Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 2: ఇప్పటికైతే కిక్ లేదబ్బా!!

By:  Tupaki Desk   |   11 Jun 2018 3:01 AM GMT
బిగ్ బాస్ 2: ఇప్పటికైతే కిక్ లేదబ్బా!!
X
ఈ మధ్యకాలంలో తెలుగు బుల్లితెరపై బాగా క్లిక్కయిన ప్రోగ్రామ్ ఏదన్నా ఉందా అంటే ఖచ్చితంగా అది బిగ్ బాస్ అనే చెప్పాలి. అసలు ఈ రియాల్టీ షో ను మనోళ్ళు చూస్తారా అనుకుంటే.. అత్యధిక టిఆర్పీలు కట్టబెట్టి దానిని సూపర్ హిట్ చేసేశారు. అందుకే ఇప్పుడు రెండో సీజన్ ను దించేశారు. అయితే ఎన్టీఆర్ స్థానంలో ఇప్పుడు నాని హోస్టుగా వస్తున్నాడు. నిన్ననే ఈ ప్రోగ్రాం ఓపెనర్ ప్రసారమైంది.

నిజానికి ఎన్టీఆర్ బుల్లితెరపై వస్తున్నాడనగానే కలిగిన ఒక రకమైన ఎక్సయిట్మెంట్ నాని వస్తున్నాడనగానే కలగలేదు. అంటే ఒక 90 కోట్ల హీరోకు 30+ కోట్ల హీరోకు ఆ మాత్రం తేడా ఉంటుందిలే. కాకపోతే నాని మాత్రం తన వాక్చాతుర్యంతో ఖచ్చితంగా ఆకట్టుకుంటే మాత్రం.. షో అదిరిపోతుంది. కాని నిన్నటి ఓపెనర్ ఎపిసోడ్ చూస్తుంటే మాత్రం.. అస్సలు ఏ మాత్రం కిక్ రాలేదని కొందరు అంటున్నారు. ఎందుకంటే ఎన్టీఆర్ తరహాలో నాని తన పార్టిసిపెంట్లను ఓన్ చేసుకోలేదు అనేది వారి బావన. అలాగే కాస్త ఎక్కువమంది పార్టిసిపెంట్లు ఉండటంతో.. వారిని గబగబా హౌసులోకి పంపేశాడు కాని.. సరిగ్గా వారిని పరిచయం కూడా చేయలేదని మరికొందరి ఫీలింగ్.

ఏదేమైనా కూడా.. ఇప్పటికైతే కిక్ లేదనేది టాక్. అయితే కేవలం ఒకే ఒక్క ఎపిసోడ్ చూసేసి నానిని జడ్జ్ చేసేయడం కరక్ట్ కాదులే. అప్పట్లో ఎన్టీఆర్ విషయంలో కూడా ఇలాంటి నెగెటివ్ టాక్ చాలా వచ్చింది. ఏదో డైలాగులు పట్టిపట్టీ చెబుతున్నట్లు ఉన్నాయని కామెంట్ చేశారు జనాలు. కాని చివరకు ఆ షో సూపర్ హిట్ అయ్యింది. మరి ఇప్పుడు నాని కూడా అలాగే తన క్రిటిక్స్ కు స్ర్టాంగ్ గా సమాధానం చెబుతాడని అనుకుందాం.