Begin typing your search above and press return to search.
#కరోనా.. 9PM మెగా లఘుచిత్రం చూడండి
By: Tupaki Desk | 7 April 2020 1:30 AM GMTకరోనా కల్లోలం మనుషుల్ని కలుపుతోంది. బంధాల్ని బంధుత్వాల్ని బలపరుస్తోంది. అంతా ఏకతాటిపైకి వచ్చి కరోనాకు వ్యతిరేకంగా పోరాడేలా సంకల్పసిద్ధిని అలవరుస్తోంది. ఇదో గొప్ప పాఠం. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ ఏకమై కరోనాపై ఉక్కు పాదం మోపాలన్న కొత్త పాఠం నేర్చుకుంటున్నాయి. అదంతా సరే కానీ.. ఇన్నాళ్లు పాన్ ఇండియా సినిమా కోసమే కలుస్తున్న బడా స్టార్లు ఇప్పుడు కరోనా పై యుద్ధం కోసం కలిసి ముందుకు సాగుతున్నారు. అందుకోసం ఏకంగా లఘు చిత్రంలోనే నటిస్తున్నారు. కరోనా భారిన అమాయక జనం పడకుండా అలెర్ట్ చేసేందుకే ఈ ప్రయత్నం.
ఇంతకీ ఈ లఘు చిత్రానికి కర్త ఎవరు? అంటే.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్... టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి .. సూపర్ స్టార్ రజనీకాంత్.. వీళ్లతో పాటు సమాలోచన జరుపుతున్న దర్శకుడు ప్రసూన్ పాండే.. సోని పిక్చరస్ బృందాలు. వీళ్లంతా కలిసికట్టుగా చేస్తున్న లఘు చిత్రంలో రణబీర్ కపూర్ ప్రియాంక చోప్రా- ఆలియా భట్ తదితరులు నటించనున్నారు. కొవిడ్ 19 కి వ్యతిరేకంగా.. `కుటుంబం` (ఫ్యామిలీ) పేరుతో ఒక షార్ట్ ఫిల్మ్ ని రూపొందించాలన్నది ప్లాన్.
ప్రజలంతా ఇంట్లోనే సురక్షితంగా ఉండడం.. పరిశుభ్రత పాటించడం.. ఇంటి నుండి పని చేయడం .. సామాజిక దూరాన్ని కొనసాగించడం వగైరా మంచి విషయాల్ని అందరికీ తెలియజేయనున్నారు. `ఫ్యామిలీ` పేరు తో ఈ లఘు చిత్రం సోనీ నెట్ వర్క్‌లో సోమవారం రాత్రి 9 గంటలకు ప్రదర్శితం కానుంది. వియ్ ఆర్ వన్ అనే స్లోగన్ తో సాగే చిత్రమిది. దీని ద్వారా దేశవ్యాప్తంగా లక్ష గృహాలకు నెలవారీ రేషన్ కి సరిపడే నిధుల్ని సేకరించాలన్నది ప్లాన్. కార్మికుల్లో కనీసం ఒక నెల పాటు గృహ సామాగ్రిని అందించాలన్నది సోనీ పిక్చర్స్ సంకల్పం అని చెబుతున్నారు. మరి ఈ లఘు చిత్రానికి ఎలాంటి స్పందన వస్తుందో.. విరాళం ఎంత కలెక్టవుతుందో చూడాలి.