Begin typing your search above and press return to search.
దుల్కార్ వెంట బడా నిర్మాతలు..కారణం అదేనా?
By: Tupaki Desk | 24 Aug 2022 9:33 AM GMT'సీతారామం' విజయంతో దుల్కార్ సల్మాన్ రామ్ పాత్రలో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయాడు. గొప్ప దేశ భక్తుడిగా...అజరామర ప్రేమికుడిగా దుల్కార్ కొన్నాళ్ల పాటు తెలుగు ప్రేక్షకుల నోళ్లలో నానుతూనే ఉంటాడు. రామ్ పాత్ర టాలీవుడ్ ఆడియన్స్ లోకి అంత బలంగా వెళ్లింది. ఈ సినిమా తో దుల్కార్ కి లవర్ బోయ్ ఇమేజ్ మరింత స్ర్టాగ్ అయిందని చెప్పొచ్చు.
మణిరత్నం తెరకెక్కించిన 'ఒకే బంగారంతో' తొలిసారి లవర్ బోయ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఆ తర్వాత అంతటి హిట్ 'సీతారామం'తోనే దక్కింది. ప్రస్తుతం దుల్కార్ పేరు టాలీవుడ్ లో మారు మ్రోగిపోతుంది. కమర్శియల్ గాను సినిమా మంచి వసూళ్లను సాధించింది. ఓ పరభాషా నటుడు 70 కోట్లకు పైగా వసూళ్లు తేవడం అంటే? చిన్న విషయం కాదు.
అలాంటి ఫీట్ ఇంత వరకూ టైర్ -2 హీరోల్లో కొంత మందికే సాధ్యమైంది. కానీ దుల్కార్ ఆఫీట్ ని తొలి తెలుగు సినిమాతోనే సాధించాడు. అదీ ఓ లవ్ స్టోరీతో ఇలాంటి వసూళ్లు తేవడం అంటే దుల్కార్ ప్రభావం ప్రేక్షకుల్లో ఎంత బలంగా ఉందో అద్దం పడుతుంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థల కళ్లు ఇప్పుడు దుల్కార్ పై పడుతున్నాయా? అంటే అవుననే వినిపిస్తుంది.
ఇప్పటికే రెండు..మూడు అగ్ర నిర్మాణ సంస్థలు దుల్కార్ కి అడ్వాన్సులు ఇచ్చే ప్రయత్నం చేసాయట. కానీ దుల్కార్ తీసుకోలేదుట. ప్రస్తుతం తాను మలయాళం సినిమాలతో బిజీగా ఉండటం సహా అక్కడ నిర్మాతగాను రాణిస్తున్నారు. ఆ బిజీ పూర్తయ్యే వరకూ తెలుగులో సినిమాలు చేయకూడదనుకుంటున్నాడుట. అవి మొత్తం పూర్తిచేసిన తర్వాత టాలీవుడ్ పై దృష్టి పెట్టే ఆలోచన లో ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే తెలుగు నిర్మాతలు ఇలా వెంటపడటం వెనుక మరో కారణం కూడా ఉందంటున్నారు.
దుల్కార్ స్ర్కిప్ట్ ఎంపికలో మంచి పట్టున్న నటుడు. హను రాఘవపూడి 'సీతారామం' నేరేషన్ సరిగ్గా ఇవ్వలేకపోయినాకథలో సోల్ క్యాచ్ చేసి ఒకే చెప్పారు. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకుల అభిరుచి కడా మారింది. డిఫరెంట్ లవ్ స్టోరీలను..ఇన్నోవేటివ్ కథలకి పెద్ద పీట వేస్తున్నారు. ఇటీవల టాలీవుడ్ నిర్మాతలు సైతం ఇదే విషయంపై భేటి అయ్యారు.
తెలుగు హీరోలు కొందరు ఇంకా రొటీన్ వేలో వెళ్తోన్న నేపథ్యంలో దుల్కార్ లాంటి నటుడ్ని లాక్ చేసుకోగల్గితే గనుక అతని నుంచి మరిన్ని అద్భుతాలు చేయడానికి ఛాన్స్ ఉంటుందన్న కోణంలోనూ సదరు నిర్మాతలు దుల్కార్ వెంట పడటానికి మరో కారణంగా వినిపిస్తుంది.