Begin typing your search above and press return to search.
డ్రగ్స్.. ఆ చేపలు ఒత్తిడి తెస్తున్నాయ్
By: Tupaki Desk | 25 July 2017 11:54 AM GMTస్కూల్ పిల్లలతో మొదలై టాలీవుడ్ సెలబ్రిటీల వరకు.. ఇప్పుడు డ్రగ్స్ స్కాండల్ హైదరాబాద్ ను కుదిపేస్తోంది. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు నోటీసులు అందుకుని విచారణకు హాజరవుతుండగా.. ఇప్పుడు ఇంకో డజను మందికి నోటీసులు అందిస్తున్నారు అంటూ రూమర్లు పుట్టుకొస్తున్నాయి. అయితే ఈ మొత్తం విచారణలో కొన్ని చిన్న చిన్న చేపలు వల్లో పడ్డాయ్ కాని.. పెద్ద చేపలు మాత్రం జాగ్రత్తగా స్లిప్ అయిపోయారు అంటున్నారు తెలుగు మీడియా వర్గాలు. చాలా లక్కీగా వాళ్ళ పేర్లు ఎక్కడా బయటకు రాలేదట.
నిజానికి దొరికింది ఒక గ్రూపునకు చెందిన డ్రగ్ పెడ్లర్లే కాబట్టి.. కేవలం ఆ గ్రూపుతో సన్నిహిత సంబంధాలు ఉన్నవారు మాత్రమే ఇప్పుడు పోలీసు విచారణ ఎదుర్కొంటున్నారట. అయితే ఇతర పెడ్లర్లు ఇతర స్మగ్లర్లు ద్వారా ఇప్పటికే డ్రగ్స్ వాడుతున్న చాలామంది మాత్రం.. ఎలర్ట్ అయిపోయి ఇప్పటికిప్పుడు అలాంటి లావాదేవీలన్నీ ఆపేశారు కాని.. ఒకవేళ వీరిపేరు ఎక్కడైనా వస్తుందేమో అని కంగారుపడుతున్నారు. తమకు తెలిసిన సన్నహితులు రాజకీయ నాయకుల ద్వారా ఇప్పటికే పైరవీలు చేయించి.. ఎక్కడా వీరి పేరు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు.. ఒక్కోసారి మీడియాలో పేర్లు లేకుండా హింట్లు ఇస్తూ స్టోరీలు వచ్చేస్తున్నాయి.. అవి కూడా రాకుండా మనోళ్లు మేనేజ్ చేస్తున్నారట. ఇలా ఒత్తిడి తెస్తున్న చేపల్లో చాలా పెద్ద చేపలే ఉన్నాయని.. వాటిని టచ్ చేస్తే చాలామంది పొలిటికల్ లీడర్లకు కూడా ఇబ్బందేనని అంటున్నారు.
ఇకపోతే ఇటువంటి ఒత్తిళ్ళకు తలొగ్గకుండా ప్రస్తుతం అకున్ సభర్వాల్ అండ్ టీమ్ గట్టిగానే ఎంక్వయిరీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి రానున్న కాలంలో ఎన్నెన్ని చేపలు ఈ వలలో చిక్కుకుని విలవిలలాడిపోతాయో.. ఎన్నెన్ని తెలివిగా తప్పించుకుని గంగ్నామ్ స్టయిల్ లో డ్యాన్సు వేస్తాయో చూడాలి. బట్ నిజం నిప్పులాంటిది కాబట్టి కనీసం పొగైనా రాకుండా ఉండదులే.