Begin typing your search above and press return to search.
తాప్సి సినిమాకు అరుదైన గౌరవం
By: Tupaki Desk | 25 Feb 2017 7:54 AM GMTరాష్ట్రపతి ఓ సినిమా గొప్పదనం గురించి తెలుసుకుని.. ఆ చిత్ర బృందంతో కలిసి సినిమాను ప్రత్యేకంగా వీక్షించడం.. వారికి విందు ఏర్పాటు చేయడం అన్నది అరుదుగా జరిగే విషయం. ఈ అరుదైన గౌరవం అమితాబ్ బచ్చన్.. తాప్సి పన్ను ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘పింక్’ చిత్రానికి దక్కింది. ఈ సినిమాను శనివారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రత్యేకంగా వీక్షించబోతున్నారు. ఈ ప్రదర్శనకు అమితాబ్.. తాప్సిలతో పాటు దర్శకుడు అనిరుధ్ చౌదరి.. నిర్మాత సూర్జిత్ సిర్కార్ తదితరులు హాజరు కానున్నారు. ఢిల్లీలో చిత్ర ప్రదర్శన ముగిశాక వీల్లందరి ప్రణబ్ విందు కూడా ఇవ్వనున్నారు.
ఎంతో బిజీగా ఉండే రాష్ట్రపతి తమ సినిమా చూసేందుకు సమయం కేటాయించడం గొప్ప విషయమని.. ఆయనకు కేవలం థ్యాంక్స్ చెప్పి ఆగిపోలేమని.. ఇది తమకు దక్కిన గౌరవమని అమితాబ్ ట్విట్టర్లో పేర్కొన్నారు. తాప్సి కూడా రాష్ట్రపతి తమ సినిమాను చూడబోతుండటంపై చాలా ఎగ్జైట్ అయింది. ‘పింక్’ అమ్మాయిలపై జరిగే అఘాయిత్యాల నేపథ్యంలో సాగే సినిమా. ఇందులో తాప్సి ఒక బాధితురాలి పాత్ర పోషించింది. అమితాబ్ లాయర్ గా కనిపించారు. ఆద్యంతం ఉత్కంఠ రేపుతూ సాగే ఈ కోర్ట్ రూం డ్రామా.. చివర్లో గొప్ప సందేశంతో ముగుస్తుంది. విమర్శకుల ప్రశంసలతో పాటు మంచి వసూళ్లు కూడా సాధించిన ‘పింక్’ గత కొన్నేళ్లలో ఇండియాలో వచ్చిన అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా పేరు తెచ్చుకుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/