Begin typing your search above and press return to search.
జైలుకు వెళ్లి వచ్చిన హీరోయిన్ కు 'బిగ్ బాస్' బిగ్ ఆఫర్
By: Tupaki Desk | 1 Oct 2021 3:30 AM GMTవెండి తెర.. బుల్లి తెరపై ఫేడ్ ఔట్ అవుతున్న వారికి మరియు సోషల్ మీడియా స్టార్స్ కు ఈమద్య కాలంలో బిగ్ బాస్ వంటి మంచి ఆఫర్లు వస్తున్నాయి. అవకాశాలు లేని వారికి బిగ్ బాస్ ఒక మంచి వేదిక అన్నట్లుగా మారింది. హిందీలో మాత్రమే ఒకప్పుడు ఉన్న బిగ్ బాస్ ఇప్పుడు సౌత్ లో కూడా అన్ని భాషల్లో బిగ్ బాస్ సీజన్ లకు సీజన్ లు నడుస్తున్నాయి. పెద్ద ఎత్తున విజయాన్ని సొంతం చేసుకుంటున్న నేపథ్యంలో సీజన్ సీజన్ కు పారితోషికాలు పెంచుతూ మరింత ఆసక్తిని కలిగిస్తూ షో లను చేస్తున్నారు. హిందీ బిగ్ బాస్ కు అత్యధిక రేటింగ్ వస్తోంది. సల్మాన్ ఖాన్ పారితోషికంగా వంద కోట్లకు పైగా పారితోషికాన్ని తీసుకుంటున్న నేపథ్యంలో ఏ స్థాయిలో హిందీ బిగ్ బాస్ విజయాన్ని దక్కించుకుంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హిందీ బిగ్ బాస్ లో కేవలం హోస్ట్ కు మాత్రమే కాకుండా కంటెస్టెంట్స్ కు కూడా భారీగా పారితోషికం ఇస్తున్నట్లుగా తెలుస్తోంది.
మంచి ఫామ్ లో ఉన్న స్టార్స్ కనుక బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లేందుకు ఓకే చెప్తే లక్షల పారితోషికంను ఇచ్చేందుకు సిద్దం అంటున్నారు. బిగ్ బాస్ అంటే వివాదాలకు కేంద్ర బింధువు. అలాంటి బిగ్ బాస్ లో మరింతగా క్రేజ్ తీసుకు వచ్చేందుకు గాను వివాదాస్పదులు అయిన వారిని బిగ్ బాస్ లో ఉండేలా నిర్వాహకులు ప్రయత్నిస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈ సీజన్ కు గాను బాలీవుడ్ హీరోయిన్ రియా చక్రవర్తిని ఎంపిక చేయాలనే ప్రయత్నాలు చేశారట. గత ఏడాది సుశాంత్ సింగ్ రాజ్ పూత్ ఆత్మహత్య సమయంలో ఆమె పేరు ప్రముఖంగా వినిపించింది. ఆతర్వాత డ్రగ్స్ కేసులో ఆమెకు సంబంధం ఉందని జైల్లో కూడా పెట్టారు. హీరోయిన్ గా ఆఫర్ల కోసం మళ్లీ ప్రయత్నాలు చేస్తున్న ఈ అమ్మడికి గాను బిగ్ బాస్ నుండి పిలుపు వచ్చిందట.
వారంకు రూ.30 లక్షలకు పైగా పారితోషికం ను ఇచ్చే విధంగా కూడా నిర్వాహకులు ఆమెను ఒప్పించేలా ప్రయత్నించారట. కాని ఆమె మాత్రం హీరోయిన్ గా మళ్లీ సినిమాల్లో నటించాలని భావిస్తుంది కాని బిగ్ బాస్ లో ఎంట్రీ ఇవ్వాలని అనుకోలేదట. బిగ్ బాస్ లో వారంకు 30 లక్షలు అంటే పది వారాలు ఉంటే మూడు కోట్లు. అంత పారితోషికం సినిమా ద్వారా కూడా రియాకు వచ్చే అవకాశం లేదు. ఒక మంచి ఆఫర్ ను ఆమె వదలుకుంది అంటూ కొందరు అంటూ ఉంటే ఆమె సుశాంత్ సింగ్ రాజ్ పూత్ కేసులో ఉన్న కారణంగా ఆమెకు ప్రేక్షకుల నుండి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. అందుకే ఆమె ముందుగానే ఆ విషయాన్ని గ్రహించి బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చేందుకు నిరాకరించి ఉంటుందనే టాక్ వినిపిస్తుంది. వచ్చే సీజన్ లో అయినా రియాను బిగ్ బాస్ లో చూస్తామా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.