Begin typing your search above and press return to search.
శర్వాకిది పెద్ద సవాలే!
By: Tupaki Desk | 16 Dec 2018 6:54 AM GMTడిసెంబర్ 21 బాక్స్ ఆఫీస్ వార్ మహా రసవత్తరంగా ఉండబోతోంది. కన్నడ నుంచి డబ్ చేసిన కెజిఎఫ్ షారుఖ్ ఖాన్ జీరోలు కూడా క్రేజీ ప్రాజెక్ట్స్ గా హైప్ తెచ్చుకున్నప్పటికీ అందరి దృష్టి పడి పడి లేచే మనసు-అంతరిక్షంల మీదే ఉంది. వరుణ్ తేజ్ సినిమా ప్రత్యేకమైన జానర్ కాబట్టి దాని గురించి ఎలాంటి అంచనాకు రాలేం కానీ మెయిన్ గా యూత్ ని బాగా ఆకట్టుకుంటున్న శర్వానంద్ మూవీ ముందు మాత్రం చాలా పెద్ద టార్గెట్స్ ఉన్నాయి. తీసే సబ్జెక్టు ఎలాంటిదైనా కాస్త వ్యయం అధికంగా డిమాండ్ చేస్తాడనే పేరున్న దర్శకుడు హను రాఘవపూడి దీని బడ్జెట్ ని సైతం 32 కోట్ల దాకా చేయించినట్టు తెలిసింది.
నిజానికి శర్వాకు అంత మార్కెట్ లేదు. బ్లాక్ బస్టర్ అనే టాక్ వస్తే అదేమంత భారీ మొత్తం కాదు కానీ ఇప్పటికైతే సవాల్ అనిపించేదే. కానీ శాటిలైట్ డిజిటల్ తో పాటు డబ్బింగ్ రీమేక్ రూపంలో విడుదలకు ముందే మంచి మొత్తం చేతికి అందడంతో నిర్మాతకు రిస్క్ ఫాక్టర్ తగ్గింది. అయితే థియేట్రికల్ టార్గెట్ మాత్రం పెద్దదిగానే ఉంటుంది. ఎంత లేదన్నా పాతిక కోట్ల దాకా ఫైనల్ రన్ పూర్తయ్యే లోపు తీసుకురావాల్సి ఉంటుంది. సోలోగా వచ్చుంటే కథ వేరుగా ఉండేది కాని తీవ్రమైన పోటీ మధ్య ఓపెనింగ్స్ ని తనవైపు లాక్కునేలా చేయడంలో శర్వా టీం పెద్ద కసరత్తే చేయాలి.
ట్రైలర్ తో పాటు ఆడియో యూత్ కి బాగా కనెక్ట్ అవ్వడం పట్ల టీం రిలీఫ్ గా ఉంది. ఈ అంశాల్లో పడి పడి లేచే మనసు ఓ అడుగు ముందే ఉంది. సెన్సిటివ్ లవ్ స్టొరీ అనే అభిప్రాయం కలిగించడంతో యువతలో దీని గురించి మంచి హైప్ ఉంది. ప్రమోషన్ లో చూపించిన కంటెంట్ అంచనాలకు తగ్గట్టు సినిమాలో ఉంటె ఏ సమస్యా లేదు. ఏ మాత్రం తేడా వచ్చిన అపోజిషన్ కు మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. మరి శర్వా ఈ సవాల్ ని ఎలా ఎదురుకుంటాడో శుక్రవారం తేలిపోతుంది.