Begin typing your search above and press return to search.
వీరరాఘవ సోలో ఫైట్ కాదు
By: Tupaki Desk | 11 July 2018 5:24 AM GMTయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దర్శకుడు త్రివిక్రమ్ క్రేజీ కాంబోలో తెరకెక్కుతున్న అరవింద సమేత వీర రాఘవ ఎలాంటి గ్యాప్స్ లేకుండా రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. దసరా టార్గెట్ పెట్టుకునే షూటింగ్ మొదలుపెట్టారు కాబట్టి దానికి అనుగుణంగానే ఎటువంటి జాప్యం లేకుండా పని కానిచ్చేస్తున్నారు. ఇన్ సైడ్ ప్రకారం దీని రిలీజ్ డేట్ అక్టోబర్ 11 ఫిక్స్ చేసారు.ఇంకా చాలా టైం ఉంది కాబట్టి అఫీషియల్ గా ఇప్పుడే ప్రకటించకపోవచ్చు. కాకపోతే తారక్ ఒక్కడే వస్తాడా లేక పోటీ ఎవరు ఉంటారు అనే దాని మీద ఫాన్స్ తో పాటు సినిమా ప్రేమికుల్లో సైతం ఆసక్తి ఉండటం సహజం. పరిస్థితిని గమనిస్తే జనతా గ్యారేజ్ రిలీజ్ తరహాలో ఈసారి జూనియర్ ఫైట్ సోలోగా ఉండే ఛాన్స్ లేదు. అదే రోజు అని కాదు కానీ ముందు వెనుక హైప్ ఉన్న సినిమాల క్యూ చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉంది. అందులో స్ట్రెయిట్ సినిమాలతో పాటు డబ్బింగ్ వెర్షన్లు కూడా ఉండటం విశేషం.
విశాల్ పందెం కోడి 2 దసరాకు తెస్తానని అభిమన్యుడు సక్సెస్ మీట్ లో ప్రకటించేసాడు కాబట్టి అందులో మార్పు ఉండకపోవచ్చు. రామ్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో త్రినాథ రావు దర్శకుడిగా రూపొందిన హలో గురు ప్రేమ కోసమే కూడా ఇదే ప్లానింగ్ లో ఉంది. విశాల్ సినిమా పోటీ ఎలా అని అనుకోవడానికి లేదు. ఫుల్ మాస్ మసాలాతో రూపొందడంతో పాటు కీర్తి సురేష్ హీరోయిన్ కావడం ప్లస్ గా మారుతోంది. ఇక హలొ గురు ప్రేమ కోసమే హిట్ కాంబో కాబట్టి సహజంగానే హైప్ ఉంటుంది. ఇక శీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న అమర్ అక్బర్ ఆంటోనీ డేట్ ని సెప్టెంబర్ చివరి వారానికి ఫిక్స్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి కాని ఏ మాత్రం ఆలస్యం జరిగినా అక్టోబర్ కు వెళ్ళిపోతుంది.
వరుణ్ తేజ్ అంతరిక్షం(వర్కింగ్ టైటిల్)సైతం ఆ సీజన్ మీదే కన్ను వేసింది. సవ్యసాచి కంటే ముందు శైలజారెడ్డి అల్లుడు విడుదలయితే ఆటోమేటిక్ గా ఇది అక్టోబర్ నే టార్గెట్ చేసుకుంటుంది. ఇవి కాకుండా హరి దర్శకత్వంతో రూపొందుతున్న సామీ 2 గురించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అందరు అక్టోబర్ 11నే రావడం లేదు కానీ ముందు వెనుక ఉన్నారు కాబట్టి ఎక్కువ రోజులు థియేటర్లలో సినిమాను నిలిబెట్టాలి అంటే చాలా బలమైన కంటెంట్ అవసరం. అరవింద సమేత వీర రాఘవలో అవి పుష్కలంగా ఉన్నాయని అభిమానులు చాలా నమ్మకంగా ఉన్నారు. అదే నిజమైతే ఇంత పోటీని తట్టుకోవడం తారక్ కు పెద్ద మ్యాటర్ కాదని కూడా వారే అంటున్నారు. చూద్దాం.