Begin typing your search above and press return to search.
ఆ ప్రొడక్షన్ హౌజ్ ఎత్తేసే టైమ్ వచ్చిందా...?
By: Tupaki Desk | 29 April 2020 11:30 PM GMTఇక ఆ పెద్ద నిర్మాణ సంస్థ పని ముగిసినట్లేనా.. ఏమో నిజమే అంటున్నారు. టాలీవుడ్ లో అతి పెద్ద నిర్మాణ సంస్థల్లో ఒకటైన ప్రొడక్షన్ హౌజ్ ఇప్పుడు మూసుకునే దశకి వచ్చేసింది. ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలందరితో సినిమాలు నిర్మించిన ఈ సంస్థ ఇప్పుడు యంగ్ హీరోలతో సినిమాలు తీస్తున్నప్పటికీ విజయాలను మాత్రం అందుకోలేకపోతోంది. ఇండస్ట్రీలో ప్రచార కార్యక్రమాలతో కలిపి ఆ నిర్మాతకు చిత్రరంగంతో అరవై ఏళ్ల అనుబంధముంది. నాలుగు దశాబ్దాలుగా చిత్ర నిర్మాణం చేస్తున్నారాయన.. 45 సినిమాలకు పైగా చిత్రాలను నిర్మించారు.. గతంలో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు తీసి ఇండస్ట్రీ హిట్స్ సాధించిన ఈ సంస్థ ఇప్పుడు ఒక్క హిట్ కోసం నానా తంటాలు పడుతోంది. ఈ ప్రొడక్షన్ హౌజ్ కి ఎన్నేళ్ల నుండో హిట్ అనేది అందని ద్రాక్షలా మిగిలిపోయిందని చెప్పవచ్చు.
వరుసగా ప్లాపులు పలకరించడంతో కొంచం గ్యాప్ తీసుకొని ఎన్నో ఆశలతో ఈ ఏడాది ఒక సినిమా రిలీజ్ చేసారు. మంచి క్రేజ్ ఉన్న యంగ్ హీరోని పెట్టి.. ఫార్మ్ లో ఉన్న డైరెక్టర్ తో భారీ బడ్జెట్ తో సినిమా చేసారు. కానీ ఆ సినిమా డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఆ సెన్సేషనల్ స్టార్ తమ నిర్మాణ సంస్థని గట్టెక్కిస్తాడు అని భావిస్తే అదే హీరో ఒక్క సినిమాతో పాతాళంలోకి తొక్కేసాడు. ఈ సినిమాతో బడా నిర్మాత అనిపించుకున్న ఆయన కింది స్థాయికి దిగజారిపోయాడు. వాస్తవానికి ఈ సినిమా కంటే ముందే ఎన్నో పరాజయాలు చవిచూసింది ఈ నిర్మాణ సంస్థ. తనకు వయసు మీద పడటంతో తన కొడుకుకి నిర్మాణ బాధ్యతలు అప్పగించాడు ఈ నిర్మాత. ఒక సినిమాలో హీరోగా చేసిన అనుభవమున్న అతని కొడుకు ఆ నిర్మాణ సంస్థని గట్టెక్కించాలని బాగా ట్రై చేసాడు. ఇప్పటికీ ట్రై చేస్తూనే ఉన్నాడు. కానీ అతనికి కూడా నిరాశే ఎదురైంది. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోలుగా వెలుగొందుతున్న హీరోలతో భారీ సినిమాలు తీసాడు. కానీ అవి ఘోర పరాజయాన్ని మూటగట్టుకొని భారీ నష్టాలను తెచ్చిపెట్టాయి.
ఒకప్పుడు బాలీవుడ్ డైరెక్టర్లను టాలీవుడ్ కి పరిచయం చేసిన ఈ సంస్థ డబ్బింగ్ సినిమాలపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇతర భాషల్లో మంచి విజయం సాధించిన సినిమాలను ఇక్కడ రీమేక్ చేసినప్పటికీ.. ఇక్కడ మాత్రం అవి ప్లాప్ సినిమాలుగా మిగిలిపోయాయి. దీనితో భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. ఎన్నో వరుస ప్లాపులు చూసిన ఈ సంస్థ ఇకపై సినిమా ప్రొడక్షన్ వైపు రాకపోవచ్చు అనే టాక్ ఫిల్మ్ ఛాంబర్ లో వినిపిస్తోంది. అయితే క్రైసిస్ తరువాత సినిమా వాళ్ళకి డబ్బులు.. ఫైనాన్సియర్స్ అవసరం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ వ్యాపారం లోకి దిగటానికి ఈ సంస్థ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఏదేమైనా ఒకప్పుడు ఇండస్ట్రీలో టాప్ ప్రొడక్షన్ హౌజ్ గా వెలుగొందిన సంస్థ ఇప్పుడు ఈ పొజిషన్ కి రావడం నిజంగా వారి బాడ్ లక్ అని చెప్పవచ్చు.