Begin typing your search above and press return to search.

OTT ల‌కు మూడిన‌ట్టే ఇక .. కేంద్ర స‌మాచార శాఖ‌ సీరియ‌స్!

By:  Tupaki Desk   |   17 Feb 2021 5:30 AM GMT
OTT ల‌కు మూడిన‌ట్టే ఇక .. కేంద్ర స‌మాచార శాఖ‌ సీరియ‌స్!
X
OTT ప్లాట్ ఫారమ్ ‌ల విచ్చ‌ల‌విడిత‌నం దుర్వినియోగంపై కేంద్రం సీరియ‌స్ గా ఉంది. ఈ వేదిక‌పై కంటెంట్ నియంత్రణ కోసం చర్యలు తీసుకుంటామని కేంద్రం సుప్రీంకోర్టుకు విన్న‌వించ‌నుందన్న‌ది తాజా వార్త‌.

నెట్‌ఫ్లిక్స్- అమెజాన్ ప్రైమ్ ఓటిటి ప్లాట్ ఫామ్ ‌లను నియంత్రించే అంశంపై చర్యలు తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు కేంద్రం మంగళవారం నాడు సుప్రీంకోర్టుకు తెలిపింది. ఒక పిటిషనర్ స్వయంప్రతిపత్త సంస్థ ద్వారా OTT నియంత్రణ కోరుతూ కోర్టును ఆశ్రయించారు. ప్రధాన న్యాయమూర్తి ఎస్ ఎ బొబ్డే - న్యాయమూర్తులు ఎ ఎస్ బోపన్న- వి రామసుబ్రమణియన్లతో కూడిన ధర్మాసనం పిటిషనర్ సంబంధిత స‌మ‌స్య పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని సంప్రదించాలని మొదట అభిప్రాయపడింది. కానీ తరువాత ఆరు వారాల్లోగా తన స్పందనను దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది.

OTT ప్లాట్‌ఫారమ్‌లను నియంత్రించే అంశంపై కేంద్రం కొన్ని చర్యలను పరిశీలిస్తున్నట్లు అదనపు సొలిసిటర్ జనరల్ సంజయ్ జైన్ తెలిపారు. సిజెఐ ఈ చర్య ఏమిటో జైన్ నుండి తెలుసుకోవాలని కోరింది.పెండింగ్ పిటిషన్ తో ఈ విషయాన్ని ట్యాగ్ చేస్తూ ఆరు వారాల్లో స్పందన దాఖలు చేయమని కోరింది.

దేశంలో ఎప్పుడైనా సినిమా థియేటర్లు తెరవడానికి అవకాశం లేనందున, OTT స్ట్రీమింగ్ .. విభిన్న డిజిటల్ మీడియా ప్లాట్ ‌ఫారమ్ ‌లు తప్పనిసరిగా చిత్ర నిర్మాతలు కళాకారులకు ఆందోళన చెందకుండా వారి కంటెంట్ ‌ను విడుదల చేయడానికి ఒక మార్గాన్ని అన్వేషించాయ‌ని న్యాయవాదులు శశాంక్ శేఖ‌ర్ .. అపుర్వ అర్హాటియా విజ్ఞప్తి చేశారు. సెన్సార్ బోర్డు నుండి వారి సినిమాలు సిరీస్ కోసం క్లియరెన్స్ సర్టిఫికేట్ పొందడం గురించి ఈ సంద‌ర్భంగా ప్రస్థావ‌న వ‌చ్చింది.

అయితే ప్రస్తుతం ఈ డిజిటల్ విషయాలను పర్యవేక్షించడానికి నిర్వహించడానికి డిజిటల్ కంటెంట్ ను నియంత్రించే చట్టం లేదా స్వయంప్రతిపత్త సంస్థ లేదు. ఇది ఎటువంటి వడపోత లేదా స్క్రీనింగ్ లేకుండా ప్రజలకు ఓపెన్ గానే అందుబాటులో ఉంచుతున్నారు. OTT / స్ట్రీమింగ్ ప్లాట్ ఫారమ్ లను నియంత్రించే చట్టం లేకపోవడం వ‌ల్ల స‌మ‌స్య ఏమిట‌న్న‌ది ప్రతి రోజు ప్రతి కొత్త కేసుతో స్పష్టమవుతోంది. ఈ వ్య‌వ‌హారాల్ని న్యాయవ్యవస్థ నిబంధనలతో నింపడానికి ప్రభుత్వం హీట్ ని ఎదుర్కొంటోంది. ఈ OTT / స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లను క్రమబద్ధీకరించడానికి సంబంధిత ప్రభుత్వ విభాగాలు ముఖ్యమైనవి ఏమీ చేయలేదన్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

ఫిబ్రవరి 2020 నుండి సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ప్ర‌తిపాదించిన‌ స్వీయ నియంత్రణ వ్య‌వ‌స్థ అమ‌లుపై స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ ‌లలో కేవ‌లం ఒకే ఒక్క ఓటీటీ మాత్ర‌మే సంతకం చేసిందని పిటిషన్ పేర్కొంది.