Begin typing your search above and press return to search.

కియారా - సిద్ధార్ద్ బ్రేక‌ప్!

By:  Tupaki Desk   |   23 April 2022 6:49 AM GMT
కియారా - సిద్ధార్ద్ బ్రేక‌ప్!
X
బాలీవుడ్ జంట కియారా అద్వాణీ -సిద్దార్ధ్ మ‌ల్హోత్రా ప్రేమాయ‌ణం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. కొన్నాళ్లు గా ఇద్ద‌రు సీరియ‌స్ డేటింగ్ లో ఉన్నారు. ప్రేమ పేరుతో తిర‌గ‌ని ప్ర‌దేశం లేదు. ముంబై మొత్తం చుట్టేసారు. మాల్దీవుల ప‌ర్య‌ట‌న రొమాంటిక్ వెకేష‌న్ ద‌గ్గ‌ర నుంచి `షేర్షా` వ‌ర‌కూ ఏ రేంజ్లో వైర‌ల్ అయ్యారో చెప్పాల్సిన ప‌నిలేదు. మాల్దీవుల్లో రొమాంటికే డేట్ ఫోటోలు నెట్టింట ఓ రేంజ్లో వైర‌ల్ అయ్యాయి. దీంతో వీడ‌దీయరాని బాండింగ్ బ‌ల‌ప‌డింద‌ని ఆ డేట్ తోనే క్లారిటీ వ‌చ్చేసింది.

ఇక ఇద్ద‌రు జంట‌గా న‌టించిన `షేర్షా` సినిమా చేసిన త‌ర్వాత రియ‌ల్ క‌పుల్స్ గా మారితే అద్భుతంగా ఉంటారంటూ అభిమానులు ఎంత‌గానో సంతోషించారు. ఇక ఆ సినిమా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల్లో ఈ జంట చేసిన హ‌డావుడి గురించి అయితే చెప్పాల్సిన ప‌నిలేదు.

జంట‌గా ప్రచారానికి హాజ‌ర‌వ్వ‌డం..తిరిగి వెళ్ల‌డం స‌హా మిడ్ నైట్ ప్రయివేట్ పార్టీల‌కు వెళ్ల‌డం నెట్టింట పెద్ద ర‌చ్చే జ‌రిగింది. దీంతో సిద్దార్ద్ చివ‌రికి ఓపెన్ కాక త‌ప్ప‌లేదు. మా జీవితాలు..మా బంధం సినిమా ప‌రిశ్ర‌మ‌కి అతీతంగా ఉన్నాయి. ఆ కార‌ణంగానే మా మ‌న‌సులు క‌లిసాయి. అందుకే క‌లిసి ప్ర‌యాణం చేయాల‌నుకుంటున్నామ‌ని రివీల్ చేసారు.

దీంతో ఈ జంట పెళ్లి చేసుకోవ‌డం ఖాయంగా క‌నిపించింది. క‌త్రినాకైఫ్-విక్కీ కౌశ‌ల్...అలియాభ‌ట్...ర‌ణ‌బీర్ క‌పూర్ త‌ర్వాత పెళ్లి చేసుకునే జంట ఇదేనంటూ రెండు ..మూడు రోజుల క్రితం బాలీవుడ్ మీడియాలో సైతం వార్త‌లొచ్చాయి. అయితే ఇప్పుడా బంధం వీగిపోవ‌డానికి స‌మీపాన ఉన్న‌ట్లు మీడియా లో వార్త‌లొస్తున్నాయి. ఇద్ద‌రు విడిపోయార‌ని వ‌స్తోన్న క‌థ‌నాల‌పై కియారా స‌న్నిహితులు సైతం ధృవీక‌రించ‌డం సంచ‌ల‌నంగా మారింది.

ఈ విష‌యాన్ని కియారా స‌న్నిహితులు సైతం జీర్షించుకోలేక‌పొతున్నార‌ని..ఎంత స‌ర్దిచెప్పినా కియారా రాజీ అవ్వ‌డం లేద‌ని ఓ వార్త మీడియాని కుదిపేస్తుంది. కియారా-సిద్దార్ధ్ మ‌ధ్య తీవ్ర‌మైన మ‌న్స‌ర్ధ‌లు త‌లెత్తాయని ఆకార‌ణంగా విడిపోవ‌డానికి సిద్దంగా ఉన్నారంటూ మీడియా క‌థ‌నాలు హీటెక్కిస్తున్నాయి. అయితే వీటిని ఇంకా సిద్దార్ధ్ గానీ..ఇయారా గానీ ధృవీక‌రించ‌లేదు. ఎవ‌రో ఒక‌రు మౌనం వీడితో గానీ బ్రేక‌ప్ పై పూర్తి క్లారిటీ రాదు.

ఇక వృత్తి ప‌రంగా ఇద్ద‌రు బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. కియారా బాలీవుడ్ సినిమాల‌తో పాటు టాలీవుడ్ లోనూ న‌టిస్తోంది. ప్ర‌స్తుతం మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా న‌టిస్తోన్న 15వ చిత్రంలో కియారా న‌టిస్తోంది. ఈ చిత్రానికి శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.