మాటలు: భాషాశ్రీ
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శశి
నకిలీ.. సలీమ్.. లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న మ్యూజిక్ డైరెక్టర్ టర్న్డ్ హీరో విజయ్ ఆంటోనీ ఇప్పుడు ‘బిచ్చగాడు’ సినిమాతో వచ్చాడు. తమిళంలో సూపర్ హిట్టయిన ‘పిచ్చైకారన్’కు ఇది అనువాదం. చాలా ఏళ్ల క్రితం విక్టరీ వెంకటేష్ హీరోగా ‘శీను’ సినిమా తీసిన శశి ఈ చిత్రానికి దర్శకుడు. ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘బిచ్చగాడు’ విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
అరుణ్ (విజయ్ ఆంటోనీ) ఓ పెద్ద బిలియనీర్. అతడి తల్లి ఇండియా ఫ్యాక్టరీల్ని నడిపిస్తుంటే అతను ఫారిన్లో చదువు పూర్తి చేసుకుని వస్తాడు. ఇక తన వ్యాపారాలన్నింటినీ తనే చేతుల్లోకి తీసుకుందామని అనుకుంటున్న సమయంలో అరుణ్ తల్లి ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదం వల్ల కోమాలోకి వెళ్లిపోతుంది. వైద్యులు ఆమె విషయంలో ఏమీ చేయలేమని చేతులెత్తేస్తారు. అలాంటి సమయంలో తల్లిని మళ్లీ మామూలు మనిషిని చేయడం కోసం ఓ సాధువు సూచన మేరకు 48 రోజుల పాటు బిచ్చగాడిలా ఉండటానికి నిర్ణయించుకుంటాడు అరుణ్. మొత్తం ఫ్యాక్టరీల బాధ్యత అంతా తన కజిన్ కు అప్పగించేసి చేతిలో చిల్లిగవ్వ లేకుండా మరో ఊరికి చేరుకుంటాడు. అక్కడ అతను బిచ్చగాడిలా 48 రోజుల పాటు ఎలా బతికాడు.. ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అరుణ్ దీక్ష పూర్తయ్యాక అతడి తల్లి మామూలు మనిషైందా లేదా అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ:
ఫారిన్లో చదువుకుని వచ్చిన ఓ బిలియనీర్.. 48 రోజుల పాటు బిచ్చగాడిలా గుడి ముందు మెట్ల మీద కూర్చుని అడుక్కోవడం.. రాత్రిళ్లు బిచ్చగాళ్ల మధ్యన పడుకోవడం అన్నది ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇలాంటి కథను ఇప్పటిదాకా ఎవ్వరూ ప్రయత్నించి ఉండరు. ఏ హీరో కూడా ఇలాంటి పాత్ర చేయడానికి ఒప్పుకోడు. ఈ విషయంలో డైరెక్టర్ శశి.. హీరో విజయ్ ఆంటోనీలను అభినందించాలి. ప్లాట్ విషయంలో ‘బిచ్చగాడు’ ఆసక్తి రేకెత్తిస్తుంది. బిచ్చగాళ్ల జీవితాల్ని ఎంతో స్టడీ చేసి రియలిస్టిగ్గా ఉండేలా ఈ సినిమాను తెరకెక్కించాడు శశి. ఈ ప్లాట్ అతడికి ఆసక్తికర సన్నివేశాలు రాసుకోవడానికి అవకాశమిచ్చింది.
ఉదాహరణకు హీరో బిచ్చగాడి అవతారం ఎత్తాక.. తనకు పరిచయమైన అమ్మాయితో కలిసి బైక్ మీద వెళ్తుంటాడు. మధ్యలో ట్రాఫిక్ ఎస్సై అతణ్ని అడ్డుకుంటాడు. ఏం చేస్తుంటావ్ అని హీరోను అడిగితే బిచ్చమెత్తుకుంటుంటానని అంటాడు. ఎస్సై నమ్మడు. తాను బిచ్చమెత్తుకునే గుడికి ఆ ఎస్సై రోజూ వచ్చి ఏమేం చేస్తాడో ఏకరవు పెట్టి అతను అవాక్కయ్యేలా చేస్తాడు. ఇంకో సన్నివేశంలో హీరోయిన్ తన బైకుతో ఓ బడా బాబు కారును గుద్దుతుంది. అతను నానా యాగీ చేస్తాడు. హీరో అప్పుడొచ్చి లగ్జరీ కార్ల లెక్కలన్నీ చెబుతూ.. గొడవ చేస్తున్న పెద్ద మనిషి గాలి తీసేస్తాడు. ఇలాంటి ఆసక్తికర సన్నివేశాలు చాలానే వచ్చి పోతుంటాయి ‘బిచ్చగాడు’లో. హీరో హీరోయిన్ల ట్రాక్ బాగానే సాగుతుంది.
హీరో-బిచ్చగాళ్ల కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణ. బిచ్చగాళ్ల జీవితాల్ని దర్శకుడు ఎంత లోతుగా అధ్యయనం చేశాడో అర్థమవుతుంది. తమిళ స్టయిల్లో మరీ గుండెలు పిండేసే సన్నివేశాలుంటాయని భయపడాల్సిన పని లేదు. చాలా వరకు సన్నివేశాలు హృద్యంగా అనిపిస్తాయి. కొన్ని సన్నివేశాల్లో వినోదం కూడా బాగానే పండింది. ఐతే ‘బిచ్చగాడు’ సినిమాతో ఉన్న అతి పెద్ద సమస్య.. కథలో లాజిక్ లేకపోవడం.. మెలోడ్రామా మరీ శ్రుతిమించడం. ఉన్నత చదువులు చదువుకున్న హీరో సాధువు ఓ మాట చెప్పగానే అన్నీ వదిలేసి బిచ్చగాడిగా మారిపోవడం అసహజంగా అనిపిస్తుంది.
ఇదేమీ సోషియో ఫాంటసీ సినిమా కాదు. సోషల్ మూవీ. ఇలాంటి సినిమాల్లో కథకు కీలకమైన అంశం ఇలా ఇల్లాజికల్ గా ఉండటాన్ని ప్రేక్షకులు జీర్ణించుకోలేరు. పోనీ సాధువు చెప్పిన ప్రకారం నిబంధనలకు లోబడే తన దీక్షను పూర్తి చేస్తాడా అంటే అలా ఏం కాదు. హీరో ఎవరన్నది ఆ దీక్ష పూర్తవకుండానే హీరోయిన్ కు తెలిసిపోతుంది. మధ్య మధ్యలో వచ్చే రౌడీల గొడవలు సినిమాను పక్కదారి పట్టిస్తాయి తప్ప.. కథకు పెద్దగా ఉపయోగపడవు. మదర్ సెంటిమెంట్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాల్లో మెలోడ్రామా మరీ ఎక్కువైపోయింది. మొత్తంగా ‘బిచ్చగాడు’ ప్రేక్షకులకు మిశ్రమ అనుభూతిని కలిగిస్తుంది. వైవిధ్యంగా అనిపించే కథాకథనాలు.. కొన్ని ఆసక్తికర సన్నివేశాలు సంతృప్తి కలిగించినా.. లాజిక్ లేకపోవడం.. మెలోడ్రామా ఎక్కువైపోవడం నిరాశ మిగులుస్తాయి.
నటీనటులు:
విజయ్ ఆంటోనీది ఏ భావాలూ పలకని ముఖం. అది అతడికున్న పెద్ద మైనస్. అతను అన్ని రకాల పాత్రలూ చేయలేడు. కాస్త మూడీగా ఉండే పాత్రలైతేనే అతడికి సూటవుతాయి. ఆ తరహా పాత్రల్నే ఎంచుకుంటూ హీరోగా ఓకే అనిపిస్తున్నాడతను. ‘బిచ్చగాడు’ సినిమాకు విజయ్ ఆంటోనీ ప్లస్సయ్యాడు. పాత్రకు తగ్గట్లుగా బాగా నటించాడతను. ఆంటోనీ పాత్రతో ప్రేక్షకులు బాగా కనెక్టవుతారు. ఎమోషనల్ సన్నివేశాల్లో అతడి నటన బాగుంది. హీరోయిన్ సత్నా కూడా బాగానే చేసింది. హీరో ఆస్తి కొట్టేయాలని చూసే అతడి బాబాయి పాత్రలో చేసిన నటుడు కూడా మెప్పించాడు. మిగతా వాళ్లంతా ఓకే.
సాంకేతిక వర్గం:
హీరోగానే కాకుండా సంగీత దర్శకుడిగానూ విజయ్ ఆంటోనీ సినిమాకు బలంగా నిలిచాడు. నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణ. సినిమా మూడ్ కు తగ్గ మ్యూజిక్ ఇచ్చాడతను. పాటలు పర్వాలేదు. ఛాయాగ్రహణం బాగుంది. పాటలు.. మాటల డబ్బింగ్ అక్కడక్కడా ఇబ్బందిగా అనిపిస్తుంది. సినిమాలో తమిళ నేటివిటీ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. చాలా విరామం తర్వాత సినిమా తీసిన సీనియర్ దర్శకుడు శశి.. దీని కోసం ఎంతో శ్రమించిన విషయం అర్థమవుతుంది. స్క్రీన్ ప్లే ఆసక్తికరంగా రాసుకున్నాడు. ఇది ఓ నిజ జీవిత కథ స్ఫూర్తితో తీసిన సినిమా అని చివర్లో ప్రకటించాడు దర్శకుడు. ఐతే ఆ కథకు సినిమా టచ్ ఇచ్చే క్రమంలో మెలోడ్రామా టచ్ ఎక్కువైపోయింది. లాజిక్కుల్ని పట్టించుకోలేదు.
చివరగా: బిచ్చగాడు.. జస్ట్ ఓకే
రేటింగ్-2.5/5