Begin typing your search above and press return to search.

లాక్‌ డౌన్‌ తర్వాత కూడా థియేటర్లలోకి రాని పెద్ద సినిమాలు

By:  Tupaki Desk   |   7 April 2020 12:30 AM GMT
లాక్‌ డౌన్‌ తర్వాత కూడా థియేటర్లలోకి రాని పెద్ద సినిమాలు
X
కంటికి కనిపించని కరోనా వైరస్‌ ప్రపంచ జనజీవనంను అస్థవ్యస్థం చేస్తోంది. చిన్నా పెద్ద బీదా బిక్కి అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి లైఫ్‌ స్టైల్‌ ను మార్చేసింది. ఈ సమయంలో సినిమా పరిశ్రమ కూడా తీవ్ర సంక్షోభంను ఎదుర్కొంటుంది. అన్ని భాషల సినిమాలు కూడా విడుదలకు నోచుకోకుండా వాయిదా పడి పోయాయి. ఏప్రిల్‌ 14 తర్వాత లాక్‌ డౌన్‌ ను ఎత్తి వేసే అవకాశం ఉంది అంటున్నారు. ఆసమయంలో థియేటర్లు ఓపెన్‌ చేస్తే తమ సినిమాలు విడుదల చేసుకోవాలని పలువురు నిర్మాతలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అలాంటి వారికి షాకింగ్‌ విషయం ఒకటి మీడియాలో ప్రచారం జరుగుతోంది. కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో థియేటర్లకు ప్రేక్షకులు వెళ్లాలి అంటేనే భయపడుతున్నారు. అందుకే కనీసం ఆరు నెలల వరకు అయినా సినిమాలకు ప్రేక్షకులు దూరంగా ఉండాలని భావించవచ్చు అంటున్నారు. ఇక థియేటర్లకు ప్రభుత్వాలు అనుమతించినా కూడా 30 నుండి 50 శాతం మాత్రమే టికెట్లు ఇవ్వాలని అలాగే సామాజిక దూరం పాటించేలా ఒక సీట్‌ వదిలి మరో సీటు అన్నట్లుగా ప్రేక్షకులు కూర్చునేలా చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు ఇచ్చి మరీ థియేటర్లను రీ ఓపెన్‌ చేసే అవకాశం ఉంది.

అన్ని ఆంక్షల మద్య సినిమాను చూసేందుకు ప్రేక్షకులు రాకపోవచ్చు. అందుకే పెద్ద సినిమాల విడుదల వల్ల భారీ నష్టాలు వాటిల్లే అవకాశం ఉంది. ఈమద్య కాలంలో పెద్ద సినిమాలు కేవలం రెండు మూడు వారాల్లోనే పూర్తి వసూళ్లను రాబట్టుకుంటున్నాయి. ఆ తర్వాత థియేటర్లలో సినిమాలు ఉండటం లేదు. తక్కువ ఆక్యుపెన్సీతో నడిచే థియేటర్లలో పెద్ద సినిమాలు విడుదల చేస్తే ఏడది అంతా ఆడిచ్చినా కూడా బడ్జెట్‌ రికవరీ అవ్వడం సాధ్యం అయ్యే పని కాదంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కనుక రాబోయే అయిదు ఆరు నెలల వరకు పెద్ద సినిమాలు రాకపోవచ్చు అంటూ అభిప్రాయం వ్యక్తం అవుతోంది.