Begin typing your search above and press return to search.

ఇంత చిన్న ఓటమికే అంత పెద్ద నిర్ణయం ఏంటి రంగమ్మత్త!

By:  Tupaki Desk   |   12 Oct 2021 3:34 AM GMT
ఇంత చిన్న ఓటమికే అంత పెద్ద నిర్ణయం ఏంటి రంగమ్మత్త!
X
మా ఎన్నికల్లో జబర్దస్త్‌ నుండి సుధీర్ మరియు అనసూయలు పోటీ చేసిన విషయం తెల్సిందే. బుల్లి తెరతో పాటు వెండి తెరపై కూడా వీరు మెరుస్తూ అప్ కమింగ్ నటీ నటుడుగా పేరు దక్కించుకున్నారు. వీరిద్దరికి బుల్లి తెరపై ఉన్నంత క్రేజ్‌.. బుల్లి తెర ఇండస్ట్రీలో ఉన్నంత క్రేజ్‌ వెండి తెరపై లేదు. ఆ విషయం అనసూయ ఓటమితో తేలిపోయింది. అనసూయ అనూహ్యంగా ఈసీ మెంబర్‌ గా పోటీ చేసి ఓడి పోయింది. పెద్దగా ప్రాముఖ్యత ఉండని ఈసీ మెంబర్‌ గా పోటీ చేసేందుకు అనసూయ సిద్దం అయిన సమయంలో చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేశారు. అనసూయకు అవసరమా అంటూ చాలా మంది అభిప్రాయ పడ్డా ఆమె మాత్రం చాలా ఆసక్తి చూపించి పోటీకి సిద్దం అయ్యింది. కాని అనూహ్యంగా అనసూయ ఓటమి పాలయిన తర్వాత ఆమెకు తెలిసి వచ్చింది. తాను ఈ ఎన్నికల్లో పోటీ చేయడం తప్పు అనే విషయాన్ని ఆమె గ్రహించింది. స్వయంగా ట్విట్టర్ లో ఆ విషయాన్ని తెలియజేస్తూ ట్వీట్‌ చేసింది.

అనసూయ ఉన్న బిజీగా ఈసీ మెంబర్‌ గా విధులను నిర్వహించలేదు కనుక ఆమె పోటీ చేయక పోవడం మంచిదనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేయడంతో పాటు ఈ ఎన్నికల్లో ఓడి పోతే ఆమెకు తగు గుణపాఠం లభిస్తుందని కొందరు అనుకున్నారు. ఆమె ఓడి పోయిన నేపథ్యంలో నిజంగానే పాఠం నేర్చుకున్నట్లయ్యింది. నిజమే పాఠం నేర్చుకున్నాను అంటూ సోషల్‌ మీడియాలో ట్వీట్‌ చేసింది. ఇంకా ఆమె మళ్లీ ఎప్పుడు కూడా ఏ రాజకీయంలో కూడా ఇన్వాల్వ్‌ అవ్వను అంది. రాజకీయాల్లో నిజాయితీగా ఉండటం కరెక్ట్‌ కాదని చెప్పుకొచ్చింది. నాకు ఇలాంటి వాటికి టైమ్ లేదు. నా పిల్లలతో మరియు పనితోనే బిజీగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చింది. మళ్లీ ఎప్పుడు కూడా ఇలాంటి ఎన్నికల్లో పోటీ చేయను అంటూ అనసూయ ట్వీట్‌ చేసి అందరికి షాక్ ఇచ్చింది.

అనసూయ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కొందరు తప్పుబడుతున్నారు. ఇంత చిన్న ఓటమికే అంత పెద్ద నిర్ణయం తీసుకోవడం ఏంటీ అనసూయ అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే కొందరు మాత్రం మంచి నిర్ణయం తీసుకున్నావు అమ్మడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఎన్నికల ఫలితాల సందర్బంగా అనసూయ గెలిచింది అంటూ మొదట ప్రచారం జరిగింది. మీడియాలో అందరు కూడా అనసూయ విజయం సాధించింది అంటూ వార్తలు చూపించారు. కాని అనసూయ గెలవలేదు.. ఓడి పోయిందని తర్వాత రోజుకు గాని క్లారిటీ రాలేదు. తర్వాత రోజు జరిగిన ఎన్నికల లెక్కింపుతో అనసూయ ఓటమిని అధికారికంగా ప్రకటించారు. మా లో ఉన్న 900 ఓట్లలో పోల్ అయిన ఓట్లు కొన్నే.. వాటినే తర్వాత రోజు లెక్కించడం విడ్డూరంగా అనిపించిందని అనసూయ అసంతృప్తి వ్యక్తం చేసింది. మొత్తానికి అనసూయ గెలుపొందిందనే వార్తలు వచ్చి ఆ తర్వాత ఓడి పోయిందని చెప్పడంతో కాస్త అసంతృప్తి అయితే వ్యక్తం అవుతోంది.