Begin typing your search above and press return to search.
సాహోకున్న అతి పెద్ద డేంజర్
By: Tupaki Desk | 14 Aug 2019 5:30 PM GMTమూడు వారాల కంటే తక్కువ వ్యవధి ఉన్న సాహో రిలీజ్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ కు కునుకు పట్టడం కూడా కష్టంగానే ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా ఉన్న టీమ్ మరోవైపు ప్రమోషన్ పై కూడా ఫోకస్ పెడుతూ హైప్ ని పెంచే పనిలో ఉంది. ఇలాంటి విజువల్ వండర్స్ కి ప్రత్యేకంగా పబ్లిసిటీ అక్కర్లేదు అనే కామెంట్స్ ఉన్నప్పటికీ బాహుబలి లాంటి దిగ్గజం సైతం ప్రచారం సహాయం లేకుండా అంత సక్సెస్ కాలేదు. కాబట్టి ఇవన్నీ అవసరమే.
ఇదిలా ఉండగా సాహో వివిధ బాషల్లో రిలీజ్ కావడం అందులోనూ ఒక్క ఇండియాలోనే 7 వేలకు స్క్రీన్లలో మొదటి రోజు షోలు ప్లాన్ చేయడం ఒకరకంగా ప్లస్ గా అనిపిస్తున్నప్పటికీ దానికి సంబంధించి అతి పెద్ద డేంజర్ మరొకటి పొంచి ఉంది. అదే పైరసీ. అసలే మల్టీ లాంగ్వేజ్ రిలీజ్. ప్రపంచవ్యాప్తంగా నలుమూలల విడుదల ఉంటుంది. ఈ మధ్యకాలంలో టెక్నాలజీ వాడకం పెరిగాక పైరసీ వీరులు కూడా అదే స్థాయిలో రెచ్చిపోతున్నారు.
తమిళ్ రాకర్స్ లాంటి సైట్ల మీద చర్య తీసుకోవాల్సిందిగా కోర్టు ఆదేశించినప్పటికీ ఏదో ఒక రూపంలో అవి ప్రత్యక్షం అవుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్క ప్రింట్ బయటికి తెస్తే చాలు దాన్ని డబ్బింగ్ రూపంలో సౌండ్ సింక్ చేసి మరీ కాపీలు ఆన్ లైన్ లో పెట్టే దగుల్బాచీలు ఉన్నారు.
మరి సాహో టీమ్ వీటిని కట్టడి చేయడం అంటే పెద్ద సవాలే. అందులోనూ స్మార్ట్ ఫోన్ల వాడకం విచ్చలవిడిగా మారిన తరుణంలో ఏదైనా క్షణాల్లో షేర్ చేసుకోవడం చాలా సులభమైపోయింది. బోనీ కపూర్ ఇటీవలే తన తమిళ చిత్రం నీర్కొండ పార్వై పైరసీని ఆపడానికి ముందస్తు పిటీషన్ వేసినా లాభం లేకపోయింది. మరి సాహో ఈ సవాల్ ని ఎలా ఎదురుకుంటుందో చూడాలి