Begin typing your search above and press return to search.

శేఖర్‌ కమ్ముల ముందు పెద్ద ఛాలెంజ్‌

By:  Tupaki Desk   |   4 July 2021 6:35 AM GMT
శేఖర్‌ కమ్ముల ముందు పెద్ద ఛాలెంజ్‌
X
ట్యాలెంటెడ్‌ డైరెక్టర్ శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన లవ్ స్టోరీ చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. చివరి నిమిషంలో గత ఏడాది నుండి వాయిదా పడుతూ వస్తున్న లవ్‌ స్టోరీ సినిమా థియేటర్లు పూర్తి స్థాయిలో ఎప్పుడు ఓపెన్‌ అయితే అప్పుడు విడుదలకు సిద్దంగా ఉంది. లవ్‌ స్టోరీ సినిమాను పక్కకు పెట్టేసిన శేఖర్‌ కమ్ముల ప్రస్తుతం తన తదుపరి సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ ను మొదలు పెట్టాడు. ఫిదా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న శేఖర్‌ కమ్ముల లవ్‌ స్టోరీ తర్వాత గ్యాప్ లేకుండా ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే ధనుష్‌ హీరోగా బహు భాష చిత్రంగా పాన్ ఇండియా రేంజ్ సినిమాను రూపొందించబోతున్నట్లుగా శేఖర్‌ కమ్ముల నుండి ప్రకటన వచ్చింది.

శేఖర్‌ కమ్ముల వంటి విలక్షణ దర్శకుడితో ధనుష్‌ వంటి ట్యాలెంటెడ్ హీరో వర్క్‌ చేస్తే ఆ సినిమా మరో రేంజ్ లో ఉంటుందని ఇప్పటి నుండే అంచనాలు పెరిగాయి. సాదారణంగా ధనుష్ సినిమా అయితే తెలుగు ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించరు. కాని శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ఆయన సినిమా అంటే అంచనాలు భారీగా పెంచేసుకున్నారు. అంచనాలకు తగ్గట్లుగా శేఖర్ కమ్ముల ఈ సినిమాను తీయబోతున్నాడు. ఈ సినిమా లో ధనుష్ మాత్రమే కాకుండా మరో హీరోను కూడా చూపించబోతున్నారట. ఆ హీరో పోలీస్‌ ఆఫీసర్ గా కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ధనుష్ ఒక హీరోగా మరో హీరోను టాలీవుడ్ నుండి ఎంపిక చేసి బ్యాలన్స్ చేయాలని భావిస్తున్నారు.

పాన్ ఇండియా మూవీ కనుక హిందీ నటుడిని కూడా నటింపజేసే అవకాశాలు లేకపోలేదు. ఈ క్రేజీ మూవీ మరో హీరో విషయమై అతి త్వరలో క్లారిటీ రావాల్సి ఉంది. ఆకట్టుకునే అంశాలతో శేఖర్‌ కమ్ముల ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడు. సాదారణంగా మల్టీ స్టారర్‌ సినిమా అంటే దర్శకులకు ఛాలెంజింగ్ గా ఉంటుంది. ఇద్దరు హీరోలకు సరైన సీన్స్ రాసుకోవడంతో పాటు ఇద్దరు హీరోలకు సమ ప్రాముఖ్యత ఇచ్చేలా స్క్రీన్ ప్లే ఉండాలి. కనుక ఈ సినిమా శేఖర్‌ కమ్ములకు ఇంతకు ముందు సినిమాలతో పోల్చితే కాస్త పెద్ద ఛాలెంజ్‌ అనడంలో సందేహం లేదు.

ఇటీవల తన తమిళ సినిమా చిత్రీకరణ కోసం హైదరాబాద్‌ వచ్చిన ధనుష్ షూటింగ్ గ్యాప్‌ లో శేఖర్‌ కమ్ములతో పాటు నిర్మాతలను కలవడం జరిగింది. ఆ సమయంలోనే కథను మరియు డేట్ల విషయంను చర్చించినట్లుగా తెలుస్తోంది. షూటింగ్ కు మరో రెండు మూడు నెలల సమయంను శేఖర్ కమ్ముల కోరినట్లుగా తెలుస్తోంది. స్క్రిప్ట్‌ పూర్తి స్థాయిలో రెడీ చేసుకుని.. నటీ నటుల ఎంపిక ఇతర ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ పూర్తి చేసి ఆ తర్వాత సినిమాను పట్టాలెక్కించాలని భావిస్తున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా అంటే యంగ్ హీరోలు రెడీగా ఉంటారు. మరి ధనుష్‌ తో మరే సినిమా స్క్రీన్ షేర్‌ చేసుకుంటాడో చూడాలి.