Begin typing your search above and press return to search.

సైరా ఈ సవాల్ ని ఎదురుకుంటుందా?

By:  Tupaki Desk   |   4 Sep 2019 7:00 AM GMT
సైరా ఈ సవాల్ ని ఎదురుకుంటుందా?
X
పాన్ ఇండియా లెవెల్ లో మూడు వందల కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొంది నెగటివ్ టాక్ లోనూ మూడు వందల కోట్లు సాధించిన సాహో వచ్చే నెలలో రానున్న సైరాకు కొత్త పజిల్స్ ని విడిచిపెట్టింది. సాహో ఈ మాత్రమైనా వర్క్ అవుట్ కావడానికి ప్రధాన కారణం బాహుబలి వల్ల వచ్చిన ఇమేజ్. దాని తర్వాత రూపొందిన మూవీ కావడంతో నార్త్ లోనూ అంచనాలు విపరీతంగా ఏర్పడ్డాయి. ప్రభాస్ కంటూ స్వంతంగా ఫాలోయింగ్ ఏర్పడింది.

అందుకే ఓపెనింగ్స్ విషయంలో ఉత్తరాది రాష్ట్రాల్లోనూ రికార్డ్స్ నమోదయ్యాయి. ఫైనల్ రన్ అయ్యేలోపు ఎంతవస్తుందనేది పక్కన పెడితే ఈ ఫిగర్స్ కారణాలు బాహుబలి మార్కెట్ ప్రభాస్ ఇమేజ్ అని ఒప్పుకోక తప్పదు. కాని సైరాకు ఈ రెండు ప్లస్ పాయింట్స్ లేవు. చిరంజీవిని డబ్బింగ్ సినిమాల్లో చూడటం తప్ప అక్కడి ప్రేక్షకులకు టచ్ ఎప్పుడో పోయింది. పాతికేళ్ళ క్రితం ది జెంటిల్ మెన్ చేశాక చిరు స్ట్రెయిట్ గా హింది సినిమాలు చేయలేదు. డబ్ చేసినవి ధియేటర్లలో పెద్దగా ఆడలేదు.

ఈ నేపద్యంలో హృతిక్ రోషన్ వార్ తో పోటీ పడుతున్న సైరా ఓపెనింగ్స్ రాబట్టుకోవడం నార్త్ లో అంత ఈజీ కాదు. టాక్ తో పాటు రిపోర్ట్స్ ఓ రేంజ్ లో రావాలి. ఇదీ పాన్ ఇండియా మూవీనే. సాహో కన్నడ మినహాయించి నాలుగు బాషలలో రిలీజ్ చేస్తే సైరా ఏకంగా ఐదు లాంగ్వేజెస్ లో వదులుతున్నారు. సో సైరా ఈ సవాల్ ని ఫేస్ చేయడం అంత సులభమైతే కాదు. అక్టోబర్ 2 విడుదల పదే పదే పునరుద్ఘాటిస్తున్నారు కాబట్టి తేదిలో మార్పు ఉండకపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంది