Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ తెలుగు-6 ఫస్ట్‌ గ్లింప్స్‌: ఈసారి సెటప్ మామూలుగా లేదుగా..!

By:  Tupaki Desk   |   1 Sep 2022 3:50 AM GMT
బిగ్ బాస్ తెలుగు-6 ఫస్ట్‌ గ్లింప్స్‌: ఈసారి సెటప్ మామూలుగా లేదుగా..!
X
బుల్లితెర ప్రేక్షకులను వీపరితంగా అలరించిన రియాల్టీ షో 'బిగ్‌ బాస్‌' తెలుగులోనూ సూపర్ సక్సెస్ అయింది. అత్యధిక టీఆర్పీతో ఇప్పటికే 5 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఆరో సీజన్ తో వినోదాన్ని పంచడానికి సరికొత్తగా రెడీ అయింది.

'బిగ్ బాస్' తెలుగు సీజన్-6 కు కింగ్ అక్కినేని నాగార్జున హోస్టుగా వ్యవహరించనున్నారు. గత మూడు సీజన్లతో పాటుగా ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన నాన్ స్టాప్ సీజన్ కు నాగ్ వ్యాఖ్యాతగా ఉన్నారు. ఈ క్రమంలో కొత్త సీజన్ లోనూ సందడి చేయనున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోలు ఇప్పటికే నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.

తెలుగు బిగ్ బాస్-6 కోసం ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎంపిక పూర్తయింది. అలానే హౌస్ లోకి వెళ్ళేవారిని ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు గ్రాండ్‌ గా ఎంట్రీ ఈవెంట్‌ ను నిర్వహించనున్నారు. వినాయక చవితి సందర్భంగా దీనికి సంబంధించిన ఫస్ట్‌ గ్లింప్స్‌ ను విడుదల చేశారు.

'లైఫ్ లో ఏ మూమెంట్ అయినా బిగ్ బాస్ తర్వాతే..' అంటూ నాగార్జున చెప్పడంతో ప్రారంభమైన ఈ వీడియోలో.. బిగ్ బాస్ హౌస్ సెటప్ ను చూపించారు. అలానే లాంచ్ ఈవెంట్ కు సంబంధించిన కొన్ని విజువల్స్‌ ను.. అస్పష్టంగా కొందరు కంటెస్టెంట్లను ఇందులో చూడొచ్చు.

'ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా..' అని 'విక్రమ్' సినిమాలో కమల్ హాసన్ చెప్పే డైలాగ్ కూడా వినిపించింది. 'బిగ్ బాస్ సీజన్ 6.. ఎంటర్టైన్మెంట్ కి అడ్డా ఫిక్స్' అంటూ వచ్చిన ఈ గ్లిమ్స్ ఆకట్టుకుంటోంది.

డిస్నీ పస్ల్ హాట్ స్టార్‌ లో సెప్టెంబర్ 4వ తేదీ నుంచి తెలుగు బిగ్ బాస్ సరికొత్త సీజన్ ప్రసారం కాబోతోంది. ఈసారి 19 మంది కంటెస్టెంట్లు బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చేందుకు రెడీగా ఉన్నట్టు టాక్. వారెవరు అనేది తెలియాలంటే ఆదివారం టెలికాస్ట్ అయ్యే గ్రాండ్ షోని చూడాల్సిందే.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.